E-Paper
Advertisement

టెస్ట్ ప్లేయ‌ర్ అంటూ ట్రోల్స్‌..ఇచ్చిప‌డేసిన తిల‌క్‌..రెండో టీ20లోనూ టీమిండియా విజ‌యం

టెస్ట్ ప్లేయ‌ర్ అంటూ ట్రోల్స్‌..ఇచ్చిప‌డేసిన తిల‌క్‌..రెండో టీ20లోనూ టీమిండియా విజ‌యం
Advertisement

India vs Zimbabwe 2nd T20: టీమిండియా వర్సెస్ జింబాబ్వే ( Team India vs. Zimbabwe ) మధ్య టి20 సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇంగ్లాండ్, ఐర్లాండ్ చేతుల్లో చిత్తయిన టీమిండియా…. జింబాబ్వే పైన మాత్రం అద్భుతంగా రాణిస్తుంది. ఈ క్రమంలోనే హరరే లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన రెండో టి20 లో కూడా టీమిండియా విక్టరీ అందుకుంది. టీమిండియా విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వే, చిత్తయింది. దీంతో టీమిండియా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకొని..2-0 తేడాతో సిరీస్ కూడా కైవసం చేసుకుంది.

Also Read: 6, 6, 6, 6 వైభ‌వ్ సిక్సుల వ‌ర్షం..A సింబ‌ల్ చూపిస్తూ సెల‌బ్రేష‌న్స్‌, టీమిండియా విజ‌యం

ఇచ్చిప‌డేసిన తిల‌క్‌..రెండో టీ20లోనూ టీమిండియా విజ‌యం

Advertisement

టీమిండియా వర్సెస్ జింబాబ్వే మధ్య హరారే వేదికగా రెండో టి20 జరిగింది. అయితే ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా 90 పరుగుల తేడాతో విక్టరీ నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా మొదటి బ్యాటింగ్ చేయగా 219 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో జింబాబ్వే 17.5 ఓవర్లకు 129 పరుగులు చేసి కుప్ప కూలింది. ఈ క్రమంలో టీమిండియా మరో విక్ట‌రీ నమోదు చేసుకొని… సిరీస్ గెలుచుకుంది. ఈ నేపథ్యంలోనే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా తొలి సిరీస్ గెలుచుకున్నాడు. ఇప్పటికే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్ ల‌లో భార‌త్ ఓడిపోయిన‌ సంగతి తెలిసిందే.

ఇరగదీసిన తిలక్ వర్మ… ఆ మిస్టరీ లేడీ కారణమా ?

టీమిండియా వర్సెస్ జింబాబ్వే మధ్య హరారే వేదికగా రెండో టి20 జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా విక్టరీ అందుకుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయినప్పటికీ.. మొదటి బ్యాటింగ్ కు దిగి భారీ స్కోరు సాధించింది టీం ఇండియా. ఓపెనర్లు ఇద్దరు విఫలమైనప్పటికీ ఇషాన్ కిషన్, తిలక్ వర్మ అదిరిపోయే బ్యాటింగ్ తో రెచ్చిపోయారు. దీంతో 20 ఓవర్లలో 219 పరుగులు సాధించింది టీమిండియా. అటు తనపై ట్రోలింగ్ చేసే వాళ్లకు బ్యాట్ తో సమాధానమిచ్చాడు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ. కేవలం 29 బంతులు ఎదుర్కొన్న తిలక్ వర్మ.. 60 పరుగులు సాధించాడు. 200 స్ట్రైక్ రేటుతో మూడు సిక్సర్లతో పాటు ఐదు బౌండరీలు బాదాడు.

Advertisement

దీంతో టెస్ట్ ప్లేయర్ అన్న వాళ్లకు బ్యాట్ తో చెంప చెల్లుమనేలా అనుసరించాడు తిలక్. అయితే తిలక్ వర్మ బ్యాటింగ్ కు కారణం ఓ మిస్టరీ లేడీ అంటూ సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. హరారే స్టేడియానికి ఓ అందమైన అమ్మాయి వచ్చింది. ఆమె తిలక్ వర్మ ప్రియురాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సీక్రెట్ గా ఆమెతో మనోడు రిలేషన్ షిప్ పెట్టుకున్నాడని అంటున్నారు. అందుకే ఆమె రాగానే బ్యాట్ తో పరుగులు రాబట్టాడని తిలక్ వర్మపై పోస్టులు పెడుతున్నారు. అయితే అదేమీ కాదని.. ఆ అమ్మాయికి, తిలక్ వర్మ కు ఎలాంటి సంబంధం లేదని అతని ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు.

Also Read: ఆ పాకిస్తాన్ వెధ‌వ‌ను వ‌ద్ద‌ని మొత్తుకున్నా, కావ్య‌నే విన‌లేదు.. SRH కోచ్ సీరియ‌స్‌

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×