E-Paper
Advertisement

China Aid: ఇరాన్ పాఠశాలపై దాడి.. బాధిత కుటుంబాలకు.. చైనా ఆర్థిక సాయం

China Aid: ఇరాన్ పాఠశాలపై దాడి.. బాధిత కుటుంబాలకు.. చైనా ఆర్థిక సాయం
Advertisement

China Aid: ఇరాన్‌లోని మినాబ్ నగరంలో పాఠశాలపై జరిగిన దాడిలో సుమారు 150 మంది విద్యార్థులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలకు చైనా భారీ సాయాన్ని ప్రకటించింది. 2 లక్షల డాలర్ల అత్యవసర మానవతా సాయాన్ని శుక్రవారం ప్రకటించింది. చైనా రెడ్ క్రాస్ సొసైటీ ఈ మొత్తాన్ని ఇరాన్ రెడ్ క్రెసెంట్ సొసైటీకి అందజేస్తుందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గువో జియాకున్ వెల్లడించారు.

పాఠశాలలు, చిన్నారులపై దాడులు చేయడం అంతర్జాతీయ మానవతా చట్టాలను తీవ్రంగా ఉల్లంఘించడమేనని గువో జియాకున్ అన్నారు. ఇది మానవత్వానికి, నైతికతకు వ్యతిరేకమని పేర్కొన్నారు. పౌరులు, సైనికేతర లక్ష్యాలపై జరుగుతున్న దాడులను చైనా తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు యుద్ధంతో అల్లాడుతున్న ఇరాన్ పౌరులకు అసరమైన సాయాన్ని, మద్దతును ఇచ్చేందుకు చైనా సిద్ధంగా ఉందని ఆయన భరోసా కల్పించారు.

Advertisement

మార్చి 1న వెలువడిన ఐక్యరాజ్య సమితి ప్రకటన ప్రకారం.. దక్షిణ ఇరాన్ లోని మినాబ్ లో గల బాలికల పాఠశాలను క్షిపణులు ధ్వంసం చేశాయి. ఈ దాడిలో దాదాపు 150 మంది మరణించారని, మరో 100 గాయపడ్డారని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. మరణించిన వారిలో అత్యధిక మంది విద్యార్థులే అని రాసుకొచ్చాయి. అయితే పాఠశాలపై జరిగిన దాడికి కారణం.. అమెరికా, ఇజ్రాయెల్ అని ఇరాన్ ఆరోపించింది.

అయితే ఈ దాడికి సంబంధించి అమెరికాతో పాటు ఇజ్రాయెల్ ఇప్పటివరకూ ఎలాంటి బాధ్యత తీసుకోలేదు. ఘటనకు సంబంధించిన నివేదికలను పరిశీలిస్తున్నట్లు మాత్రం అమెరికా సైన్యం పేర్కొంది. అటు ఇజ్రాయెల్ సైతం.. ఈ దాడికి సంబంధించి తమకేం తెలియదని చెబుతోంది. అయితే బాలికల పాఠశాలకు సమీపంలో ఉన్న ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) కార్యాలయాన్ని గతంలో తాము టార్గెట్ చేసిన మాట నిజమేనని ఇజ్రాయెల్ సేనలు చెప్పాయి.

Advertisement

Also Read: Jio 90 Days Plan: జియో మోస్ట్ వాంటెడ్ ప్లాన్స్.. 3 నెలల పాటు.. ఫ్రీ ఓటీటీలు, రోజూ 3GB డేటా!

ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్ పాలకులకు తాజాగా మరోమారు వార్నింగ్ ఇచ్చారు. పిచ్చిగా ప్రవర్తించే ఇరాన్ నేతలకు ఏం జరుగుతుందో త్వరలోనే ప్రపంచం చూస్తుందని ఆయన హెచ్చరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి ఉంటుందన్నారు. అమెరికా శక్తి, సామర్థ్యాలను ఏ మాత్రం తక్కువ అంచనా వేయవద్దన్నారు. మరోవైపు ఇరాన్ ట్రంప్ హెచ్చరికలను లెక్కచేయకుండా యుద్ధం రంగంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. దీంతో ఈ ఉద్రిక్తతలు ఏ స్థాయికి వెళ్తాయో అన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: DMart Offers: డీమార్ట్ బంపరాఫర్.. అత్యంత చౌకగా.. ఇండక్షన్ స్టవ్స్, రైస్ కుక్కర్లు!

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×