// // iPad Air| 1TB స్టోరేజ్‌తో పవర్‌ఫుల్ టాబ్లెట్.. ఆపిల్ M4 చిప్‌తో కొత్త ఐప్యాడ్ ఎయిర్ లాంచ్ -->
E-Paper
Advertisement

iPad Air: 1TB స్టోరేజ్‌తో పవర్‌ఫుల్ టాబ్లెట్.. ఆపిల్ M4 చిప్‌తో కొత్త ఐప్యాడ్ ఎయిర్ లాంచ్

iPad Air: 1TB స్టోరేజ్‌తో పవర్‌ఫుల్ టాబ్లెట్.. ఆపిల్ M4 చిప్‌తో కొత్త ఐప్యాడ్ ఎయిర్ లాంచ్
Advertisement

iPad Air Launch| దిగ్గజ టెక్ కంపెనీ ఆపిల్,, ఇండియాతో పాటు, ఇతర ప్రపంచదేశాల్లో కొత్త పవర్‌ఫుల్ టాబ్లెట్ లాంచ్ చేసింది. దీని పేరు ఐప్యాడ్ ఎయిర్. ఈ లాంచ్‌తో పాటు కొత్త బడ్జెట్ ఐఫోన్.. iPhone 17e కూడా విడుదలైంది. ఐప్యాడ్ ఎయిర్.. రెండు డిస్‌ప్లే సైజుల్లో వస్తుంది. 11 ఇంచ్, 13 ఇంచ్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు సపోర్ట్ చేస్తుంది. ఆఫీస్ ఉద్యోగులు, విద్యార్థులతో పాటు క్రియేటివ్ వర్క్ కోసం ఈ టాబ్లెట్ రూపొందించబడింది.

భారత్‌లో ఐప్యాడ్ ఎయిర్ ధరలు

11 ఇంచ్ మోడల్ 12GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.64,900. 256GB వేరియంట్ రూ.74,900, 512GB రూ.94,900, 1TB వేరియంట్ ధర రూ.1,14,900. Wi-Fi + సెల్యులార్ మోడల్స్‌కు రూ.15,000 అదనంగా చెల్లించాలి.

Advertisement

13 ఇంచ్ మోడల్ 12GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.84,900. 256GB రూ.94,900, 512GB రూ.1,14,900, 1TB వేరియంట్ ధర రూ.1,34,900. సెల్యులార్ కనెక్టివిటీకి రూ.10,000 ఎక్స్‌ట్రా. బ్లూ, గ్రే, పర్పుల్, స్టార్‌లైట్ రంగుల్లో లభిస్తుంది. ఆపిల్ అధికారిక వెబ్‌సైట్, అధికారిక స్టోర్లలో సేల్స్ ప్రారంభమయ్యాయి. ఇప్పుడే ఆర్డర్ చేయండి.

డిస్‌ప్లే, డిజైన్

13 ఇంచ్ మోడల్‌లో 2732 x 2048 రిజల్యూషన్ ఉంది. లిక్విడ్ రెటినా IPS డిస్‌ప్లే ప్యానెల్ ఉపయోగించారు. పిక్సెల్ డెన్సిటీ 264 ppi. పీక్ బ్రైట్‌నెస్ 600 నిట్స్ వరకు ఉంటుంది. యాంటీ-రిఫ్లెక్టివ్ కోటింగ్ ఉండటం వల్ల బయట ఎండలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఆపిల్ పెన్సిల్ సపోర్ట్ ఉంది. క్రియేటివ్ వర్క్‌లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

పర్‌ఫామెన్స్, సాఫ్ట్‌వేర్

Advertisement

కొత్త M4 చిప్‌తో పవర్ అవుతుంది. స్పీడ్, ఎఫిషియెన్సీ రెండూ మెరుగవుతాయి. మల్టీటాస్కింగ్, క్రియేటివ్ వర్క్‌లు సులభంగా జరుగుతాయి. iPadOS 26తో రన్ అవుతుంది. అడ్వాన్స్‌డ్ AI ఫీచర్లు సపోర్ట్ చేస్తుంది. ప్రొడక్టివిటీ, మీడియా కన్సంప్షన్ మెరుగవుతాయి.

కెమెరా, కనెక్టివిటీ

వెనక 12MP కెమెరా f/1.8 అపర్చర్‌తో ఉంది. 5x డిజిటల్ జూమ్ సపోర్ట్ చేస్తుంది. ముందు కూడా 12MP కెమెరా ఉంది. ఫోటోలు, వీడియో కాల్స్ స్పష్టంగా వస్తాయి. C1X మోడెమ్‌తో నెట్‌వర్క్ స్పీడ్స్ మెరుగవుతాయి. Wi-Fi, బ్లూటూత్ సపోర్ట్ ఉన్నాయి. N1 నెట్‌వర్కింగ్ చిప్ ఉంది. యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, అంబియంట్ లైట్ సెన్సార్, బ్యారోమీటర్ వంటి సెన్సార్లు ఉన్నాయి.

Also Read: హోమ్ ప్రొజెక్టర్లకు పెరుగుతున్న డిమాండ్.. స్మార్ట్‌టివి లేదా ప్రొజెక్టర్ ఏది కొనడం బెస్ట్?

బ్యాటరీ పెర్ఫామెన్స్

36.59Wh బ్యాటరీ ఉంది. ఈ కెపాసిటీతో టాబ్లెట్ 10 గంటల వీడియో ప్లేబ్యాక్ ఇస్తుందని తెలిపింది. సాధారణ ఉపయోగంలో రోజంతా సరిపోతుంది.

కొత్త ఐప్యాడ్ ఎయిర్ పెర్ఫామెన్స్, పోర్టబిలిటీ కలిపి ఇస్తుంది. M4 చిప్‌తో ప్రీమియం పొజిషనింగ్ బలపడింది. స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్, కంటెంట్ క్రియేటర్లకు ఇది గొప్ప ఆప్షన్.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×