E-Paper
Advertisement

సెల్ఫ్ బ్యాలెన్సింగ్ టెక్నాలజీతో హీరో కొత్త ఈవీ.. మూడు చక్రాల స్కూటర్ ఏముంది భయ్యా!

సెల్ఫ్ బ్యాలెన్సింగ్ టెక్నాలజీతో హీరో కొత్త ఈవీ..  మూడు చక్రాల స్కూటర్ ఏముంది భయ్యా!
Advertisement

Hero Vida NEX 2: EV Trike: ప్రముఖ ఈవీ దిగ్గజం  హీరో విడా మరో క్రేజీ ఎలక్ట్రిక్ వాహనాన్ని తీసుకురావడానికి రెడీ అవుతోంది. డా నెక్స్ 2 పేరుతో దీనిని మార్కెట్ కు పరిచయం చేయబోతోంది. ఈ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ ట్రైక్‌ కు కంపెనీ భారత్ లో డిజైన్ పేటెంట్ ను ఫైల్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ ట్రైక్‌ ను మొదటిసారిగా EICMA 2025 ఆటో షోలో కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శించారు. ఇప్పుడు దాఖలైన పేటెంట్ చిత్రాలను పరిశీలిస్తే, అప్పట్లో చూపించిన డిజైన్‌ లో పెద్దగా మార్పులు కనిపించడం లేదు. అంటే ఉత్పత్తి మోడల్ కూడా దాదాపు ఇదే రూపంలో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ముందు రెండు వీల్స్, వెనుక ఒక వీల్   

విడా నెక్స్ 2లో ముందు భాగంలో రెండు చక్రాలు, వెనుక భాగంలో ఒక చక్రం ఉండే రివర్స్ ట్రైక్ డిజైన్ ఉంటుంది. ఈ నిర్మాణం వల్ల సాధారణ స్కూటర్‌ తో పోలిస్తే మరింత స్టెబులిటీ లభిస్తుంది. అదే సమయంలో మలుపులు తిరిగేటప్పుడు కూడా మంచి కంట్రోల్ ఉంటుంది.

Advertisement

డిజైన్ పరంగా చూస్తే, పెద్ద విండ్‌ స్క్రీన్, సన్నని LED హెడ్‌ లైట్లు, ఏరోడైనమిక్ బాడీ, స్పోర్టీ టెయిల్ సెక్షన్ ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. V ఆకారపు అల్లాయ్ వీల్స్, మడత పెట్టే ఫుట్‌ పెగ్స్, స్ట్రాంగ్ గ్రాబ్ రైల్స్, ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ లాంటి అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

సెల్ఫ్ బ్యాలెన్సింగ్ టెక్నాలజీతో..

ఈ వెహికల్ ప్రధాన ఆకర్షణ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ టెక్నాలజీ. తక్కువ వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు కూడా వెహికల్ ఎలాంటి ఇబ్బంది లేకుండా నిలబడి ఉంటుంది. రైడర్ కాళ్లు నేల మీద పెట్టాల్సిన అవసరం తగ్గుతుంది. ముఖ్యంగా సిటీ ట్రాఫిక్‌ లో ఈ ఫీచర్ ఎంతో ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది.  ముందు భాగంలో ఉన్న ప్రత్యేక సస్పెన్షన్ వ్యవస్థ కూడా ఈ ట్రైక్ ప్రత్యేకతల్లో ఒకటి. అదనంగా ఒక వీల్ ఉన్నప్పటికీ, మలుపులు తిరిగేటప్పుడు వాహనం సహజంగా వంగే విధంగా దీన్ని రూపొందించే అవకాశం ఉంది. దీంతో సాధారణ మోటార్‌ సైకిల్‌ ను నడిపిన అనుభూతి కలుగుతుందని కంపెనీ వెల్లడించింది.

Advertisement

రోజువారీ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని స్టోరేజ్ సదుపాయంపై కూడా హీరో ప్రత్యేక శ్రద్ధ చూపింది. ముందు భాగంలో పెద్ద స్టోరేజ్ కంపార్ట్‌ మెంట్ ఉండేలా డిజైన్ చేశారు. చిన్నచిన్న సామాన్లు, బ్యాగ్‌ లను సులభంగా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది.

పవర్ ట్రెయిన్ గురించి..

పవర్‌ట్రెయిన్ వివరాలను హీరో ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఎక్కువ టార్క్ అందించే ఎలక్ట్రిక్ మోటార్, డైరెక్ట్ డ్రైవ్ సిస్టమ్‌ తో రానున్నట్లు భావిస్తున్నారు. బ్యాటరీని ఛాసిస్ దిగువ భాగంలో అమర్చడం వల్ల వాహనం మరింత స్టేబుల్ గా ఉండనుంది.  ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్లకు పైగా రేంజ్ అందించే అవకాశం ఉందని అంచనా. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండొచ్చని తెలుస్తోంది.

Read Also: తక్కువ ధరలో 360 కి.మీ రేంజ్.. కియా నుంచి అదిరిపోయే PV5 EV ఎంట్రీ!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×