E-Paper
Advertisement

EPFO UPI Withdrawal: ఈపీఎఫ్ఓ UPI విత్ డ్రా పై బిగ్ అప్డేట్.. ఏప్రిల్ నాటికి కొత్త యాప్.. 3 రోజుల్లో క్లెయిమ్ సెటిల్మెంట్

EPFO UPI Withdrawal: ఈపీఎఫ్ఓ UPI విత్ డ్రా పై బిగ్ అప్డేట్.. ఏప్రిల్ నాటికి కొత్త యాప్.. 3 రోజుల్లో క్లెయిమ్ సెటిల్మెంట్
Advertisement

EPFO UPI Withdraw: ఈపీఎఫ్ఓ యూపీఐ విత్ డ్రాపై ఉద్యోగస్తులకు బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి కొత్త మొబైల్ యాప్ ను ప్రారంభించనుంది. కొత్త యాప్ ద్వారా 8 కోట్ల ఈపీఎఫ్ సభ్యులు తమ ప్రావిడెంట్ ఫండ్ యూపీఐ ద్వారా నేరుగా విత్ డ్రా చేసుకోవచ్చు. తమ పీఎఫ్ ఖాతాలోని కొంత భాగం మినహా.. మిగిలిన మొత్తాన్ని UPI ద్వారా నేరుగా తమ బ్యాంకు ఖాతాకు ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చని ఈపీఎఫ్ఓ అధికార వర్గాలు తెలిపాయి. EPFO ​​3.0 అప్‌గ్రేడ్‌లో భాగంగా ఈ కొత్త విత్ డ్రా ప్రక్రియను.. పేపర్ లెస్, పూర్తిగా డిజిటల్‌ మార్గంలో అమలు చేయనున్నారు.

ఆటో సెటిల్మెంట్ మోడ్ పరిమితి పెంపు

ఈపీఎఫ్ఓ సభ్యులు ప్రస్తుతం విత్ డ్రా క్లెయిమ్‌ల కోసం ఈపీఎఫ్ఓ వెబ్ సైట్ లో అప్లై చేసుకోవాలి. అయితే దీనికి కొంత సమయం పడుతుంది. కొత్తగా రానున్న ఆటో సెటిల్‌మెంట్ మోడ్ లో 3 రోజుల్లోపు క్లెయిమ్‌లను పరిష్కరించనున్నారు. ఈ ఆటో సెటిల్‌మెంట్ మోడ్ పరిమితిని రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచనున్నారు. ఈ విధానం వల్ల ఈపీఎఫ్ఓపై భారం తగ్గనుంది. ఈపీఎఫ్ఓ ప్రస్తుతం ఏటా 5 కోట్లకు పైగా క్లెయిమ్‌లను పరిష్కరిస్తుంది. వీటిల్లో ఎక్కువగా పీఎఫ్ విత్ డ్రాలకు సంబంధించినవే. బ్యాంకులతో సమానంగా ఈపీఎఫ్ఓ ​​సేవలను మెరుగుపరచాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

UPI విత్ డ్రా కీలక విషయాలు

  1. ట్రాన్స్ ఫర్స్: పీఎఫ్ చందాదారులు తమ UPI పిన్‌ను ఉపయోగించి తమ పీఎఫ్ ఖాతాలోని నగదును తమ బ్యాంకు ఖాతాలకు తక్షణమే బదిలీ చేసుకోవచ్చు. ఇది గతంలో చాలా రోజులు పట్టేది. అనారోగ్యం, విద్య, వివాహం, గృహ అవసరాల కోసం మూడు రోజుల్లోపు పీఎఫ్ విత్ డ్రా డబ్బు పొందవచ్చు.
  2. విత్ డ్రా పరిమితులు: UPI విత్ డ్రా కు ప్రతి లావాదేవీకి రూ. 25,000 పరిమితిని సూచిస్తున్నాయి.
  3. బ్యాలెన్స్ విభజన: యూపీఐ యాప్ విత్ డ్రా కు “అర్హత ఉన్న బ్యాలెన్స్”ను కొత్త యాప్ లో స్పష్టంగా చూపిస్తుంది. అలాగే పదవీ విరమణ సెక్యూరిటీ కోసం బ్యాలెన్స్ లో 25 శాతాన్ని లాక్ చేస్తుంది.
  4. యాప్ ఇంటిగ్రేషన్: యూపీఐ సేవలు కొత్త EPFO ​​యాప్ ద్వారా అందుబాటులోకి రానుంది. దీనిని BHIM యాప్, ఇతర UPI ప్లాట్‌ఫామ్‌లతో అనుసంధానించనున్నారు.
  5. ఏప్రిల్ లో కొత్త ఈపీఎఫ్ఓ యాప్ ను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తు్న్నారు. సాంకేతిక సమస్యలను గుర్తించి పరిష్కరించడానికి కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ప్రస్తుతం 100 డమ్మీ ఖాతాలతో ట్రయల్ రన్‌లు నిర్వహిస్తుంది. కొత్త యాప్ యూపీఐ విత్ డ్రాలకు మొబైల్ ఇంటర్‌ఫేస్‌గా ఉన్నప్పటికీ, EPFO పోర్టల్, UMANG యాప్ లలో ప్రస్తుత సేవలు కొనసాగనున్నాయి.
Advertisement

Also Read: యూపీఐ ద్వారా ఈపీఎఫ్ విత్‌డ్రా.. ఇంత నగదు మాత్రమే తీసుకోగలరట!

Tags

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×