// // LG Semi Automatic Washing Machines: బెస్ట్ ఎల్‌జీ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లు.. ధరలు, ఫీచర్ల పూర్తి వివరాలు -->
E-Paper
Advertisement

బెస్ట్ ఎల్‌జీ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లు.. ధరలు, ఫీచర్ల పూర్తి వివరాలు

బెస్ట్ ఎల్‌జీ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లు.. ధరలు, ఫీచర్ల పూర్తి వివరాలు
Advertisement

LG Semi-Automatic Washing Machines: ఈ రోజుల్లో హోమ్ అప్లయెన్సెస్ మార్కెట్లో ఎన్నో రకాల మోడల్స్ వస్తున్నప్పటికీ.. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ కాలం మన్నే సెమీ-ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లకు క్రేజ్ అస్సలు తగ్గలేదు. ముఖ్యంగా నమ్మకమైన బ్రాండ్ ‘ఎల్‌జీ’ నుంచి వచ్చే సెమీ-ఆటోమేటిక్ మెషీన్లు బట్టలను ఉతకడంలో ది బెస్ట్ అనిపించుకుంటున్నాయి. ఆఫీస్ షర్టుల కాలర్ల మురికిని వదిలించడం దగ్గరి నుండి, బరువైన దుప్పట్లు ఉతికే వరకు ఇవి మొండి మొండి మరకలను కూడా ఈజీగా క్లీన్ చేస్తాయి. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ట్రెండ్ అవుతున్న 3 బెస్ట్ ఎల్‌జీ సెమీ-ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ల వివరాలు ఇప్పుడు చూద్దాం.

బట్టలను తళతళలాడించే టాప్ 3 ఎల్‌జీ సెమీ-ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లు: 

1. ఎల్‌జీ 7 కేజీ సెమీ-ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ (LG 7 Kg Semi-Automatic):
చిన్న , మధ్యస్థ కుటుంబాలకు (3-4 సభ్యులు) ఈ 7 కేజీల మెషీన్ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. ఇందులో ఎల్‌జీ సిగ్నేచర్ ఫీచర్ అయిన ‘రోలర్ జెట్ పల్సేటర్’ ఉంటుంది. ఇది బట్టల మధ్య ఘర్షణను పెంచి, చేత్తో ఉతికినట్లే క్లీన్ చేస్తుంది. దీంతో పాటు ఇందులో 3 వాష్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మీ రోజువారీ ఆఫీస్ షర్టులు, కాలేజ్ యూనిఫారాలు, నార్మల్ బెడ్‌షీట్లను ఇది చాలా ఈజీగా ఉతికేస్తుంది. దీనిలో ఉండే ‘రస్ట్ ఫ్రీ ప్లాస్టిక్ బేస్’ మెషీన్ ఎక్కువ కాలం మన్నికగా ఉండేలా చూస్తుంది.

Advertisement

ధర:రూ.12,990 మధ్య ఉంటుంది.

2.ఎల్‌జీ 8 కేజీ సెమీ-ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ (LG 8 Kg Semi-Automatic):
మీ ఇంట్లో నలుగురు కంటే.. ఎక్కువ మంది ఉన్నా, లేదా బరువైన బెడ్‌షీట్లు, జీన్స్ ప్యాంట్లు ఎక్కువ మొత్తంలో ఉతకాలనుకున్నా.. ఈ 8 కేజీల మోడల్ చాలా బాగా సూట్ అవుతుంది. దీని పెద్ద డ్రమ్ సైజ్ వల్ల బట్టలు ఫ్రీగా తిరిగి మురికి త్వరగా వదులుతుంది. ఇందులో బట్టలు త్వరగా ఆరిపోవడానికి ‘విండ్ జెట్ డ్రై’టెక్నాలజీని అందించారు. ఇది స్పిన్ టబ్ వేగంగా తిరిగేటప్పుడు గాలిని లోపలికి లాక్కోవడం ద్వారా బట్టల్లోని తడిని 30-40% వరకు ముందే తగ్గించేస్తుంది.

Advertisement

ధర:రూ.14,490 వరకు అందుబాటులో ఉంది.

3. ఎల్‌జీ 9 కేజీ లార్జ్ కెపాసిటీ వాషింగ్ మెషీన్ (LG 9 Kg Semi-Automatic):

పెద్ద కుటుంబాలు (5 కంటే ఎక్కువ మంది సభ్యులు) ఉన్నవారికి లేదా ఇంట్లోనే భారీ వింటర్ బ్లాంకెట్లు , కర్టెన్లు క్రమం తప్పకుండా ఉతుక్కోవాలి అనుకునేవారికి ఈ 9 కేజీల మెషీన్ వన్-స్టాప్ సొల్యూషన్. దీని మోటార్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. కాబట్టి హెవీ లోడ్ వేసినా మెషీన్‌పై భారం పడదు. ఇందులో ఉండే ‘కలర్ స్క్రాపర్’ ఫీచర్ బట్టలపై ఉండే మొండి మరకలను కూడా ఈజీగా తొలగిస్తుంది. పెద్ద సైజ్ ఉన్నప్పటికీ ఇది 5-స్టార్ ఎనర్జీ రేటింగ్‌తో రావడం వల్ల కరెంట్ బిల్లు కూడా చాలా తక్కువగా వస్తుంది.

ధర:రూ. 19,500 వరకు ఉంటుంది.

తక్కువ నీరు, తక్కువ కరెంట్ వాడుకుంటూ బట్టలను, బ్లాంకెట్లను మురికి లేకుండా క్లీన్ చేయడంలో ఎల్‌జీ సెమీ-ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లు ఎప్పుడూ ముందే ఉంటాయి. మీ ఫ్యామిలీ సైజ్ , అవసరాలను బట్టి ఈ మూడింటిలో ఒక బెస్ట్ ఆప్షన్‌ను ఇప్పుడే సెలెక్ట్ చేసుకోండి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×