E-Paper
Advertisement

Bacteria: శరీరంలో బ్యాక్టీరియా.. అధిక బరువుకు కారణం..

Bacteria: శరీరంలో బ్యాక్టీరియా.. అధిక బరువుకు కారణం..
Advertisement

Bacteria: మితిమీరిన బరువు కూడా ఆరోగ్యానికి మంచిది కాదని ఇప్పటికే శాస్త్రవేత్తలు పలుమార్లు హెచ్చరించారు. దాని కారణంగానే ఒబిసిటీ అనేది వస్తుందని, ఒబిసిటీ అనేది మరెన్నో ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని కూడా ఇప్పటికే చాలాసార్లు బయటపెట్టారు. చాలావరకు బరువు పెరగడం అనేది మనం తినే ఆహారంపైనే ఆధారపడి ఉన్నా.. కొన్నిసార్లు మాత్రం దానికి వేరే కారణాలు ఉంటాయని చెప్తున్నారు. అందులో ఒక కారణాన్ని తాజాగా బయటపెట్టారు.

పేగుల నుండి బ్యాక్టీరియా అనేది ఇతర భాగాలకు లీక్ అవ్వడం వల్ల ఫ్యాట్ సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయని, అది బరువు పెరగడానికి దారితీస్తాయని శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో తేలింది. ఈ బ్యాక్టీరియాను ఎండోటాక్సిన్స్ అని అంటారు. ఇది నేరుగా బ్లడ్ సెల్స్‌లోకి వెళ్లిపోయి ఫ్యాట్ సెల్స్ ఫంక్షన్‌ను ఎఫెక్ట్ చేయడమే పనిగా పెట్టుకుంటాయి. దీని వల్ల ఒబిసిటీ మాత్రమే కాదు టైప్ 2 డయాబెటీస్ కూడా వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.

Advertisement

అధికంగా బరువు పెరుగుతున్నామని భావించిన వారు బరియాట్రిక్ సర్జరీ లాంటి మార్గాలను ఎంచుకుంటారు. కానీ అది కూడా ఫ్యాట్ సెల్స్‌ను డ్యామేజ్ చేయడంతో పాటు పూర్తిగా ఆరోగ్యంపైనే తీవ్ర ప్రభావం చూపిస్తుందని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. అందుకే అలాంటి సర్జరీలు ఎంచుకోకపోవడమే మంచిదన్నారు. ఎండోటాక్సిన్స్ అనేవి బ్యాక్టీరియల్ సెల్స్‌లో నిక్షిప్తమయి ఉంటాయి. ఆ సెల్ వాల్స్‌ చీలినప్పుడు ఒక్కసారిగా ఇవి బయటికి వస్తాయి. అలా బయటికి వచ్చిన ప్రతీసారి ఎక్కువగా ఇవి ఫ్యాట్ సెల్స్‌పైనే ప్రభావం చూపిస్తాయి.

పేగులు అనేవి ఆరోగ్యంగా ఉండే ఎండోటాక్సిన్స్ అనేవి రిలీజ్ అవ్వకుండా మనుషుల ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఒబిసిటీ ఉన్నవారిలో ఈ ఎండోటాక్సిన్స్‌కు ఉండే అడ్డుగోడ చాలా సున్నితంగా ఉంటుందని, దీని వల్లే ఇవి రక్తంలోకి లీక్ అవ్వడం కూడా సులభంగా మారుతుందని అన్నారు. ఎండోటాక్సిన్స్‌పై పరిశోధనలు చేయడం కోసం శాస్త్రవేత్తలు పూర్తిగా 156 మందిని ఎంపిక చేసుకున్నారు. అందులో 63 మంది ఒబిసిటీ పేషెంట్లు కూడా ఉన్నారు.

Advertisement

ఒబిసిటీ ఉన్నవారిలోనే ఎక్కువగా ఎండోటాక్సిన్స్ అనేవి రక్తంలో కనిపించాయని శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో తేలింది. అంతే కాకుండా ఎండోటాక్సిన్స్ అనేవి మెటాబోలిక్ యాక్టివిటీని కూడా దెబ్బతీస్తాయని అన్నారు. అందుకే మోటాబోలిజం అనేది ఆరోగ్యంగా ఉండాలంటే పేగులకు, ఫ్యాట్‌కు మధ్య ఉన్న సంబంధం బాగుండాలని వారు తేల్చారు. ఒకవేళ అలా చేయలేకపోతే ఫ్యాట్ సెల్ డ్యామేజ్‌ను అయినా తగ్గించాలని అప్పుడే అధిక బరువు అనేదానికి చెక్ పడుతుందని తెలిపారు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×