E-Paper
Advertisement

ఓటీటీలోకి వచ్చేసిన రాకాస.. సౌత్ ఇండియా ఆడియన్స్ కి స్పెషల్ సర్ప్రైజ్!

ఓటీటీలోకి వచ్చేసిన రాకాస.. సౌత్ ఇండియా ఆడియన్స్ కి స్పెషల్ సర్ప్రైజ్!
Advertisement

Raakasa Movie: థియేటర్లలో వచ్చిన ప్రతి సినిమా కూడా ఇప్పుడు ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చి ఓటీటీ ప్రియులను అలరిస్తున్న విషయం తెలిసిందే .అలా 2026 ఏప్రిల్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాకాస మూవీ నేడు ఓటీటీలోకి స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా థియేటర్లలో తెలుగులో విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈసారి మాత్రం ఓటీటీలో ఏకంగా సౌత్ ఇండియా ఆడియన్స్ కి స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తూ ప్రేక్షకుల ముందుకు రావడంతో ప్రతి ఒక్కరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాతల ఆలోచన తీరుకి ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి నిహారిక రాకాస మూవీ ఓటీటీలో ఆడియన్స్ కు ఎలాంటి సర్ప్రైజ్ ఇచ్చిందో ఇప్పుడు చూద్దాం.

సౌత్ ఆడియన్స్ కి స్పెషల్ సర్ప్రైజ్..

అసలు విషయంలోకి వెళ్తే.. సంగీత్ శోభన్ , నయన్ సారిక జంటగా వచ్చిన రాకాస మూవీ థియేటర్లలో కేవలం తెలుగులో మాత్రమే ఏప్రిల్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాంటి ఈ సినిమా నేడు (మే 1) ఓటిటి ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ వేదికగా తెలుగుతోపాటు దక్షిణాది భాషలైన తమిళ్, మలయాళం , కన్నడ భాషల్లో కూడా అందుబాటులోకి వచ్చింది. ఇక మొత్తానికైతే ఓటీటీ వెర్షన్ ఏకంగా నాలుగు భాషల్లో అందుబాటులోకి రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా విడుదల చేయడం వల్ల వివిధ ప్రాంతాలలోని విస్తృత ప్రేక్షక వర్గానికి ఈ సినిమా చేరువ అవుతుంది అని చెప్పవచ్చు..

సినిమాకి పిల్లర్ గా నిలిచిన హాస్య దిగ్గజాలు..

Advertisement

రాకాస సినిమా విషయానికి వస్తే.. అనుదీప్ దేవ్ అందించిన సంగీతం సినిమాకు ఫుల్ ఎనర్జీని అందించింది. ఉమేష్ కుమార్ గుప్త సహనిర్మాతగా వ్యవహరించిన ఈ ప్రాజెక్టును నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించింది. లేడీ డైరెక్టర్ మానస శర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మొదటి టాక్ తోనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో బ్రహ్మాజీ, తణికెళ్ళ భరణి, గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్ లాంటి దిగ్గజ హాస్యనటులు సినిమాకు మరింత ప్లస్గా మారారు. కథకు లోతును, హాస్యాన్ని జోడించి , ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచారు. మరి ఓటీటీలో ఈ సినిమా ఎలాంటి వ్యూస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

also read:గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన యంగ్ హీరోయిన్.. పుత్రికోత్సాహంలో తల్లి.. ఫోటోలు వైరల్!

రాకాస సినిమా స్టోరీ..

Advertisement

అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఇండియాలో తాను ప్రేమించిన సుకన్య అనే అమ్మాయిని వివాహం చేసుకోవాలని సొంతూరుకి వస్తాడు వీరు( సంగీత్ శోభన్). అయితే అప్పటికే సుకన్య పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతుంది. బ్రేకప్ బాధలో ఉన్న వీరు.. అదే సమయంలో సోము (వెన్నెల కిషోర్) అనే వ్యక్తిని హత్య చేశాడనే ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే అతని పాస్ పోర్ట్ ను పోలీసులు తీసుకెళ్లిపోతారు. సోము జాడను కనిపెడితే తన పాస్ పోర్ట్ తిరిగి వస్తుందని స్నేహితుడు బాలు (గెటప్ శ్రీను)తో కలసి సోముని వెతికే ప్రయత్నం చేస్తాడు.. అదే సమయంలో ఆ ఊరి చివరిలో ఎన్నో దశాబ్దాలుగా ఉన్న బ్రహ్మ రాక్షసుడికి నరబలి ఇవ్వాల్సిన సమయం వస్తుంది . దీంతో ఆ ఊరంతా కలిసి ఒక ముసలివాడిని బలివ్వడానికి సిద్ధమవుతారు. అయితే చివరి క్షణంలో అతడు చనిపోతాడు. దాంతో అతడికి బదులుగా బాలు వెళ్లాల్సి వస్తుంది. ఇక వీరు దానికి అడ్డుపడతాడు.. దీంతో బాలుకి బదులుగా వీరు ఆ కోటలోకి ప్రవేశిస్తాడు? ఆ తర్వాత ఏమైంది? ఆ కోట ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏంటి? నిజంగానే బ్రహ్మ రాక్షసుడు అక్కడ ఉన్నాడా ?ఈ ప్రయాణంలో హీరోయిన్తో పరిచయం ఎలా ఏర్పడింది? ఆమె ఎందుకు ఈ కోటలోకి వెళ్ళింది? సోము సంగతి ఏంటి ? ఇలా పలు ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×