E-Paper
Advertisement

Content Creator Phones: ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్ల కోసం అద్భుతమైన ఫోన్స్.. మిడ్ రేంజ్‌‌లో బెస్ట్ ఇవే..

Content Creator Phones: ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్ల కోసం అద్భుతమైన ఫోన్స్.. మిడ్ రేంజ్‌‌లో బెస్ట్ ఇవే..
Advertisement

Content Creator Affordable Phones| సోషల్ మీడియా కంటెంట్ క్రియేషన్‌కు ఖరీదైన కెమెరాలు అవసరం లేదు.
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్, స్టోరీస్, ప్రొడక్ట్ ఫోటోగ్రఫీ చేయడానికి ఖరీదైన కెమెరాలు లేదా ప్రొఫెషనల్ గేర్ లాంటివి అవసరం లేదు. మంచి స్మార్ట్‌ఫోన్ ఒక్కటే చాలు. ఇప్పుడు రూ.30,000 లోపు బడ్జెట్ ధరలోనే అద్భుతమైన కెమెరాలు, స్మూత్ పర్‌ఫామెన్స్ ఇచ్చే ఫోన్లు లభిస్తున్నాయి. ఈ ఫోన్లతో హై-క్వాలిటీ వీడియోలు, ప్రొఫెషనల్ లుక్ ఫోటోలు తీయవచ్చు. ఫాస్ట్ ఎడిటింగ్, స్మూత్ స్క్రోలింగ్, లాంగ్ రికార్డింగ్ సెషన్లకు కూడా సపోర్ట్ చేస్తాయి. ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్ల కోసం రూ.30,000 బడ్జెట్ లో ప్రస్తుతం బెస్ట్ ఫోన్లు ఇవే.

మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో – బ్యాలెన్స్‌డ్ క్రియేటర్ పర్‌ఫామెన్స్

మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో కంటెంట్ క్రియేషన్‌కు బలమైన కెమెరా సెటప్ ఇస్తుంది. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా.. 50MP + 10MP + 50MP. ఫ్రంట్‌లో కూడా 50MP సెల్ఫీ కెమెరా ఉంది. 6.7 అంగుళాల P-OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్‌గా ఉంటుంది. 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వల్ల బయట ఎండలో కూడా షూటింగ్, ఎడిటింగ్ చేయడం సులభంగా ఉంటుంది . మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఎక్స్‌ట్రీమ్ చిప్‌సెట్, 6000mAh పెద్ద బ్యాటరీతో లాంగ్ షూటింగ్ సెషన్లు సాధ్యం. 90W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది. దీని ధర రూ.29,485.

రియల్‌మీ GT 6 ఫాస్ట్ పర్‌ఫామెన్స్, బ్రైట్ డిస్‌ప్లే

Advertisement

రియల్‌మీ GT 6 పర్‌ఫామెన్స్, విజువల్ క్లారిటీపై దృష్టి పెట్టింది. 6.78 అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లే, డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది. 6000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్ స్క్రోలింగ్. స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్‌తో ఎడిటింగ్, యాప్స్ వేగంగా పనిచేస్తాయి. రియర్ కెమెరా.. 50MP + 50MP + 8MP, ఫ్రంట్‌లో 32MP సెల్ఫీ కెమెరా. 5500mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి. ఈ ఫోన్ ధర రూ.27,999

నథింగ్ ఫోన్ 3a – కెమెరా, బ్యాలెన్స్‌డ్ ఫీచర్లు

నథింగ్ ఫోన్ 3a క్లీన్ డిజైన్, బ్యాలెన్స్‌డ్ ఫీచర్లతో వస్తుంది. ట్రిపుల్ రియర్ కెమెరా.. 50MP + 50MP + 8MP, ఫ్రంట్‌లో 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్‌తో రోజువారీ కంటెంట్ క్రియేషన్ స్మూత్‌గా జరుగుతుంది. 6.77 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 3000 నిట్స్ బ్రైట్‌నెస్, 120Hz రిఫ్రెష్ రేట్. 5000mAh బ్యాటరీ, 50W ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ ధర కేవలం రూ. 24,999.

వివో V60e కెమెరా, బ్యాటరీ లైఫ్‌పై

Advertisement

వివో V60e పెద్ద బ్యాటరీతో హైలైట్ అవుతుంది. 6500mAh భారీ బ్యాటరీతో ఎక్కువసేపు ఉపయోగించవచ్చు. 90W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. 6.77 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 5000 నిట్స్ బ్రైట్‌నెస్. మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో చిప్‌సెట్. రియర్ కెమెరా.. 200MP + 8MP, ఫ్రంట్‌లో 50MP పవర్‌ఫుల్ సెల్ఫీ కెమెరా. వివో V60e ధర రూ.29,999.

Also Read: ఇన్‌స్టాగ్రామ్ vs యూట్యూబ్.. కంటెంట్ క్రియేటర్లకు అధిక సంపాదన ఇచ్చే ప్లాట్‌ఫామ్ ఏది?

షావోమీ 14 CV సెల్ఫీ, వ్లాగింగ్‌ కోసం బెస్ట్

షావోమీ 14 CV సెల్ఫీలు, వ్లాగింగ్ ఇష్టపడే క్రియేటర్లకు సరిపోతుంది. డ్యూయల్ 32MP ఫ్రంట్ కెమెరా సెటప్‌తో వీడియో క్లారిటీ, డెప్త్ మెరుగవుతాయి. రియర్ కెమెరా.. 50MP + 50MP + 12MPతో ప్రొఫెషనల్ ఫోటోలు, వీడియోలు వస్తాయి. 6.55 అంగుళాల AMOLED డిస్‌ప్లే, డాల్బీ విజన్ సపోర్ట్, 3000 నిట్స్ బ్రైట్‌నెస్, 120Hz రిఫ్రెష్ రేట్. స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్, 4700mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జింగ్. ఈ ఫోన్ ధర రూ. 26,999.

ఈ ఫోన్లు అద్భుతమైన కెమెరాలు, బలమైన పర్‌ఫామెన్స్ ఇస్తాయి. ఎక్కువ ఖర్చు చేయకుండానే మంచి కంటెంట్ తయారు చేయవచ్చు. సరైన ఫోన్ ఎంచుకుంటే కంటెంట్ క్వాలిటీ వెంటనే మెరుగవుతుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×