E-Paper
Advertisement

పవర్ బ్యాంక్ కొనేముందు తప్పక చెక్ చేయాల్సిన 5 ఫీచర్లు.. కెపాసిటీ ఒక్కటే సరిపోదు!

పవర్ బ్యాంక్ కొనేముందు తప్పక చెక్ చేయాల్సిన 5 ఫీచర్లు.. కెపాసిటీ ఒక్కటే సరిపోదు!
Advertisement

Best Power Bank: స్మార్ట్‌ఫోన్ వాడే చాలామంది దగ్గర పవర్‌బ్యాంక్ అనేది కచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణాలు చేసేవారికి, ఆఫీస్ బయట పనులు చూసుకునేవారికి ఇది చాలా అవసరం. అయితే కేవలం ఫోన్ ఛార్జింగ్ కోసం మాత్రమే కాకుండా.. సరైన పవర్‌బ్యాంక్‌ను ఎంచుకోవడం, దానిని సురక్షితంగా వాడటం కూడా అంతే ముఖ్యం. నిర్లక్ష్యం చేస్తే బ్యాటరీ పాడవటం లేదా వేడెక్కడం వంటి సమస్యలు వస్తాయి. ఈ నేపథ్యంలో మన అవసరాలకు ఎంత కెపాసిటీ ఉన్న పవర్‌బ్యాంక్‌ను ఎంచుకోవాలి? దానిని వాడే సరైన విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పవర్‌బ్యాంక్ సామర్థ్యం ఎంత ఉండాలి?

సాధారణంగా పవర్‌బ్యాంక్ సామర్థ్యాన్ని mAh లలో కొలుస్తారు. రోజువారీ అవసరాల కోసం 10,000mAh సామర్థ్యం ఉన్న పవర్‌బ్యాంక్ సరిపోతుంది. ఇది జేబులో లేదా బ్యాగులో సులభంగా ఇమిడిపోతుంది. దీని ద్వారా మన ఫోన్‌ను ఒకటి లేదా రెండు సార్లు పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు.

Advertisement

Also Read: ఏసీ ఉండి కూడా ఇల్లు చల్లబడట్లేదా? అయితే చాలామంది చేసే ఈ 5 తప్పులే కారణం!

ఎక్కువ డివైజ్‌ల కోసం ఏది బెస్ట్?

ఒకవేళ ఫోన్‌ను ఎక్కువగా వాడినా లేదా ప్రయాణాల్లో ఉన్నా 20,000mAh పవర్‌బ్యాంక్ ఉపయోగపడుతుంది. దీంతో ఫోన్‌తో పాటు ఇయర్‌బడ్స్, స్మార్ట్‌వాచ్ వంటి వాటిని కూడా ఛార్జ్ చేయవచ్చు. లేదంటే లాప్‌టాప్ లేదా ఒకేసారి ఎక్కువ డివైజ్‌లను ఛార్జ్ చేయాలనుకుంటే మాత్రం 20,000mAh కంటే ఎక్కువ సామర్థ్యం ఉండి, టైప్-సి పోర్ట్ ఉన్నది ఎంచుకోవాలి.

కొనే ముందు గమనించాల్సినవి:

Advertisement

పవర్‌బ్యాంక్ కొనేటప్పుడు కేవలం సామర్థ్యం మాత్రమే కాకుండా కొన్ని ముఖ్యమైన ఫీచర్లను కూడా చూడాలి. వేగంగా ఛార్జ్ అయ్యే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, ఎక్కువ డివైజ్‌ల కోసం మల్టిపుల్ పోర్ట్స్, బ్యాటరీ స్థాయిని తెలిపే ఇండికేటర్లు ఉన్నవి తీసుకోవాలి. అలాగే నమ్మకమైన బ్రాండ్ల పవర్‌బ్యాంక్‌లను ఎంచుకుంటే అవి ఎక్కువ కాలం మన్నికగా ఉండి, సురక్షితంగా పనిచేస్తాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

వీటిలో ఉండే లిథియం-అయాన్ బ్యాటరీలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పవర్‌బ్యాంక్‌ను ఎండలో లేదా వేడిగా ఉండే కార్లలో ఉంచకూడదు. పాడైపోయిన కేబుల్స్ వాడటం మంచిది కాదు. ముఖ్యంగా ఛార్జింగ్ అవుతున్నప్పుడు దానిని దిండ్లు, దుప్పట్ల కింద పెట్టకూడదు. పవర్‌బ్యాంక్ ఉబ్బినా లేదా ఏదైనా కాలిపోయిన వాసన వచ్చినా వెంటనే స్విచ్ ఆపేయాలి.

Also Read: స్మార్ట్‌వాచ్‌తో షుగర్ టెస్ట్ సాధ్యమేనా? అసలు గుట్టు విప్పిన అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×