E-Paper
Advertisement

Artificial Intelligence:- 30 సెకండ్లలో 643 పదాలతో ఏఐ వ్యాసం…

Artificial Intelligence:- 30 సెకండ్లలో 643 పదాలతో ఏఐ వ్యాసం…
Advertisement

Artificial Intelligence:- కృత్రిమ మేధస్సు అనేది మానవ మేధస్సు కంటే మెరుగైనదని పలువురు టెక్ నిపుణులు ఇప్పటికే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఏదో ఒకరోజు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్.. హ్యూమన్ బ్రెయిన్‌ను మించిపోతుందని చెప్తున్నారు. అయితే ఇప్పటికే ఏఐ, దాని సామర్థ్యంతో తయారైన చాట్‌జీపీటీ.. పలు విషయాల్లో వెనకబడి ఉన్నాయని, వాటికి ఇంకా ట్రెయినింగ్ అవసరమని పలువురు భావిస్తున్నారు. దానికోసమే చాట్‌జీపీటీ ఒక ప్రత్యేకమైన టెస్టులో పాల్గొంది.

Advertisement

ఇప్పటివరకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా తయారైన టెక్నాలజీలలో మైక్రోసాఫ్ట్ తయారు చేసిన చాట్‌జీపీటీ అనేది ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. ఇప్పటికే చాట్‌జీపీటీ అనేది దాదాపు అన్ని రంగాల్లో తన సత్తాను చాటుకుంది. కొన్ని రంగాల్లో కాస్త వెనకబడినట్టు అనిపించినా.. సమయం గడుస్తున్నకొద్దీ మరింత అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగిస్తూ, దానిని అప్డేట్ చేస్తూ ఉంటే.. ఈ సమస్యలు తీరిపోతాయని నిపుణులు తెలిపారు.

ఇప్పటికే లీగల్ ఫీల్డ్‌లో, టెక్ రంగంలో, ఫ్యాషన్ డిజైనింగ్‌లో.. ఇలా దాదాపు అన్ని రంగాల్లో చాట్‌జీపీటీ అడుగుపడింది. అన్నింటిలో చాట్‌జీపీటీ వల్ల పలు పెద్ద తప్పులు కూడా జరిగాయి. ఇది మనిషి మేధస్సు కాదు కాబట్టి కృత్రిమ మేధస్సు కాబట్టి ఇలాంటి తప్పులు జరిగాయని పలువురు విమర్శించడానికి ఈ తప్పులు కారణమయ్యాయి. అయితే సాహిత్యంలో చాట్‌జీపీటీ సామర్ధ్యం ఎలా పనిచేస్తుందని తెలుసుకోవాలి అనుకున్నారు పలువురు నిపుణులు. అందుకే దానికి ఒక టెస్ట్ పెట్టారు.

Advertisement

ఇండియాలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఏ విధంగా ముందుకెళ్తోంది, ఇండియాకు దాని వల్ల జరుగుతున్న లాభాలేంటి అని తెలుపుతూ చాట్‌జీపీటీని ఒక వ్యాసం రాయమన్నారు. కేవలం 30 సెకండ్లలోనే 643 పదాలతో వ్యాసాన్ని సిద్ధం చేసింది చాట్‌జీపీటీ. పైగా ఈ పదాలన్నీ గ్రామర్‌తో సహా కరెక్ట్‌గా ఉన్నాయని నిపుణులు తెలిపారు. అయితే ఈ వ్యాసాన్ని నిపుణులు ఇప్పటివరకు పూర్తిగా చెక్ చేయకపోయినా.. ఇది కచ్చితంగా కరెక్ట్‌గానే ఉంటుందని వారు నమ్ముతున్నారు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×