E-Paper
Advertisement

Voice Search TVs: అమెజాన్‌లో వాయిస్‌ సెర్చ్ ఫీచర్లతో బెస్ట్ 4K టీవీలు.. చిటికెలో మీకు నచ్చిన కంటెంట్!

Voice Search TVs: అమెజాన్‌లో వాయిస్‌ సెర్చ్ ఫీచర్లతో బెస్ట్ 4K టీవీలు.. చిటికెలో మీకు నచ్చిన కంటెంట్!
Advertisement

Voice Search TVs: ఇప్పుడంతా చాలామంది ఇళ్లల్లో ఉన్న టీవీల్లో ఛానల్స్ మార్చాలన్నా, నచ్చిన సినిమా చూడాలన్నా.. రిమోట్‌‌ ద్వారా సెర్చ్ చేసుకునే స్మార్ట్ టెక్నాలజీ టీవీలు ఉన్నాయి. అయితే కొన్నిసార్లు రిమోట్ బటన్లతో ఒక్కో అక్షరం టైప్ చేస్తూ సెర్చ్ చేయాలంటే ఎవరికైనా విసుగు వస్తుంది. అందుకే ఇప్పుడు అందరూ వాయిస్ సెర్చ్ ఫీచర్ ఉన్న టీవీల వైపు మొగ్గు చూపుతున్నారు. అమెజాన్‌లో లభిస్తున్న కొన్ని బెస్ట్ 65 ఇంచ్ ఎల్‌ఈడీ టీవీలు మీ మాట వింటూ, చిటికెలో మీకు కావాల్సిన కంటెంట్‌ను స్క్రీన్ మీద ప్రత్యక్షం చేస్తాయి. వాటిలో ది బెస్ట్ ఆప్షన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సోనీ బ్రావియా అల్ట్రా హెచ్‌డీ టీవీ

సోనీ బ్రావియా అంటేనే పిక్చర్ క్వాలిటీకి మారుపేరు. ఈ 65 ఇంచ్ మోడల్‌లో గూగుల్ టీవీ సాఫ్ట్‌వేర్ ఉంటుంది. ఇది వాయిస్ సెర్చ్‌ను చాలా స్మూత్‌గా హ్యాండిల్ చేస్తుంది. మీరు రిమోట్‌లోని బటన్ నొక్కి ‘ప్లే పుష్ప 2’ అని అంటే చాలు, సెకన్లలో సినిమా స్టార్ట్ అవుతుంది. దీనిలోని ఎక్స్ రియాలిటీ ప్రో టెక్నాలజీ వల్ల విజువల్స్ చాలా నేచురల్‌గా ఉంటాయి. సౌండ్ క్వాలిటీ విషయంలో కూడా సోనీ తన ప్రత్యేకతను చాటుకుంది. బడ్జెట్‌లో ప్రీమియం అనుభూతిని పొందాలంటే ఈ టీవీని పరిశీలించవచ్చు.

Advertisement

Also Read: వావ్, గ్యాస్ స్టవ్‌లా పనిచేసే ఎలక్ట్రిక్ స్టవ్.. ధర కూడా చాలా తక్కువ!

శాంసంగ్ క్రిస్టల్ 4కె విజన్ ప్రో

శాంసంగ్ టీవీలు ఎప్పుడూ కలర్ ఫుల్‌గా ఉంటాయి. ఈ టీవీలో అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ రెండూ ఇన్‌బిల్ట్‌గా వస్తాయి. అంటే.. టైపింగ్ జోలికి వెళ్లకుండానే కేవలం వాయిస్ కమాండ్స్‌తో టీవీని కంట్రోల్ చేయొచ్చు. దీని స్లిమ్ డిజైన్ పెద్ద పెద్ద హాల్స్‌కు లగ్జరీ లుక్ ఇస్తుంది. స్పోర్ట్స్ చూసేటప్పుడు లేదా గేమ్స్ ఆడేటప్పుడు ఎక్కడా లాగ్ లేకుండా చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. బడ్జెట్ కాస్త అటు ఇటుగా ఉన్నా, క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదు అనుకునేవారు దీనిని చూడొచ్చు.

ఎల్జీ అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ టీవీ

Advertisement

ఎల్జీ టీవీల్లో ఉండే మేజిక్ రిమోటే. దీనిలో వాయిస్ రికగ్నిషన్ చాలా అక్యూరేట్‌గా ఉంటుంది. మన ఇండియన్ యాక్సెంట్‌ను కూడా ఇది సులువుగా అర్థం చేసుకుంటుంది. ఏఐ థింక్ క్యూ టెక్నాలజీతో వచ్చే ఈ టీవీ, మనం తరచుగా ఏం చూస్తామో గుర్తుంచుకుని, దానికి తగ్గట్టుగా సలహాలు కూడా ఇస్తుంది. మంచి బ్రైట్‌నెస్, అదిరిపోయే సౌండ్ అవుట్‌పుట్‌తో ఈ 65 ఇంచ్ టీవీ సినిమా హాల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇంట్లోనే అందిస్తుంది.

ఏసర్ అడ్వాన్స్‌డ్ ఐ సిరీస్ టీవీ

తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కావాలనుకునే వారికి ఏసర్ బెటర్ ఆప్షన్. 65 ఇంచ్ పెద్ద స్క్రీన్, 4కె రిజల్యూషన్, అద్భుతమైన వాయిస్ కంట్రోల్ ఫీచర్లు దీని సొంతం. గూగుల్ అసిస్టెంట్ సాయంతో కేవలం మీ వాయిస్‌తోనే యాప్స్ ఓపెన్ చేయడం, వాల్యూమ్ పెంచడం వంటివి చేయవచ్చు. దీని డిజైన్ కూడా చాలా మోడ్రన్‌గా ఉంటుంది. తక్కువ బడ్జెట్‌లో హోమ్ థియేటర్ సెటప్ చేసుకోవాలనుకునే వారికి ఈ టీవీ కచ్చితంగా నచ్చుతుంది.

Also Read: ఎండలకు మీ ఫోన్ సెగలు కక్కుతోందా? బ్యాటరీని చల్లబరిచే సింపుల్ టిప్స్ ఇవిగో!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×