E-Paper
Advertisement

కన్వర్టిబుల్ ఫ్రిజ్ కొంటున్నారా? మీ డబ్బులు వేస్ట్ అవ్వకుండా ఉండేందుకు బెస్ట్ టిప్స్

కన్వర్టిబుల్ ఫ్రిజ్ కొంటున్నారా? మీ డబ్బులు వేస్ట్ అవ్వకుండా ఉండేందుకు బెస్ట్ టిప్స్
Advertisement

Convertible Refrigerators: కొత్తగా ఫ్రిజ్ కొనడానికి మార్కెట్‌కి లేదా ఆన్‌లైన్ ఈ-కామర్స్ సైట్లలోకి వెళ్లినప్పుడు మనకు ఎక్కువగా వినిపించే పదం ‘కన్వర్టిబుల్ రిఫ్రిజిరేటర్’(Convertible Refrigerator). సాధారణ ఫ్రిజ్‌లతో పోలిస్తే వీటి ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. దాంతో అసలు ఎక్స్‌ట్రా డబ్బులు పెట్టి ఈ కన్వర్టిబుల్ ఫ్రిజ్ కొనడం నిజంగా వర్త్ ఏనా? లేక ఇదొక మార్కెటింగ్ స్టంటా? అనే సందేహం చాలా మందికి వస్తుంటుంది. కొనే ముందు తప్పకుండా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..

సాధారణ డబుల్ డోర్ ఫ్రిజ్‌లలో పైన ఫ్రీజర్, కింద సాధారణ రిఫ్రిజిరేటర్ ఉంటాయి. కానీ కన్వర్టిబుల్ రిఫ్రిజిరేటర్లలో ఉండే ప్రత్యేకత ఏంటంటే.. అవసరాన్ని బట్టి ఫ్రీజర్ భాగాన్ని సాధారణ ఫ్రిజ్‌గా మార్చుకోవచ్చు. బ్రాండ్‌ను బట్టి 3-ఇన్-1, 5-ఇన్-1, 8-ఇన్-1 లేదా 10-ఇన్-1 మోడ్‌లు అందుబాటులో ఉంటాయి.

Advertisement

కన్వర్టిబుల్ మోడ్ : పండగలు, ఫంక్షన్లు లేదా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు ఫ్రిజ్ నిండిపోతుంది. అప్పుడు ఫ్రీజర్ కూడా సాధారణ ఫ్రిజ్‌గా మార్చేస్తే కూరగాయలు, మిగిలిన వంటకాలు పెట్టుకోవడానికి 30% నుంచి 80% వరకు ఎక్కువ స్థలం దొరుకుతుంది.

వెకేషన్ మోడ్ : మీరు వారం లేదా నెల రోజులు ఊరెళ్తున్నప్పుడు కింద ఉన్న సాధారణ ఫ్రిజ్‌ను ఆఫ్ చేసి, కేవలం ఫ్రీజర్‌ను మాత్రమే ఆన్ ఉంచొచ్చు. దీని వల్ల కరెంట్ బిల్లు చాలా వరకు సేవ్ అవుతుంది అని చెప్పొచ్చు.

Advertisement

సిజనల్ / సమ్మర్ మోడ్ : సమ్మర్ లో ఐస్, కూల్ డ్రింక్స్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఫ్రీజర్‌ను పవర్‌ఫుల్‌గా వాడవచ్చు. చలికాలంలో ఫ్రీజర్ అవసరం లేనప్పుడు దాన్ని ఆఫ్ చేయవచ్చు.

మినీ ఫ్రిజ్ మోడ్: బ్యాచిలర్స్ లేదా తక్కువ వస్తువులు ఉన్నప్పుడు కేవలం ఫ్రీజర్ మాత్రమే సాధారణ ఫ్రిజ్‌గా మార్చి వాడుకోవచ్చు.

ఎవరు కొంటే వర్త్?
పెద్ద కుటుంబాలు & పండగ హడావుడి: ఇంట్లో ఎక్కువమంది ఉన్నా లేదా తరచూ ఇంటికి చుట్టాలు వస్తూ ఉన్నా కన్వర్టిబుల్ ఫ్రిజ్ బెస్ట్.

వెజిటేరియన్స్: నాన్- వెజ్ రోజూ తింటే ఫ్రీజర్ అవసరం ఉంటుంది. కానీ వెజిటేరియన్లకి ఐస్ క్యూబ్స్ తప్ప ఫ్రీజర్‌తో పెద్దగా పని ఉండదు. అలాంటి వారు ఫ్రీజర్‌ని సాధారణ ఫ్రిజ్‌ గా మార్చి కూర గాయలు, పండ్లు ఎక్కువ రోజులు దాచు కోవచ్చు.

Also Read: డైలీ మార్నింగ్ కేఫ్ స్టైల్ కాఫీ కావాలా? ఈ గార్జెట్ మీ కోసమే

కరెంట్ బిల్లు పెరుగుతుందా?

సాధారణ ఇన్వర్టర్ రిఫ్రిజిరేటర్లతో పోలిస్తే.. ఇవి చాలా స్మార్ట్‌గా పని చేస్తాయి. అవసరం లేని విభాగాన్ని ఆపివేయడం ద్వారా కరెంట్ బిల్లును పెంచక పోగా మరింత సేవ్ చేస్తాయి.

మీరు సాధారణ సింగిల్ లేదా డబుల్ డోర్ ఫ్రిజ్‌తో పోలిస్తే రూ. 2,000 నుంచి రూ. 4,000 ఎక్స్‌ట్రా పెట్టి కన్వర్టిబుల్ ఫ్రిజ్ కొంటే.. అది 100% వర్త్ అని చెప్పవచ్చు. స్థలం కొరత లేకుండా సర్దు బాటు చేసుకునే సౌకర్యం, కరెంట్ ఆదా వంటి ఫీచర్లు ఉండటం రాబోయే రోజుల్లో కన్వర్టిబుల్ రిఫ్రిజిరేటర్ కొనడం చాలా తెలివైన నిర్ణయం.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×