E-Paper
Advertisement

iPhone 16: ఐఫోన్ లవర్స్‌కు పండగే.. ఇక మేడ్ ఇన్ ఇండియా ఫోన్లు.. భారీగా తగ్గనున్నధరలు!

iPhone 16: ఐఫోన్ లవర్స్‌కు పండగే.. ఇక మేడ్ ఇన్ ఇండియా ఫోన్లు.. భారీగా తగ్గనున్నధరలు!
Advertisement

iPhone 16: కాలిఫోర్నియాకు చెందిన టెక్ కంపెనీ ఆపిల్ ఇండియా మొబైల్ లవర్స్‌కు అదిరిపోయే శుభవార్త చెప్పింది. తన ఐఫోన్ మోడల్స్‌ను దేశీయంగా తయారు చేయడం ప్రారంభించింది. వీటిలో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్‌లతో పాటు, ఐఫోన్ 14 ఉన్నాయి. అయితే ఆపిల్ తన ప్రో మోడల్ ఫోన్లనను దేశంలో తయారు చేయడం లేదు. కానీ కంపెనీ నుంచి త్వరలో రాబోయే ప్రెస్టీజియస్ కొత్త ఐఫోన్ లైనప్ 16 సిరీస్‌లో ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్ మోడల్‌లను కంపెనీ తయారు చేయబోతున్నట్లు లీక్‌లు వస్తున్నాయి.

ఇంటర్నెట్‌లోని సమాచారం ప్రకారం ఐఫోన్ 16 ప్రో. ఐఫోన్ 16 ప్రో మాక్స్ మోడళ్లను దేశంలో అసెంబుల్ చేయనుంది. ఆపిల్ చాలా కాలంగా చైనా నుండి ఇండియాకి ఉత్పత్తిని పెంచే దిశగా కృషి చేస్తోంది. దీని కోసం భారీ పెట్టుబడులు కూడా వచ్చాయి. ఈ సంవత్సరం మొదటిసారిగా ఆపిల్ తన ప్రో మోడల్‌లను చైనా కాకుండా ఇండియాలో తయారు చేయనుంది.

Advertisement

Also Read: Realme P1 Pro 5G Price Cut: 5జీ ఫోన్‌పై బిగ్ డీల్.. డిస్కౌంట్ చూస్తే ఎగిరిగంతేస్తారు!

ఆపిల్ కంపెనీ ప్రో మోడల్స్ ఉత్పత్తి తమిళనాడులో ప్రారంభం కానుంది. ఈ సంవత్సరం చివరిలోపు దేశంలో ఐఫోన్ 16 ప్రో మోడల్స్ ఉత్పత్తి ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. భారతదేశంలో తయారైన ప్రో మోడల్స్ లాంచ్ సమయంలో స్థానికంగా సేల్‌కు వస్తాయో లేదో చెప్పలేము. కానీ ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత దేశంలో తయారైన ఫోన్లు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంటాయి.

Advertisement

దేశంలో ఆపిల్ తమిళనాడులోని ఫాక్స్‌కాన్ ఫెసిలిటీలో ఐఫోన్ 16 ప్రో మోడళ్లను తయారు చేయనుంది. ప్రో మోడల్స్ కోసం ఆపిల్ త్వరలో ‘న్యూ ప్రొడక్ట్ ఇంట్రడక్షన్’ (NPI) ప్రక్రియను ప్రారంభించవచ్చని నివేదిక పేర్కొంది. కొత్త iPhone 16 లైనప్‌ను సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో విడుదల కావచ్చు. ఆ తర్వాత మాత్రమే ప్రో మోడల్‌ల ఉత్పత్తిని భారీగా చేయనుంది.

Also Read: Top Selling Smartphones: ఆల్ టైమ్ రికార్డ్.. అత్యధికంగా అమ్ముడవుతున్న ఫోన్లు ఇవే.. ఎందుకంటారు?

దేశంలోనే ఉత్పత్తి చేయడం వల్ల ప్రో మోడల్స్ ధర తగ్గుతుందా లేదా అని చాలా మంది ఐఫోన్ ప్రియులు ఆశ్చర్యపోవచ్చు. భారతదేశంలో తయారు చేయబడిన ఇతర ఐఫోన్‌లపై ప్రత్యేక ఆఫర్‌లు, డిస్కౌంట్‌లను కంపెనీ అందిచనుంది. కానీ ప్రో మోడళ్లపై ఆఫర్లు ఉంటాయో లేదో తెలియాల్సి ఉంది. ప్రో మోడళ్లను దిగుమతి చేసుకోవడం వల్ల ఆపిల్ ఎక్కువ కస్టమ్ డ్యూటీని చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పడు దేశీయంగా తయారు చేస్తున్ననారు కాబట్టి ఆఫర్‌లతో మునుపటి కంటే తక్కువ ధరకు కొత్త ప్రో మోడళ్లను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×