E-Paper
Advertisement

రూ. 5 వేలలోపు బెస్ట్ గ్రాఫిక్స్ టాబ్లెట్స్.. ఆర్టిస్టులు, స్టూడెంట్స్ ఫిదా అవ్వాల్సిందే!

రూ. 5 వేలలోపు బెస్ట్ గ్రాఫిక్స్ టాబ్లెట్స్.. ఆర్టిస్టులు, స్టూడెంట్స్ ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

Graphics Tablets 2026: ప్రస్తుత రోజుల్లో ట్యాబ్లెట్ల వినియోగం బాగా పెరిగిపోయింది. డిజిటల్ ఆర్ట్, ఆన్‌లైన్ టీచింగ్, ఫొటో ఎడిటింగ్, డిజైనింగ్ నేర్చుకోవాలనుకునే వారికి గ్రాఫిక్స్ టాబ్లెట్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అయితే కొత్తగా నేర్చుకునేవారు భారీగా ఖర్చు చేయాల్సిన పనిలేకుండానే రూ. 5,000 లోపే కొన్ని రకాల టాబ్లెట్లు లభిస్తున్నాయి. వాటిలో అత్యుత్తమ టాబ్లెట్లను ఈ కథనంలో అందించడం జరుగుతోంది. వాటి ఫీచర్లపై ఓ లుక్కేయండి.

విఎక్కే A15 (VEIKK A15)

10×6 అంగుళాల డిజైన్ తో వచ్చే ఈ టాబ్లెట్.. ఆర్టిస్టులకు స్వేచ్ఛగా బొమ్మలు గీయడానికి వీలు కల్పిస్తుంది. ఇందులో 12 కస్టమైజ్డ్ ఎక్స్‌ప్రెస్ కీలు ఉన్నాయి. దీని స్టైలస్ (పెన్) బ్యాటరీ లేకుండా పనిచేస్తుంది కాబట్టి ఛార్జింగ్ ఇబ్బందులు ఉండవు.

హ్యూయాన్ ఇన్‌స్పిరాయ్ (Huion Inspiroy H950P)

Advertisement

డిజిటల్ డ్రాయింగ్ విభాగంలో హ్యూయాన్ బ్రాండ్‌కు మంచి పేరుంది. ఈ H950P మోడల్.. పెన్ ట్రిగ్గర్ టిల్ట్ ఫంక్షన్‌కు సపోర్ట్ చేస్తుంది. 8192 లెవల్స్ ప్రెజర్ సెన్సిటివిటీ వల్ల పెన్సిల్‌తో పేపర్‌పై గీసినంత సహజంగా లైన్లు గీయవచ్చు. ఇది తక్కువ బరువుతో స్లిమ్ డిజైన్ లో ఉండటం వల్ల ఎక్కడికైనా ఈ టాబ్లెట్ ను ఈజీగా తీసుకెళ్లవచ్చు.

గామన్ బ్లూటూత్ డ్రాయింగ్ టాబ్లెట్ (GAOMON WH851)

వైర్‌లెస్‌గా పనిచేసే టాబ్లెట్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. దీనిలోని బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ ను ఉపయోగించుకొని లాప్‌టాప్, మొబైల్ ఫోన్‌లకు ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. విద్యార్థులు, రెగ్యులర్ గా జర్నీలు చేసే ఆర్టిస్టులకు ఇది బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది.

సైబర్ వోల్ఫ్ (Cyberwolf T5050)

Advertisement

తక్కువ బడ్జెట్‌లో మెరుగైన గ్రాఫిక్స్ కలిగిన టాబ్లెట్ ను కోరుకుంటే దీన్ని ట్రై చేయవచ్చు. స్టార్టింగ్ స్టేజీలో డిజిటల్ ఆర్ట్ నేర్చుకోవడానికి, ఆన్‌లైన్ క్లాసులు చెప్పడానికి, నోట్స్ రాసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. సైజ్ కాంపాక్ట్‌గా ఉండటంతో దీన్ని వాడటం కూడా చాలా తేలిగ్గా ఉంటుంది.

Also Read: ట్రావెలర్స్ కోసం బెస్ట్ పవర్ బ్యాంక్స్.. అది కూడా రూ. 2500 లోపే.. ఓ లుక్కేయండి!

టర్కామ్ (Turcom TS-6540)

రెగ్యులర్ యూసేజ్ కోసం ఈ ట్యాబ్ బాగా ఉపయోగపడుతుంది. స్టూడెంట్స్, ఎంట్రీ లెవెల్ బిగినర్స్ తమ ఆర్ట్ స్కిల్స్ మెరుగుపరుచుకోవడానికి దీనిని ఉపయోగించవచ్చు. USB సపోర్ట్‌తో లభించే ఈ టాబ్లెట్ ను సిస్టమ్‌కు కూడా చాలా తేలిగ్గా కనెక్ట్ చేసుకోవచ్చని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: టీవీ కింద అల్యూమినియం ఫాయిల్.. తర్వాత జరిగే మ్యాజిక్కే వేరు.. ఇన్నాళ్లు ఎలా మిస్ అయ్యాం!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×