E-Paper
Advertisement

Inverter Battery Deals: వేసవి వచ్చేసింది.. కరెంట్ కోతలకు బెస్ట్ ఇన్‌వర్టర్ బ్యాటరీలు.. ఆన్‌లైన్‌లో బెస్ట్ డీల్స్

Inverter Battery Deals: వేసవి వచ్చేసింది.. కరెంట్ కోతలకు బెస్ట్ ఇన్‌వర్టర్ బ్యాటరీలు.. ఆన్‌లైన్‌లో బెస్ట్ డీల్స్
Advertisement

Inverter Battery Deals| వేసవిలో తరచుగా విద్యుత్ కోతలు జరుగుతుంటాయి. దీనివల్ల ప్రతి ఇంట్లో మంచి ఇన్వర్టర్ బ్యాటరీ తప్పనిసరి అవుతుంది. చాలామంది తక్కువ క్వాలిటీ బ్యాటరీలు కొని తరచూ మార్చాల్సి వస్తుంది. ఇది దీర్ఘకాలంలో ఖర్చు పెంచుతుంది. అమెజాన్‌లో ఇప్పుడు మంచి డిస్కౌంట్‌తో క్వాలిటీ ఇన్వర్టర్ బ్యాటరీలు లభిస్తున్నాయి. ఇవి ఎక్కువ కాలం పాటు మంచి పనితీరు ఇస్తాయి.

మైక్రోటెక్ లిథియం-ఐఆన్ MLB1280060

ఈ బ్యాటరీ అడ్వాన్స్‌డ్ LiFePO4 టెక్నాలజీ ఉపయోగిస్తుంది. బరువు కేవలం 13.8 కిలోలు మాత్రమే. సాధారణ లెడ్ యాసిడ్ బ్యాటరీలు 50 కిలోలు పైగా ఉంటాయి. 100Ah కెపాసిటీ, 1280Wh ఎనర్జీ ఇస్తుంది. సింక్‌ఛార్జ్ టెక్నాలజీ, BMS ప్రొటెక్షన్ ఉన్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్, జీరో మెయింటెనెన్స్. 5 సంవత్సరాల వారంటీ ఉంది. లిథియం సపోర్ట్ ఇన్వర్టర్‌లతో బాగా పని చేస్తుంది.

గ్రాఫీన్ 12V 100Ah లిథియం బ్యాటరీ

Advertisement

ఇది లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ బ్యాటరీ. 180Ah లెడ్ యాసిడ్ బ్యాటరీకి సమానమైన బ్యాకప్ ఇస్తుంది. 1075VA వరకు సాధారణ ఇన్వర్టర్‌లతో పని చేస్తుంది. 25 సంవత్సరాల వరకు లైఫ్‌స్పాన్ (జీవితకాలం) ఉంటుందని చెబుతున్నారు. 95 శాతం డిశ్చార్జ్ సపోర్ట్ చేస్తుంది. 5+2 సంవత్సరాల వారంటీ. లైట్‌వెయిట్, ఎక్కువ డ్యూరబిలిటీ ఉంది.

లూమినస్ రెడ్ ఛార్జ్ RC 18000

టాల్ ట్యూబ్యులర్ టెక్నాలజీతో వచ్చింది. 150Ah కెపాసిటీ, 12V. మధ్యస్థ, పెద్ద ఇళ్లకు సరిపోతుంది. ఎక్కువ సమయం బ్యాకప్ ఇస్తుంది. 36 నెలల వారంటీ. లిథియం కంటే చవకగా ఉంటుంది. కానీ బరువు ఎక్కువ, ఛార్జింగ్ నెమ్మదిగా ఉంటుంది.

టాటా గ్రీన్ INTT240072

Advertisement

200Ah కెపాసిటీతో భారీ లోడ్ అవసరమయ్యే ఇళ్లు, ఆఫీసులకు ఈ బ్యాటరీ అనువుగా ఉంటుంది.. బరువు సుమారు 70 కిలోలు. 72 నెలల వారంటీ. టాటా కంపెనీ క్వాలిటీకి పెట్టింది పేరు. కానీ భారీ సైజు వల్ల ఈ బ్యాటరీకి ఎక్కువ స్థలం అవసరం.

ఎక్సైడ్ ఇన్వా మాస్టర్ IMTT1500

150Ah టాల్ ట్యూబ్యులర్ డిజైన్. 650VA నుంచి 1500VA ఇన్వర్టర్‌లతో పని చేస్తుంది. PLEX టెక్నాలజీతో మంచి కూలింగ్. 60 నెలల వారంటీ. నీళ్ల స్థాయి తనిఖీ చేయాలి. బరువు 58 కిలోలు.

లివ్‌గార్డ్ వాల్యూ ప్లస్ బోల్డ్ సిరీస్

150Ah కెపాసిటీ. ఇళ్లు, షాపులు, ఆఫీసులకు సరిపోతుంది. 36 నెలల వారంటీ. ఫాస్ట్ ఛార్జింగ్, మంచి థర్మల్ మేనేజ్‌మెంట్. బడ్జెట్‌లో ఉంటుంది.

జీనస్ హల్లబోల్ GTT175

150Ah, సెలీనియంలో అంటిమోనియల్ అల్లాయ్ టెక్నాలజీ. వేడికి బాగా తట్టుకుంటుంది. సోలార్, నాన్-సోలార్ రెండింటికీ సరిపోతుంది. 60 నెలల వారంటీ.

ఇన్వర్టర్ బ్యాటరీల రకాలు

ఫ్లాట్ ప్లేట్ బ్యాటరీలు చవకగా ఉంటాయి కానీ తక్కువ కాలం పాటు పని చేస్తాయి.
ట్యూబ్యులర్ బ్యాటరీలు ఎక్కువ కాలం మన్నికతో మంచి బ్యాకప్ ఇస్తాయి. లిథియం ఐఆన్ బ్యాటరీలు లైట్‌వెయిట్, జీరో మెయింటెనెన్స్.

Also Read: టివి వినియోగంతో పెరిగిపోతున్న కరెంట్ బిల్లు.. ఈ సెట్టింగ్స్ వెంటనే మార్చండి

ఇన్వర్టర్ బ్యాటరీలు ఎలా పని చేస్తాయి?

కరెంట్ ఉన్నప్పుడు బ్యాటరీ కరెంట్ ఎనర్జీని కెమికల్ రూపంలో నిల్వ చేస్తుంది. పవర్ కట్ అయినప్పుడు ఆ ఎనర్జీని ఇస్తుంది. ఇన్వర్టర్ DCని ACగా మార్చి లైట్లు, ఫ్యాన్‌లు నడుపుతుంది.

సరైన బ్యాటరీ ఎంచుకుంటే దీర్ఘకాలంలో డబ్బు ఆదా అవుతుంది. లిథియం బ్యాటరీలు మెయింటెనెన్స్ లేకుండా, ఫాస్ట్ ఛార్జ్ ఇస్తాయి. ట్యూబ్యులర్ బ్యాటరీలు చవకగా, నమ్మదగినవి. కెపాసిటీ, వారంటీ, ఇన్వర్టర్‌తో సరిపోల్చి చూసి కొనండి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×