E-Paper
Advertisement

ఇలాంటి ఛాన్స్ మళ్లీ రాదేమో.. స్మార్ట్ ఫ్రిడ్జ్‌లపై ఏకంగా రూ.57,000 తగ్గింది.. ఎక్కడ కొనుగోలు చేయాలంటే?

ఇలాంటి ఛాన్స్ మళ్లీ రాదేమో.. స్మార్ట్ ఫ్రిడ్జ్‌లపై ఏకంగా రూ.57,000 తగ్గింది.. ఎక్కడ కొనుగోలు చేయాలంటే?
Advertisement

Best Refrigerator Deals: సాధారణంగా ప్రతి ఇంట్లోనూ ఏడాది పొడవునా ఆన్‌లో ఉండే పరికరం ఏదైనా ఉందంటే.. అది ఫ్రిడ్జ్ మాత్రమే. ఎందుకంటే.. ప్రతి నిత్యం మనకు ఫ్రిడ్జ్‌తో అవసరం ఉంటుంది కాబట్టి. ఈ క్రమంలో ఎక్కువ రోజులు మన్నిక వచ్చే ఫ్రిడ్జ్ కొనానుకుంటున్న వారికి ఇదే సరైన సమయం అని చెప్పవచ్చు. ఎందుకంటే.. ఈ వారం ప్రముఖ కంపెనీల ఫ్రిడ్జ్‌లపై మార్కెట్లో భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్ ధరలో వచ్చే డబుల్ డోర్ మోడల్స్ నుంచి, ప్రీమియం లుక్ ఇచ్చే పెద్ద సైడ్-బై-సైడ్ రెఫ్రిజిరేటర్ల వరకు అన్నింటిపైనా భారీ ఆఫర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శాంసంగ్, బాష్, ఎల్‌జీ, హయ్యర్ బ్రాండ్లలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న బెస్ట్ డీల్స్, వాటి ఫీచర్ల వివరాలు మీ కోసం..

స్మార్ట్ ఫీచర్లతో Samsung Bespoke AI:

కొత్త టెక్నాలజీతో కూడిన స్మార్ట్ ఫ్రిడ్జ్ కోసం చూస్తుంటే.. శాంసంగ్ 330 లీటర్ల మోడల్ మంచి ఎంపిక. దీని అసలు ధర కంటే చాలా తక్కువకే, అంటే ప్రస్తుతం రూ.41,990కే ఇది లభిస్తోంది. దీనిలో ఉన్న ఏఐ ఎనర్జీ మోడ్ వల్ల కరెంట్ బిల్లు ఆదా అవుతుంది. అంతేకాకుండా.. మన అవసరాలకు తగ్గట్టుగా ఫ్రిడ్జ్, ఫ్రీజర్ భాగాలను మార్చుకునే 5-ఇన్-1 కన్వర్టిబుల్ సిస్టమ్ కూడా ఉంది. ఇంట్లో నలుగురు ఉన్న కుటుంబాలకు ఇది చక్కగా సరిపోతుంది. స్మార్ట్‌ఫోన్ ద్వారా ఫ్రిడ్జ్‌ను కంట్రోల్ చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.

భారీ డిస్కౌంట్‌తో Bosch Triple Door:

Advertisement

ఈ వారం ఆఫర్లలో అందరినీ ఆకట్టుకుంటున్నది బాష్ 302 లీటర్ల ట్రిపుల్ డోర్ ఫ్రిడ్జ్. దీనిపై ఏకంగా 35 శాతం వరకు తగ్గింపు ఉండటంతో, దీని ధర ఇప్పుడు కేవలం రూ.37,800 మాత్రమే. దీనిలో ప్రత్యేకంగా మధ్యలో ఒక డోర్ ఉంటుంది, దీనిని మన అవసరాలకు తగ్గట్టుగా 8 రకాలుగా వాడుకోవచ్చు. ఆహార పదార్థాలు 10 రోజుల పాటు తాజాగా ఉంటాయని కంపెనీ చెబుతోంది. వోల్టేజ్ హెచ్చుతగ్గులను తట్టుకునే సామర్థ్యం ఉండటం వల్ల మన భారతీయ ఇళ్లకు ఇది చాలా నమ్ముకోదగినది.

Also Read: పాత జ్ఞాపకాలు గుర్తొచ్చేలా.. నోకియా కంపెనీ నుంచి ఊహించని క్రేజీ ఫోన్.. లీకైన లుక్స్ చూశారా?

పెద్ద కుటుంబాలకు Higher side-by-side:

Advertisement

ఇంట్లో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉంటే.. హయ్యర్ 598 లీటర్ల సైడ్-బై-సైడ్ ఫ్రిడ్జ్ ఉత్తమం. దీనిపై ఏకంగా రూ.57,100 భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఇప్పుడు ఇది రూ.78,690కే అందుబాటులో ఉంది. పెద్ద వంటగది ఉండి, ఎక్కువ సామాగ్రి పెట్టుకోవాలనుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ ఫ్రిడ్జ్‌ చూసేందుకు చాలా ప్రీమియం లుక్‌తో, వేలిముద్రలు పడని గ్రాఫైట్ బ్లాక్ ఫినిషింగ్‌తో వస్తుంది. కరెంట్ వినియోగం కాస్త ఎక్కువే అయినా, దీని సామర్థ్యం ముందు అది తక్కువే.

నమ్మకమైన LG Convertible:

మధ్యతరగతి కుటుంబాల నమ్మకమైన బ్రాండ్ ఎల్‌జీ. దీని 276 లీటర్ల మోడల్ ఇప్పుడు రూ.32,990కే దొరుకుతోంది. దీనిలో ఉన్న మల్టీ-ఎయిర్ ఫ్లో సిస్టమ్ వల్ల ఫ్రిడ్జ్ అంతటా సమానంగా కూలింగ్ అందుతుంది. కరెంట్ పోయినప్పుడు హోమ్ ఇన్వర్టర్‌కు ఆటోమేటిక్‌గా కనెక్ట్ అయ్యే ఫీచర్ ఇందులో ఉండటం పెద్ద ప్లస్ పాయింట్. పాల ఉత్పత్తులను ప్రత్యేకంగా నిల్వ చేసుకోవడానికి ఇందులో డైరీ మోడ్ ఇచ్చారు. సర్వీస్ పరంగా కూడా ఎల్‌జీ నెట్‌వర్క్ చాలా బాగుంటుంది.

ఏది కొనడం ఉత్తమం?

తక్కువ ధరలో ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ, మంచి బిల్డ్ క్వాలిటీ కావాలనుకుంటే బాష్ ఫ్రిడ్జ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. టెక్నాలజీ, ఫోన్ కనెక్టివిటీ ముఖ్యం అనుకుంటే శాంసంగ్‌ను పరిశీలించవచ్చు. బడ్జెట్ పరిధిలో బ్రాండ్ నమ్మకం కావాలంటే ఎల్‌జీ, అలాగే పెద్ద ఫ్రిడ్జ్ కావాలనుకునే వారికి హయ్యర్ మోడల్ సరైన ఎంపిక.ఇంట్లో మనుషుల సంఖ్య, బడ్జెట్‌ను బట్టి ఈ ఆఫర్లలో మీకు నచ్చిన ఫ్రిడ్జ్‌ను ఎంచుకోవచ్చు. అయితే ఈ ఆఫర్లు పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటాయని గుర్తుంచుకోండి.

Also Read: iPhone 18 Pro లాంచ్ డేట్ వచ్చేసిందోచ్.. వేరియబుల్ అపెర్చర్ కెమెరా, 12GB RAMతో ఊచకోత!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×