E-Paper
Advertisement

కవిత పార్టీకి బిగ్ షాక్.. టీఆర్ఎస్ పేరుపై కీలక మలుపు, వెల్లువెత్తిన 700 అభ్యంతరాలు, తెర వెనుక..

కవిత పార్టీకి బిగ్ షాక్..  టీఆర్ఎస్ పేరుపై కీలక మలుపు, వెల్లువెత్తిన 700 అభ్యంతరాలు, తెర వెనుక..
Advertisement

Hyderabad: తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్-TRS పేరుపై రాజకీయ పార్టీల మధ్య వార్ మొదలైంది. తెలంగాణ రక్షణ సేన-టీఆర్ఎస్ పేరుతో కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసిన పార్టీ పేరుపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమైనట్టు సమాచారం. ఈ పేరుపై దాదాపు వందలాది అభ్యంతరాలు ఈసీకి వెళ్లినట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ శ్రేణులు షాకైనట్టు వార్తలు వస్తున్నాయి.

కవిత పార్టీకి బిగ్ షాక్.. టీఆర్ఎస్ పేరుపై కీలక మలుపు

Advertisement

బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ తర్వాత కవిత తన మద్దతుదారులతో తెలంగాణ రక్షణ సేన-TRS పేరుతో పార్టీ ఏర్పాటు చేశారు. కవిత టీఆర్ఎస్ పార్టీ టైటిల్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. తొలుత కేసీఆర్ నిర్వహించిన పార్టీ కాలక్రమేణా బీఆర్ఎస్ గా మారింది. దీంతో కవిత పార్టీ పేరును టీఆర్ఎస్‌గా నిర్ణయించారు.

ఈ పార్టీ పేరు ఖరారుపై ఈసీకి బీఆర్ఎస్‌తోపాటు ఇతరుల నుంచి అభ్యంతరాలు రావడం మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి వెళ్లడంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. కవిత పార్టీ ప్రకటనకు ముందు మహారాష్ట్రలోని సోలాపూర్ కేంద్రంగా పని చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన- టీఆర్ఎస్ పేరు తమకు కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సదరు వ్యక్తి ఆశ్రయించినట్లు తెలుస్తోంది.

Advertisement

వెల్లువెత్తిన 700 అభ్యంతరాలు, మరి పేరు మారుతుందా?

సోలాపూర్‌కు చెందిన దయానంద్ మహాదేవ్.. కవిత పార్టీ ప్రకటనకు ఓ రోజు ముందే ఈసీఐకి దరఖాస్తు చేసినట్లు సమాచారం. దీనికితోడు కవిత పార్టీ పేరుపై బీఆర్ఎస్ కూడా అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కవిత పార్టీకి టీఆర్ఎస్ పేరు ఉంటుందా? ఉండదా? అనే టెన్షన్ ఆ పార్టీ నేతలు, కార్యకర్తల్లో మొదలైనట్టు ఛానెల్‌లో వార్తలు వస్తున్నాయి.

దీని వెనుక బీఆర్ఎస్ నేతలు ఉన్నారని తమ ఆవేదనను బయటపెడుతున్నారు. ఈ నేపథ్యంలో కవిత ప్రజల మద్దతు సంపాదించుకోవడం కంటే, పార్టీ టైటిల్ వ్యవహారం తలనొప్పిగా తయారైందని అంటున్నవాళ్లూ లేకపోలేదు. టైటిల్ గండం నుంచి కవిత ఏ విధంగా బయటపడతారో చూడాలి.

ALSO READ: తెలంగాణ రైతులకు బంపర్ ఆఫర్.. ఆ రకం నేలల పునరుద్ధరణకు 90% సబ్సిడీ..?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×