E-Paper
Advertisement

కిచెన్ పనితో విసిగిపోయారా? మీ లైఫ్ ఈజీ చేసే టాప్ 5 డిష్‌వాషర్స్!

కిచెన్ పనితో విసిగిపోయారా? మీ లైఫ్ ఈజీ చేసే టాప్ 5 డిష్‌వాషర్స్!
Advertisement

Best dishwasher in india: ప్రస్తుత బిజీ లైఫ్‌లో కిచెన పనులు అంటే ఎవరికైనా పెద్ద టాస్క్ లా మారుతున్నాయి. ముఖ్యంగా నూనె, మసాలాలతో జిడ్డుపట్టిన గిన్నెలను శుభ్రం చేయడం చాలా టైం పడుతుంది.అయితే ఈ కష్టానికి చెక్ పెట్టడానికి మార్కెట్లో దొరికే కొన్ని రకాల డిష్‌వాషర్లు గొప్ప వరంగా మారాయి. ఇవి శ్రమను, సమయాన్ని తగ్గించడమే కాకుండా నీటిని కూడా చాలా వరకు సేవ్ చేస్తాయి. మరిమన ఇండియన్ కిచెన్లకు సరిపోయే టాప్ 5 బెస్ట్ డిష్‌వాషర్లు, వాటి ధరల వివరాలను ఇప్పుడు చూద్దాం.

టాప్ 5  డిష్‌వాషర్లు: 

1. Bosch SMS66GI01I 13 Place Setting Dishwasher:

మార్కెట్లో బాష్ బ్రాండ్‌కు ఎంతో పేరుంది. ముఖ్యంగా మన ఇండియన్ వంటకాలకు తగినట్లుగా.. దీన్ని ప్రత్యేకంగా ‘ఇంటెన్సివ్ కడాయి ప్రోగ్రామ్’తో డిజైన్ చేశారు. దీని వల్ల నూనె, మసాలాలతో జిడ్డుపట్టిన గిన్నెలు, కడాయిలను కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. దీని ధర సుమారు రూ.47,500 నుంచి రూ.49,000 వరకు ఉంటుంది. 13 ప్లేస్ సెట్టింగ్స్, తక్కువ నీటి ఖర్చు, సైలెంట్ వర్కింగ్ మోటార్ దీని ప్రత్యేకతలు.

2.IFB Neptune FX14 Dishwasher:

Advertisement

ఇండియన్ కిచెన్ అవసరాలకు తగ్గట్టుగా అప్లయన్సెస్ తయారు చేయడంలో ఐఎఫ్‌బి ముందుంటుంది. ఈ డిష్‌వాషర్ 14 ప్లేస్ సెట్టింగ్‌లతో ..వస్తుంది కాబట్టి పెద్ద కుటుంబాలకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. అంతే కాకుండా ఇందులో .. ఉండే 360-డిగ్రీ జెట్ స్ప్రే టెక్నాలజీ గిన్నెలకు ఉన్న మొండి మరకలను పూర్తిగా వదిలిస్తుంది. దీని ధర సుమారు రూ.37,990 నుంచి రూ. 40,000 మధ్య లభిస్తుంది. పవర్ స్టీమ్ డ్రైయింగ్, హాట్ వాటర్ వాష్ ఫీచర్ దీని ప్రత్యేకతలు.

3.Voltas Beko 14 Place Settings Dishwasher:

ఈ డిష్‌వాషర్ బడ్జెట్ ధరలో లభించే బెస్ట్ ఆప్షన్. తక్కువ టైమ్‌లో గిన్నెలు శుభ్రం చేయడానికి ఇందులో ప్రత్యేకమైన ప్రోగ్రామ్‌లు ఉంటాయి. అంతేకాకుండా.. ఇది తక్కువ కరెంట్,తక్కువ నీటిని మాత్రమే వినియోగించుకుంటుంది. దీని ధర సుమారు రూ.27,350 నుంచి రూ. 30,000 వరకు ఉంటుంది. ప్రీ-రిన్స్ అవసరం లేని ఇంటెన్సివ్ క్లీనింగ్ దీని ప్రత్యేకత.

4. Faber 12 Place Settings Dishwasher:

Advertisement

కిచెన్ అప్లయన్సెస్‌లో ఫేబర్ మంచి నమ్మకమైన బ్రాండ్. ఈ 12 ప్లేస్ సెట్టింగ్స్ డిష్‌వాషర్ మిడిల్ క్లాస్ కుటుంబాలకు సరిగ్గా సరిపోతుంది.ఇది ఎనర్జీ ఎఫిషియెంట్ మోటార్‌తో పనిచేస్తుంది. ముఖ్యంగా ఆయిల్ , మసాలా మరకలను ఈజీగా వదిలించే హైజీన్ వాష్ ప్రోగ్రామ్ ఇందులో ప్రత్యేక ఆకర్షణ. దీని ధర సుమారు రూ.27,890 నుంచి రూ. 31,000 మధ్య ఉంది. ఎకో-ఫ్రెండ్లీ వాటర్ సేవింగ్ టెక్నాలజీ దీని ప్రత్యేకత.

Also Read: నాయిస్ ఇయర్‌బడ్స్ ఇప్పుడు రూ.2299కే..డోంట్ మిస్

5. LG TrueSteam 15 Place Setting Dishwasher:

లేటెస్ట్ టెక్నాలజీ కోరుకునేవారికి ఎల్జీ డిష్‌వాషర్ అద్భుతమైన ఫీల్ ఇస్తుంది. ఇది ట్రూస్ట్రీమ్ టెక్నాలజీతో పని చేస్తుంది, దీని వల్ల గిన్నెలు ఎలాంటి మరకలు లేకుండా తలల మెరిసిపోతాయి. వై-ఫై కనెక్టివిటీ ఉండటం వల్ల దీన్ని స్మార్ట్‌ఫోన్ నుంచే ఈజీగా ఆపరేట్ చేయవచ్చు. దీని ధర సుమారు రూ.45,000 నుంచి రూ. 72,990 వరకు ఉంటుంది. క్వాడ్‌వాష్ మల్టీ-మోషన్ స్ప్రే ఆర్మ్స్, ఆటో ఓపెన్ డోర్ దీని ప్రత్యేకతలు.

ఇంట్లో ఉండే సభ్యుల సంఖ్య , మీ బడ్జెట్‌ను బట్టి సరైన డిష్‌వాషర్‌ను ఎంచుకుంటే.. కిచెన్ పనులు చిటికెలో పూర్తవుతాయి. ఇవి మీ టైం ఆదా చేయడమే కాకుండా, గిన్నెలను ఎంతో పరిశుభ్రంగా ఉంచుతాయి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×