E-Paper
Advertisement

బెడ్ దిగక్కర్లేదు.. రిమోట్‌తో ఫ్యాన్ వేయొచ్చు.. తక్కువ ధరలో లభించే టాప్-5 మోడల్స్ ఇవే!

బెడ్ దిగక్కర్లేదు.. రిమోట్‌తో ఫ్యాన్ వేయొచ్చు.. తక్కువ ధరలో లభించే టాప్-5 మోడల్స్ ఇవే!
Advertisement

Remote Control Fans: సాధారణంగా వేసవిలో 24/7 ఇంట్లో రన్ అయ్యే పరికరం ఏదైనా ఉందంటే అది ఫ్యానే. ఈ క్రమంలో కరెంటు బిల్లు కూడా ఎక్కువగానే వస్తుంటుంది. అలా అని ఫ్యాన్ వేయకుండా ఉండలేం, వేస్తే బిల్లు తడిసి మోపెడవుతుంది. అయితే ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది. పాతకాలం ఫ్యాన్ల కంటే తక్కువ విద్యుత్ వాడుకుంటూ, రిమోట్‌తో నడిచే స్మార్ట్ BLDC ఫ్యాన్లు మార్కెట్లోకి వచ్చేశాయి. మీరూ కూడా ఎక్కువ సౌండ్ లేకుండా, తక్కువ కరెంట్ బిల్లు వచ్చే కొత్త ఫ్యాన్ కొనాలని చూస్తుంటే.. తక్కువ బడ్జెట్‌లో దొరికే టాప్-5 ఆప్షన్స్ మీ కోసం..

అటాంబర్గ్ అమేజా

బడ్జెట్ తక్కువగా ఉండి.. మంచి క్వాలిటీ ఫ్యాన్ కావాలనుకునే వారికి అటాంబర్గ్ అమేజా బెస్ట్ ఆప్షన్. దీని ధర రూ.2,300 నుండి రూ.2,600 మధ్య ఉంటుంది. ఇది తిరుగుతున్నప్పుడు అస్సలు సౌండ్ రాదు. గాలి కూడా గది మూలమూలకూ సమానంగా అందుతుంది. దీనికి చిన్న ఎల్ఈడీ లైట్లు ఉండటం వల్ల నైట్ టైమ్ చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ముఖ్యంగా బెడ్‌రూమ్‌లకు ఇది బాగా సెట్ అవుతుంది. ఇప్పటికే కొని వినియోగిస్తున్న కస్టమర్ల నుంచి దీనికి మంచి రేటింగ్స్ కూడా ఉన్నాయి.

అటాంబర్గ్ ఎఫిషియో ఆల్ఫా

Advertisement

ఒకవేళ నమ్మకమైన మోడల్ కావాలనుకుంటే.. అటాంబర్గ్ లోనే ఎఫిషియో లేదా రెనెసా సిరీస్ చూడొచ్చు. వీటి ధరలు రూ.2,700 నుండి మొదలై రూ.3,600 వరకు ఉంటాయి. ఇవి చూడటానికి చాలా రిచ్‌గా, మోడ్రన్‌గా కనిపిస్తాయి. చాలా కంపెనీలు ఫ్యాన్ బిగించడానికి అదనంగా డబ్బులు అడుగుతాయి. కానీ అటాంబర్గ్ వారు ఫ్రీ ఇన్‌స్టాలేషన్ కూడా ఇస్తున్నారు. ఒకసారి ఈ ఫ్యాన్ కొంటే మీ కరెంటు బిల్లులో సగం పైగా ఆదా అవుతుంది. పైగా సర్వీస్ సెంటర్లు కూడా ప్రతిచోటా అందుబాటులో ఉంటున్నాయి.

Also Read: ప్రమాదంలో ఆండ్రాయిడ్ యూజర్లు.. హ్యాకర్ల కన్ను మీ ఫోన్ పైనే, అసలు ఏమిటీ మాల్వేర్?

క్రాంప్టన్ ఎనర్జియన్ హైపర్ జెట్

Advertisement

మనకు ఎప్పటి నుంచో తెలిసిన బ్రాండ్ క్రాంప్టన్. వారి నుంచి వచ్చిన ఈ హైపర్ జెట్ ఫ్యాన్ గాలి స్పీడ్ విషయంలో మాత్రం తగ్గేదే లే అంటుంది. దీని ధర రూ.2,300 నుండి రూ.2,650 వరకు ఉంటుంది. దీని రిమోట్ స్పెషాలిటీ ఏమిటంటే.. మనం ఫ్యాన్ వైపు చూపిస్తూ నొక్కక్కర్లేదు, ఎటువైపు నుండి ఆపరేట్ చేసినా పనిచేస్తుంది. పెద్ద హాల్స్‌కి ఇది చాలా బాగుంటుంది. అలాగే దీనిపై కంపెనీ ఇచ్చే రెండేళ్ల వారంటీ ఎంతో భరోసానిస్తుంది.

ఓరియంట్ ఎలక్ట్రిక్ జెనో

కరెంటు బిల్లును అస్సలు పెరగనివ్వకూడదు అనుకుంటే.. ఈ ఓరియంట్ జెనోను కొనుగోలు చేయొచ్చు. దీని ధర రూ.2,800 నుండి రూ.3,000 మధ్య లభిస్తుంది. ఈ ఫ్యాన్ రెక్కలు ప్రత్యేకమైన ఆకారంలో ఉండటం వల్ల గాలి తక్కువగా ఉండి, స్పీడ్ ఎక్కువగా వస్తుంది. దీనికి మూడు ఏళ్ల వారంటీ ఉండటం పెద్ద ప్లస్ పాయింట్. అలాగే పవర్ కట్స్ ఉన్నప్పుడు ఇన్వర్టర్ మీద కూడా ఇది ఎక్కువ సేపు నడుస్తుంది.

హావెల్స్ ఫ్యాబ్ బీఎల్డీసీ

ఇల్లు చాలా లగ్జరీగా కనిపించాలి అనుకునే వారికి హావెల్స్ ఫ్యాబ్ బెటర్. దీని ధర రూ.2,900 నుండి రూ.3,400 వరకు ఉంటుంది. దీనిలో ఉన్న వింటర్ మోడ్ చలికాలంలో గాలిని రివర్స్ తిప్పి గదిని వెచ్చగా ఉంచడానికి సాయపడుతుంది. హావెల్స్ బ్రాండ్ అంటేనే నాణ్యతకు కేరాఫ్ అడ్రస్ కాబట్టి.. మూడేళ్ల వారంటీతో వచ్చే ఈ ఫ్యాన్ గురించి అస్సలు ఆలోచించక్కర్లేదు. అయితే ఫ్యాన్ కొనేముందు గది సైజును ఒకసారి చూసుకోండి. పైన చెప్పుకున్నవన్నీ 1200 ఎంఎం సైజువే. ఇవి ఇంట్లోని మామూలు గదులకు సెట్ అయిపోతాయి.

Also Read: ధర తక్కువే కానీ ఫీచర్లు నెక్స్ట్ లెవెల్.. Redmi A7 Proలో గూగుల్ AI ఫీచర్లు కూడా!

ముఖ్య గమనిక:

ఈ కథనంలో మీకు పరిచయం చేసిన ప్రొడక్ట్ లేదా దాని ధరలు.. ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. కాబట్టి.. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×