E-Paper
Advertisement

ఒత్తిడి పెరిగితే కడుపులో తిప్పడమేంటి ?స్ట్రెస్, గట్ హెల్త్ సీక్రెట్స్ ఇవే!

ఒత్తిడి పెరిగితే కడుపులో తిప్పడమేంటి ?స్ట్రెస్, గట్ హెల్త్ సీక్రెట్స్ ఇవే!
Advertisement

Stress and gut health relation: రోజంతా ఆఫీస్ టెన్షన్, లైఫ్‌స్టైల్ ప్రెజర్… వీటికి తోడు అకస్మాత్తుగా కడుపులో ఏదో తిప్పినట్లు అనిపించడం, గ్యాస్ లేదా అసిడిటీ ఇబ్బంది పెట్టడం ఎప్పుడైనా గమనించారా? నిజానికి మన మైండ్‌కి, పొట్టకి మధ్య చాలా దగ్గరి సంబంధం ఉంది. మీ మనసులో ఒత్తిడి పెరిగితే, దాని ప్రభావం నేరుగా మీ జీర్ణవ్యవస్థపై పడుతుంది. అందుకే హెల్తీగా ఉండాలంటే కేవలం మంచి ఆహారం తింటే సరిపోదు, ఒత్తిడిని తగ్గించుకోవడం కూడా చాలా ముఖ్యం. పొట్ట ఆరోగ్యం కోసం సింపుల్ ట్రిక్స్.

మైండ్ – గట్ కనెక్షన్ :

మన జీర్ణ వ్యవస్థలో మిలియన్ల కొద్దీ నరాలు ఉంటాయి. అందుకే సైంటిస్టులు పొట్టను ‘రెండవ మెదడు’ అని పిలుస్తారు. మనం తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు శరీరంలో ‘కార్టిసోల్’ అనే స్ట్రెస్ హార్మోన్ విడుదలవుతుంది. ఇది జీర్ణక్రియ వేగాన్ని తగ్గిస్తుంది లేదా అకస్మాత్తుగా పెంచేస్తుంది.

Advertisement

ఒత్తిడి వల్ల వచ్చే కడుపు సమస్యలు:

అసిడిటీ & గ్యాస్: టెన్షన్ వల్ల కడుపులో యాసిడ్స్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యి యాసిడ్ రిఫ్లక్స్ లేదా గుండెల్లో మంట వస్తుంది.

Advertisement

ఐబిఎస్: విపరీతమైన ఒత్తిడి వల్ల కడుపు నొప్పి, డయేరియా లేదా మలబద్ధకం వంటి సమస్యలు వెంటాడుతాయి.

ఉబ్బరం: మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆహారం సరిగ్గా జీర్ణం కాక కడుపు ఉబ్బరంగా ఉంటుంది.

మంచి బాక్టీరియా తగ్గడం: మన కడుపులో ఉండే ‘గుడ్ బాక్టీరియా’ మైక్రోబయోమ్ నాశనమై, రోగనిరోధక శక్తి తగ్గుతుంది.

జీర్ణవ్యవస్థను సెట్ చేసే సింపుల్ హాక్స్:

మైండ్‌ఫుల్ ఈటింగ్:

ఆహారం తినేటప్పుడు మొబైల్ చూస్తూనో లేదా వర్క్ ప్రెజర్ ఆలోచిస్తూనో తినకండి. ప్రశాంతంగా, నెమ్మదిగా నమిలి తినడం అలవాటు చేసుకోండి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

ఫైబర్ & ప్రోబయోటిక్స్ :

మీ ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు చేర్చండి. కడుపులో గుడ్ బాక్టీరియా పెరగడానికి పెరుగన్నం, మజ్జిగ, పులియబెట్టిన పదార్థాలు బాగా పనిచేస్తాయి.

హైడ్రేషన్ :

రోజుకు కనీసం 3 లీటర్ల నీళ్లు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది. ఒత్తిడి వల్ల వచ్చే అసిడిటీని తగ్గించడంలో మంచి నీళ్లు అద్భుతమైన పాత్ర పోషిస్తాయి.

Also Read: రూ.11,500 వేలకే 32 ఇంచుల టీవీ..స్టాక్ అయిపోయేలోపే కొనేయండి

చిన్నపాటి వ్యాయామం:

ప్రతిరోజూ 20-30 నిమిషాల వాకింగ్, యోగా లేదా ప్రాణాయామం చేయడం వల్ల స్ట్రెస్ హార్మోన్లు తగ్గి, పొట్ట ప్రశాంతంగా ఉంటుంది.

నిద్ర:

రాత్రి 7-8 గంటల నాణ్యమైన నిద్ర మీ మెదడును, జీర్ణ వ్యవస్థను రీఛార్జ్ చేస్తుంది. సరైన నిద్ర లేకపోతే.. స్ట్రెస్ పెరిగి జీర్ణ సమస్యలు రెట్టింపు అవుతాయి.

మీ కడుపు ఆరోగ్యంగా ఉంటే మీ మూడ్ కూడా హ్యాపీగా ఉంటుంది. అందుకే ఒత్తిడిని మీ జీర్ణవ్యవస్థపైకి నెట్టకండి. చిన్న చిన్న లైఫ్ స్టైల్ మార్పులు, ప్రశాంతమైన మైండ్‌సెట్‌తో మీ గట్ హెల్త్‌ను సూపర్ స్ట్రాంగ్‌గా మార్చుకోండి.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×