E-Paper
Advertisement

స్క్రీన్‌తో వస్తున్న Apple HomePod.. వాయిస్ కంట్రోల్‌కి గుడ్‌బై చెప్పాల్సిందేనా?

స్క్రీన్‌తో వస్తున్న Apple HomePod.. వాయిస్ కంట్రోల్‌కి గుడ్‌బై చెప్పాల్సిందేనా?
Advertisement

Apple HomePod: ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ స్మార్ట్ హోమ్ విభాగంలోకి మళ్లీ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. వచ్చే అక్టోబర్‌లో డిస్‌ప్లేతో కూడిన ఒక కొత్త హోమ్‌పోడ్‌ను మార్కెట్లోకి తీసుకురావాలని చూస్తోంది. ఇప్పటివరకు స్మార్ట్ స్పీకర్ల రంగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న గూగుల్, అమెజాన్‌లకు గట్టి పోటీ ఇచ్చేలా ఆపిల్ దీనిని తీర్చిదిద్దుతోంది. ఇప్పుడీ ప్రొడక్ట్ గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి..

సరికొత్త ఫీచర్లు:

ఈ కొత్త హోమ్‌పోడ్‌లో 7 అంగుళాల డిస్‌ప్లే ఉండబోతోంది. ఇది యాపిల్ రూపొందించిన ప్రత్యేక టీవీ-ఓఎస్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఇన్నాళ్లూ కేవలం ఆడియో డివైజ్‌గా ఉన్న హోమ్‌పోడ్‌కు ఇప్పుడు స్క్రీన్ కూడా జతకావడంతో, వినియోగదారులకు సరికొత్త అనుభూతిని అందించనుంది.

Advertisement

Also Read: 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ.. HMD నుంచి 3 పవర్‌ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్!

అసలైన బలం సిరి AI:

ఈ పరికరానికి అసలైన ప్రాణం సిరి AI. గతంలో కొన్ని కారణాల వల్ల సిరి అప్‌డేట్స్ ఆలస్యమైనప్పటికీ.. ఈసారి మాత్రం అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలతో దీనిని అందుబాటులోకి తెస్తున్నారు. ఇంట్లోని వివిధ ఫీచర్లను సులభంగా కంట్రోల్ చేయడానికి, కమాండ్స్ వేగంగా అర్థం చేసుకోవడానికి ఈ సిరి ఏఐ సహాయపడుతుంది.

మార్కెట్‌లో నిలదొక్కుకుంటుందా?

Advertisement

ఐఫోన్ లాంచ్ తర్వాత రానున్న ఈ డివైజ్ స్మార్ట్ హోమ్ రంగంలో సరికొత్త ఊపు తెచ్చే అవకాశం ఉంది. దీని ధర వివరాలు ఇంకా వెల్లడికానప్పటికీ, శక్తివంతమైన సిరి ఏఐతో రాబోతున్న ఈ స్క్రీన్ హోమ్‌పోడ్ ఖచ్చితంగా యాపిల్ ప్రేమికులను ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు.

Also Read: WhatsApp యూజర్లకు బిగ్ రిలీఫ్.. స్టేటస్ క్యాప్షన్‌లో తప్పు పడిందా? ఇక డిలీట్ చేయక్కర్లేదు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×