E-Paper
Advertisement

Macbook Air M5: ఇండియాలో ఆపిల్ స్లిమ్ ల్యాప్‌టాప్ లాంచ్.. M5 చిప్‌తో కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్

Macbook Air M5: ఇండియాలో ఆపిల్ స్లిమ్ ల్యాప్‌టాప్ లాంచ్.. M5 చిప్‌తో కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్
Advertisement

Macbook Air M5| ఆపిల్ కంపెనీ తాజాగా కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్ లాంచ్ చేసింది. భారతదేశంలో పాటు ప్రపంచ మార్కెట్‌లలో అందుబాటులో ఉంది. ఈ ల్యాప్‌టాప్‌లో లేటెస్ట్ ఆపిల్ M5 చిప్ ఉంది. తక్కువ బరువు గల ఈ కొత్త మ్యాక్‌బుక్ రెండు సైజుల్లో వస్తుంది. 13.6 ఇంచ్, 15.3 ఇంచ్ సైజుల్లో ఎంచుకోవచ్చు. స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్, క్రియేటర్ల కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది. ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు  ఇందులో ఆకర్షణీయంగా ఉన్నాయి.

ధర, లభ్యత

13.6 ఇంచ్ మోడల్ ప్రారంభ ధర భారత్‌లో రూ.1,19,900.
15.3 ఇంచ్ పెద్ద మోడల్ ధర రూ.1,44,900.
నాలుగు కలర్.. స్కై బ్లూ, సిల్వర్, మిడ్‌నైట్, స్టార్‌లైట్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
మార్చి 4 నుంచి ప్రీ-ఆర్డర్లు మొదలయ్యాయి. మార్చి 11 నుంచి అధికారికంగా సేల్స్ ప్రారంభమవుతాయి.

పర్‌ఫామెన్స్, ప్రాసెసర్ వివరాలు

Advertisement

ఈ ల్యాప్‌టాప్‌లో కొత్త M5 చిప్ ఉంది. ఇందులో 10-కోర్ CPUతో వస్తుంది. M4 మోడల్స్ కంటే AI పర్‌ఫామెన్స్ నాలుగు రెట్లు ఫాస్ట్ అని ఆపిల్ చెబుతోంది. గేమింగ్ కూడా మెరుగైంది. ఇందులో 3rd జెనెరేషన్ రే ట్రేసింగ్ ఇంజిన్ ఉంది. వెబ్ బ్రౌజింగ్ Intel Core Ultra X7 ల్యాప్‌టాప్‌ల కంటే 50 శాతం వేగంగా పనిచేస్తుంది. స్టాండర్డ్‌గా 512GB స్టోరేజ్‌తో వస్తుంది.

డిస్‌ప్లే క్వాలిటీ

లిక్విడ్ రెటినా డిస్‌ప్లే టెక్నాలజీ ఉంది. 13.6 ఇంచ్ లేదా 15.3 ఇంచ్ ఎంచుకోవచ్చు. గరిష్ట బ్రైట్‌నెస్ 500 నిట్స్. ఒక బిలియన్ కలర్స్ సపోర్ట్ చేస్తుంది. అంటే వీడియో ఎడిటింగ్, బ్రౌజింగ్, సినిమాలు చూడటానికి చాలా షార్ప్, అద్భుతమైన కలర్స్ ఉన్నాయి.

కెమెరా, ఆడియో ఫీచర్లు

Advertisement

12 మెగాపిక్సెల్ సెంటర్ స్టేజ్ కెమెరా ఉంది. డెస్క్ వ్యూ ఫంక్షన్ కూడా ఉంది. వీడియో కాల్స్‌ చేసే సమయంలో మీ ముఖాన్ని, శరీరాన్ని సరిగ్గా ఫ్రేమ్‌లో ఉంచుతుంది. మూడు మైక్రోఫోన్లు ఉన్నాయి. స్పేషియల్ ఆడియో, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. సినిమాలు, మ్యూజిక్ చాలా ఇమ్మర్సివ్‌గా వినిపిస్తాయి.

కనెక్టివిటీ, నెట్‌వర్కింగ్

బ్లూటూత్, వై-ఫై సపోర్ట్ ఫీచర్స్ ఉన్నాయి. రెండు థండర్‌బోల్ట్ 4 పోర్టులు ఉన్నాయి. కొత్త N1 వైర్‌లెస్ చిప్‌తో ఇంతకుముందు ఉన్న మ్యాక్‌బుక్స్ కంటే వైర్‌లెస్ పర్‌ఫామెన్స్ మెరుగైంది. ఎక్స్‌టర్నల్ డిస్‌ప్లేలు, ఇతర డివైస్‌లు సులభంగా కనెక్ట్ చేయవచ్చు.

Also Read:  ఇన్‌స్టాగ్రామ్‌లో సీక్రెట్ సెట్టింగ్.. ఆన్‌లైన్‌లో ఉన్నా ఆఫ్‌లైన్ చూపించవచ్చు.. ఇలా చేయండి

బ్యాటరీ లైఫ్, సాఫ్ట్‌వేర్

ఒకే చార్జ్‌తో 18 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. macOS Tahoe సాఫ్ట్‌వేర్ ఉంది. ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో ప్రొడక్టివిటీ పెరుగుతుంది. మల్టీటాస్కింగ్ స్మూత్‌గా ఉంటుంది.

కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్‌లో మెరుగైన పర్‌ఫామెన్స్, ఎఫిషియెన్సీ ఉంది. M5 చిప్ AI, గేమింగ్‌లో బాగా మెరుగైంది. డిస్‌ప్లే బ్రైట్‌నెస్, కలర్ అక్యురసీ గొప్పగా ఉన్నాయి. బ్యాటరీ లైఫ్ దీని బలం. లైట్‌వెయిట్ డిజైన్‌తో పాటు పవర్‌ఫుల్ పనితీరు ఇస్తుంది. మీ బడ్జెట్, అవసరాలకు తగినట్లు సైజ్ ఎంచుకోవచ్చు.

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×