E-Paper
Advertisement

Best Govt Scheme: మహిళల కోసం టాప్ 5 ప్రభుత్వ పథకాలు.. పూర్తి వివరాలు ఇలా!

Best Govt Scheme: మహిళల కోసం టాప్ 5 ప్రభుత్వ పథకాలు.. పూర్తి వివరాలు ఇలా!
Advertisement

Best Govt Scheme: భారత ప్రభుత్వం మహిళల కోసం అనేక పథకాలను అమలుచేస్తుంది. ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, భద్రత, ఆర్థిక స్వాతంత్ర్యాన్ని మెరుగుపరచడమే ఈ పథకాల లక్ష్యం. మహిళల కోసం కేంద్రం అమలు చేస్తున్న 5 బెస్ట్ స్కీమ్స్ గురించి తెలుసుకుందాం.

ప్రధాన మంత్రి ముద్రా యోజన

చిన్న వ్యాపారాలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలు అందించే ప్రభుత్వ పథకం ఇది. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో రుణాలు అందిస్తున్నారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి.. శిశు కేటగిరి కింద రూ.50 వేల వరకు రుణం అందిస్తారు. వ్యాపార వృద్ధికి కిషోర్ లో భాగంగా రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు లోన్ ఇస్తారు. వ్యాపారాన్ని లార్జ్ స్కేల్ లో పెంచుకోవడానికి తరుణ్ విభాగంలో రూ. 5 లక్షల నుంచి 10 లక్షల వరకు లోన్ ఇస్తారు.

సుకన్య సమృద్ధి యోజన

Advertisement

బాలికల ఆర్థిక భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పొదుపు పథకం. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో అత్యధిక వడ్డీ రేటు ఉన్న పెట్టుబడి పథకం ఇదే. ప్రస్తుత వడ్డీ రేటు 8.2 శాతం. ఏడాదికి 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఇద్దరు ఆడ పిల్లలకు ఈ పథకం కింద పొదుపు చేసుకోవచ్చు. సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. ఈ అకౌంట్ 21 ఏళ్లకు మెచ్యూరిటీ అవుతుంది. 15 ఏళ్ల పాటు ప్రతి సంవత్సరం 1.5 లక్షలు పెట్టుబడి పెడితే.. మెచ్యూరిటీ నాటికి మొత్తం రూ.65-70 లక్షలు వరకు పొందవచ్చు.

షీ మార్ట్

మహిళా ఎంట్రప్రెన్యూర్స్ వారి ప్రొడెక్ట్స్ సేల్ చేసుకోవడానికి ఉపయోగపడే వేదిక షీ మార్ట్. ఇది మహిళా వ్యాపారులకు మార్కెట్ యాక్సెస్ కల్పిస్తుంది. మహిళల వ్యాపారాలను, స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు కేంద్రం SHE-Mart ను తీసుకొచ్చింది. మహిళలు తమ ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో డిస్ ప్లే చేయడానికి, సేల్ చేసుకోవడానికి ఇది వేదికగా పనిచేస్తుంది. ఇది మీషో, ఫ్లిఫ్ కార్డ్ తరహాలో పనిచేసే ఆన్ లైన్ పోర్టల్.

లఖ్ పతి దీదీ పథకం

Advertisement

గ్రామీణ మహిళలను ఆర్థిక స్వతంత్రులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్కీమ్. మహిళలు సంవత్సరానికి లక్ష రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ సంపాదించడానికి ఈ పథకం సహాయపడుతుంది. ఈ స్కీమ్ ద్వారా మహిళలకు స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్ ప్రెన్యూర్షిప్ ట్రైనింగ్ అందిస్తారు. స్వయం సహాయక బృందాల ద్వారా ఆర్థిక సహాయం పొందే అవకాశం ఉంది.

ప్రధాన మంత్రి మాతృ వందన యోజన

గర్భిణీలకు, పాలిచ్చే తల్లులకు ఆర్థిక సహాయం అందించే ప్రసూతి ప్రయోజన పథకం. దీని కింద మొదటి కాన్పు కోసం మూడు విడతల్లో రూ. 5,000 నేరుగా మహిళల ఖాతాలో జమ చేస్తారు. ఈ పథకం ద్వారా గర్భిణీలు, బాలింతలకు పోషకాహారం అందిస్తారు.

Also Read:  నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. 90% సబ్సిడీతో స్వయం ఉపాధి పథకాలు.. అప్లై చేసుకోండిలా!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×