E-Paper
Advertisement

Best Camera Phones Under Rs 20,000: తక్కువ ధరలో బెస్ట్ కెమెరా ఫోన్ కోసం చూస్తున్నారా? ఈ టాప్-5 ఫోన్లు మీ కోసమే!

Best Camera Phones Under Rs 20,000: తక్కువ ధరలో బెస్ట్ కెమెరా ఫోన్ కోసం చూస్తున్నారా? ఈ టాప్-5 ఫోన్లు మీ కోసమే!
Advertisement

Best Camera Phones Under Rs 20,000: ఒకప్పుడు హై క్వాలిటీ ఫొటో కావాలంటే ఖరీదైన DSLR తప్ప మరో దారి లేదు. పైగా వాటి ధరలు వేలల్లో కాదు.. లక్షల్లో ఉండేవి. కానీ, 2026కి వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు జేబులో ఉండే స్మార్ట్‌ఫోన్‌నే ఒక పవర్‌ఫుల్ కెమెరాగా మార్చేసింది టెక్నాలజీ. ముఖ్యంగా రూ.20వేల లోపు బడ్జెట్ ఫోన్లలోనే DSLR క్వాలిటీ ఫొటోలు తీసే కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. ఇకపోతే ఫొటోగ్రఫీ అంటే ప్రాణం పెట్టేవాళ్లకు ఇది నిజంగా గోల్డెన్ టైమ్. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్కెట్లో ఉన్న బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్లు ఏవో ఓసారి చూసేద్దాం..

Oppo K13x 5G

ఒప్పో నుంచి వస్తున్న K13x 5G ఫోన్ కేవలం రూ.15,999 ధరలోనే అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంటుంది. దీనిలో 50MP మెయిన్ కెమెరాతో పాటు 8MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీని 6.67 అంగుళాల 120Hz డిస్‌ప్లే వీడియోలు చూసేటప్పుడు మంచి అనుభూతిని అందిస్తుంది. దీనిలో 6000mAh బ్యాటరీ ఉండటం వలన రోజంతా ఛార్జింగ్ టెన్షన్ లేకుండా వాడుకోవచ్చు.

Vivo T4X 5G

Advertisement

ఇక వివో T4X మోడల్ రూ.15,499కే అందుబాటులో ఉంది. దీనిలోని 50MP డ్యూయల్ కెమెరా సెటప్ ఎంతో స్పష్టంగా ఉండే ఫొటోలను క్లిక్ చేస్తుంది. ముఖ్యంగా 6500mAh బ్యాటరీ ఉండటంతో ఎక్కువ సేపు ఫొటో షూట్‌లు చేసుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.

Also Read: ఒక్కసారి ఛార్జ్ చేస్తే వారం రోజులు వాడొచ్చు.. 8,500mAh బ్యాటరీతో వస్తోన్న షియోమీ 17T ప్రో!

Motorola G67 Power

Advertisement

మీకు సెల్ఫీలు తీసుకోవడం ఇష్టమైతే, మోటోరోలా G67 Power మీ కోసమే. దీనిలో ఏకంగా 32MP హై రిజల్యూషన్ ఫ్రంట్ కెమెరా ఉంది. రూ.15,999 ధరలో లభించే ఈ ఫోన్.. 7000mAh భారీ బ్యాటరీతో వస్తోంది. ఈ ఫోన్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల వరకు నిరంతరాయంగా పని చేస్తుంది.

CMF Phone 2 Pro

ప్రముఖ నథింగ్ సబ్ బ్రాండ్ నుంచి వచ్చిన CMF ఫోన్ 2 ప్రో ఫొటోగ్రఫీ ప్రేమికులకు వరమనే చెప్పాలి. రూ.17,999 ధరలో టెలిఫొటో లెన్స్‌తో వస్తున్న అరుదైన ఫోన్ ఇది. దీనిలో 50MP వైడ్, 50MP టెలిఫొటో కెమెరాలు ఉండటం వల్ల ఎంత దూరం నుంచి తీసినా ఫొటోలు చాలా క్వాలిటీగా వస్తాయి.

Samsung Galaxy A17 5G

నమ్మకమైన బ్రాండ్ కావాలనుకునే వారికి శాంసంగ్ గెలాక్సీ A17 5G బెటర్ ఆప్షన్. రూ.18,999 ధరలో లభించే ఈ స్మార్ట్‌ఫోన్ Super AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. దీని 50MP మెయిన్ కెమెరా సహజమైన రంగులతో కూడిన ఫొటోలను క్యాప్చర్ చేస్తుంది.

Also Read: తక్కువ ధరలో థియేటర్ అనుభవం కావాలా? ఈ ఏడాది మార్కెట్‌ను షేక్ చేస్తున్న బెస్ట్ టీవీలివే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×