// // రూ. 5,000 లోపు బెస్ట్ బడ్జెట్ ఫోన్లు.. కాల్స్‌తో పాటు.. అంతకుమించి! -->
E-Paper
Advertisement

రూ. 5,000 లోపు బెస్ట్ బడ్జెట్ ఫోన్లు.. కాల్స్ కోసమే కాదు.. అంతకుమించి!

రూ. 5,000 లోపు బెస్ట్ బడ్జెట్ ఫోన్లు.. కాల్స్ కోసమే కాదు.. అంతకుమించి!
Advertisement

Budget Keypad Phones: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ తప్పనిసరిగా మారిపోయింది. అలాగనీ అందరికీ రూ.వేలు ఖర్చు పెట్టి ప్రీమియం ఫోన్లు కొనే వీలుండకపోవచ్చు. పరిమిత బడ్జెట్‌లోనే రోజువారీ అవసరాలను తీర్చే ఫోన్ల కోసం చూసేవారికి రూ. 5,000 లోపు అద్భుతమైన ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి కేవలం కాల్స్ కోసమే కాకుండా వినోదాన్ని అందిస్తూ.. యూపీఐ పేమెంట్స్ కు సపోర్ట్ చేయనున్నాయి. ఇంతకీ ఆ ఫోన్లు ఏవి? వాటి ప్రధాన ఫీచర్లేంటో ఇప్పుడు చూద్దాం.

నోకియా 235 4జీ

నోకియాకు చెందిన ఈ ఫోన్.. పాతకాలపు క్లాసిక్ డిజైన్‌తో పాటు ప్రస్తుత అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 4G కనెక్టివిటీ ఉండటం వల్ల కాల్ క్వాలిటీ చాలా స్పష్టంగా ఉండనుంది. అంతేకాకుండా స్మార్ట్ ఫోన్ల తరహాలో ఇందులోని క్లౌడ్ యాప్స్ ద్వారా యూట్యూబ్ షార్ట్స్ చూడవచ్చు. అలాగే యూపీఐ (UPI) ద్వారా ఈజీగా నగదు చెల్లింపులు చేసుకోవచ్చు.

జియోఫోన్ ప్రైమా 2

Advertisement

రిలయన్స్ జియో నుంచి వచ్చిన ‘జియోఫోన్ ప్రైమా 2’.. వినోదానికి కేరాఫ్ గా నిలుస్తోంది. కర్వ్‌డ్ డిజైన్‌తో ప్రీమియం లుక్ ఇచ్చే ఈ ఫోన్.. KaiOS ఆపరేటింగ్ సిస్టమ్‌పై వర్క్ చేయనుంది. ఇందులో యూట్యూబ్, వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా యాప్స్‌ను సులభంగా వాడుకోవచ్చు. అలాగే జియో సినిమా, జియో సావన్ ద్వారా సినిమాలు, పాటలను ఎంజాయ్ చేయవచ్చు. జియోపే (JioPay) ద్వారా యూపీఐ చెల్లింపులు కూడా చేయవచ్చు. బడ్జెట్ లో స్మార్ట్ ఫీచర్లు కావాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఆప్షన్.

లావా ఏ2 స్మార్ట్

స్వదేశీ బ్రాండ్ అయిన లావా నుంచి వచ్చిన ఈ ఫోన్.. సింపుల్ డిజైన్ తో పట్టుకోవడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. రోజువారీ వాడకానికి అవసరమైన FM రేడియో, ఆటో కాల్ రికార్డింగ్, సూపర్ బ్యాటరీ బ్యాకప్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మధ్యతరగతికి చెందిన పెద్దలు, వృద్ధులకు ఈ ఫోన్ బాగా సెట్ అవుతుంది.

Advertisement

Also Read: స్మార్ట్‌ఫోన్లకే చెమటలు పట్టిస్తున్న.. నోకియా కొత్త కీప్యాడ్ ఫోన్లు.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే!

నోకియా 105 (Nokia 105)

ఏలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా కేవలం కాల్స్ మాట్లాడటాని ఫోన్ కావాలనుకుంటే ‘నోకియా 105’ బెస్ట్ అని చెప్పవచ్చు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజుల తరబడి వచ్చే బ్యాటరీ బ్యాకప్ దీని ప్రత్యేకతగా నిలుస్తోంది. ప్రైమరీ ఫోన్‌గా కాకపోయినా అత్యవసర సమయాల్లో వాడుకోవడానికి ఒక సెకండరీ ఫోన్‌గా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

Also Read: విశాఖ స్పెషల్.. వాల్తేరు, గాజువాక, అసీల్‌మెట్ట ప్రాంతాలకు.. ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలుసా?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×