E-Paper
Advertisement

క్లీనింగ్ కష్టాలు లేవు,ప్లేట్లు అంటుకోవు..హెవీ డ్యూటీ నాన్-స్టిక్ శాండ్‌విచ్ మేకర్స్!

క్లీనింగ్ కష్టాలు లేవు,ప్లేట్లు అంటుకోవు..హెవీ డ్యూటీ నాన్-స్టిక్ శాండ్‌విచ్ మేకర్స్!
Advertisement

Best Sandwich Maker For Daily Use: ఉదయం లేవగానే ఆఫీస్‌కి, స్కూల్‌కి టైమ్ అయిపోతుంటే.. హెల్తీగా, టేస్టీగా బ్రేక్‌ఫాస్ట్ చేయడం ఒక పెద్ద టాస్క్. అలాంటి టైమ్‌లో శాండ్‌విచ్ మేకర్ ఉంటే చాలు, ఐదు నిమిషాల్లో వేడివేడి క్రిస్పీ శాండ్‌విచ్స్ రెడీ అయిపోతాయి. ఇలా తరచూ వాడాలంటే ప్లేట్లు పాడవ్వకుండా, ఆహారం అంటుకోకుండా ఉండే గట్టి నాన్-స్టిక్ కోటింగ్ చాలా ముఖ్యం. మీ కిచెన్ లోని పనిని ఈజీ చేసేలా మార్కెట్లో ఉన్న 5 బెస్ట్ డ్యూరబుల్ శాండ్‌విచ్ మేకర్ల వివరాలు, ధరల గురించిన పూర్తి వివరాలు.

టాప్ 5 డ్యూరబుల్ నాన్-స్టిక్ శాండ్‌విచ్ మేకర్స్:

1.ఫిలిప్స్ డొమెస్టిక్ అప్లయన్సెస్ HD2393 (Philips Domestic Appliances HD2393):

హోమ్ అప్లయన్సెస్ అనగానే గుర్తొచ్చే.. నమ్మకమైన బ్రాండ్ ఫిలిప్స్.దీని నాన్-స్టిక్ కోటింగ్ చాలా థిక్ అండ్ క్వాలిటీగా ఉంటుంది.దీని స్పెషల్ కట్ అండ్ సీల్ ప్లేట్స్ వల్ల చీజ్ లేదా లోపల పెట్టే స్టఫింగ్ అస్సలు బయటకు రాదు. హై టెంపరేచర్ పవర్ వల్ల  దీనిలో ఫుడ్ త్వరగా వేడెక్కుతుంది. అంతే కాకుండా కూల్-టచ్ హ్యాండిల్, సేఫ్టీ లాక్ కూడా దీనిలొ ఉన్నాయి. దీనిలో నిలువుగా కూడా ఫుడ్ స్టోర్ చేసుకోవచ్చు . ధర రూ.1,999 నుంచి 2,200 మధ్య ఉంటుంది.

2. ప్రెస్టీజ్ పీజీఎంఎఫ్ 06 (Prestige PGMFD 06):

Advertisement

ఇండియన్ కిచెన్స్‌లో ప్రెస్టీజ్ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ వేరు. ఈ మోడల్ చాలా సింపుల్, ఎఫెక్టివ్ అండ్ లాంగ్ లాస్టింగ్. దీని లోపల ఉండే హెవీ-డ్యూటీ అల్యూమినియం గ్రిల్ ప్లేట్స్ హీట్‌ను సమానంగా పంచుతాయి. టాక్సిక్ రహిత డై-కాస్ట్ అల్యూమినియం ప్లేట్స్, 800 వాట్స్ పవర్, పవర్ ఇండికేటర్ లైట్స్ దీనిలోని ప్రత్యేకతల. దీని ద్వారా ఆయిల్ లేకుండా కూడా క్రిస్పీగా టోస్ట్ చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే దీని ధర రూ.1199 నుంచి రూ.1,550 వరకు ఉంటుంది.

3. బోరోసిల్ సూపర్ గ్రిల్ (Borosil Super Grill 2000W):

మీరు జంబో సైజ్ శాండ్‌విచ్‌లు లేదా ఒకేసారి రెండు, మూడు శాండ్‌విచ్‌లు గ్రిల్ చేయాలనుకుంటే.. ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. అంతే కాకుండా ఇది కాస్త పెద్దది, ఫ్యామిలీస్ కోసం బాగా సెట్ అవుతుంది. దీని డ్యూరబుల్ నాన్-స్టిక్ ప్లేట్స్ ఏళ్ల తరబడి కొత్తవాటిలా ఉంటాయి.దీనిలో 2000 వాట్స్ పవర్ (చాలా ఫాస్ట్), ఆయిల్ కలెక్ట్ చేయడానికి విడిగా ట్రే ఉంటుంది. 180 డిగ్రీల ఓపెన్ గ్రిల్లింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. కాబట్టి దీని ధర 3,500 నుంచి రూ.3,900 వరకు ఉంటుంది.

4. మోర్ఫీ రిచర్డ్స్ నోవో గ్రిల్ (Morphy Richards Novo Grill):

Advertisement

ప్రీమియం లుక్ ,లాంగ్ లైఫ్ కోరుకునే.. వారి కోసం మోర్ఫీ రిచర్డ్స్ బెస్ట్ ఆప్షన్. దీని గ్రిల్ ప్లేట్లు చాలా డీప్ డిజైన్‌తో వస్తాయి. కాబట్టి లోపల స్టఫింగ్ ఎక్కువ పెట్టినా శాండ్‌విచ్ ఈజీగా ప్రెస్ అవుతుంది. యాంటీ-స్కిడ్ బేస్, థర్మోస్టాటిక్ కంట్రోల్ (ఓవర్ హీట్ అవ్వకుండా ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది), 800 వాట్స్ పవర్ దీనిలో బెస్ట్ ఫీచర్లు. దీని క్లీనింగ్ కూడా చాలా ఈజీ. ఇదిలా ఉంటే.. దీని ధర సుమారు రూ. 2,100 నుంచి రూ.2,400 వరకు ఉంటుంది.

Also Read: కరెంట్ పోయినా నో టెన్షన్, రూ.11 వేలలోపే టాప్ బ్రాండెడ్ ఇన్వర్టర్ బ్యాటరీస్!

5. కెంట్ శాండ్‌విచ్ మేకర్ (KENT Sandwich Maker 700W):

తక్కువ బడ్జెట్లో సూపర్ క్వాలిటీ వెతుకుతుంటే.. కెంట్ కంపెనీ వారి ఈ మోడల్ అదిరిపోతుంది. ఇది పవర్‌ను తక్కువగా వాడుకుంటూనే చక్కటి క్రిస్పీ ఫినిషింగ్ ఇస్తుంది. 700 వాట్స్ పవర్, రోజూ వాడుకోవడానికి అనువైన అడ్వాన్స్‌డ్ టెఫ్లాన్ కోటింగ్ దీనిలో ప్రత్యేకతలు. ఇది సైజులో చిన్నది కాబట్టి కిచెన్ ప్లాట్‌ఫామ్‌పై ఎక్కువ ప్లేస్ తీసుకోదు. సుమారు రూ.1,199 నుంచి రూ.1,350 వరకు ధర ఉంటుంది.

డ్యూరబుల్ నాన్-స్టిక్ ప్లేట్స్ ఉండే.. శాండ్‌విచ్ మేకర్ వల్ల అతి తక్కువ నూనె లేదా వెన్నతో హెల్తీ బ్రేక్‌ ఫాస్ట్ రెడీ చేసుకోవచ్చు. మీది చిన్న ఫ్యామిలీ అయితే.. Prestige లేదా Philips బెస్ట్ ఛాయిస్. బడ్జెట్ తక్కువలో కావాలంటే..KENT, పెద్ద సైజ్ గ్రిల్లింగ్ కావాలంటే.. Borosil వైపు వెళ్ళొచ్చు. రోజూ ఉదయం టెన్షన్ లేకుండా.. హెల్తీ స్నాక్స్ ఎంజాయ్ చేయడానికి ఈరోజే.. మీ కిచెన్‌లోకి ఒక మంచి శాండ్‌విచ్ మేకర్‌ను తెచ్చేసుకోండి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×