E-Paper
Advertisement

అక్క మరణంపై మెహర్ రమేష్ ఎమోషనల్ పోస్ట్!

అక్క మరణంపై మెహర్ రమేష్ ఎమోషనల్ పోస్ట్!
Advertisement

Meher Ramesh: ప్రముఖ డైరెక్టర్ మెహర్ రమేష్ (Meher Ramesh)ఇంట్లో పెళ్లి భాజాలు మోగాయి. ఆయన కూతురు పెళ్లి చాలా ఘనంగా జరిగింది. ఈ సంతోషాన్ని మరువక ముందే ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తనకు అన్ని విషయాలలో అండగా నిలిచిన తన సోదరి , తీవ్రమైన న్యూమోనియాతో బాధపడుతూ మరణించడాన్ని మెహర్ రమేష్ జీర్ణించుకోలేకపోయారు. ఈ మేరకు మెహర్ రమేష్ కన్నీటి పర్యంతమవుతూ ఎమోషనల్ పోస్ట్ పంచుకున్నారు. తన కూతురు పెళ్లిని దగ్గరుండి తన అక్కే చూసుకుందని, అయితే అంతలోనే తన అక్క కానరాని లోకాలకు వెళ్ళిపోతుందని కలలో కూడా అనుకోలేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

అక్క మరణంపై మరో ఎమోషనల్ పోస్ట్ పంచుకున్న మెహర్ రమేష్..

ఇకపోతే అక్క మరణంతో తీవ్ర భావోద్వేగానికి లోనైన మెహర్ రమేష్ .. సోషల్ మీడియా వేదికగా మరో ఎమోషనల్ పోస్ట్ పంచుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అక్కతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన షేర్ చేసిన ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ మారుతున్నాయి.. ఈ మేరకు తాజాగా పంచుకున్న ఫోటోలలో బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు పంచుకోగా.. అందులో మెహర్ రమేష్ ఆయన సోదరి మెహర్ జ్యోతి సుంకర తో పాటు వారి మామయ్య మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi )కూడా ఉండడం అందరి దృష్టిని ఆకట్టుకుంది. దీంతోపాటు కష్టకాలంలో తన కుటుంబానికి అండగా నిలిచిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), నాగబాబు ఫోటోలను కూడా మెహర్ రమేష్ ఇందులో పోస్ట్ చేశారు. అంతేకాదు తన బాల్యంలో మెగాస్టార్ తో తను, తన అక్క కలిసి దిగిన ఫోటోని , అలాగే ఇటీవల కాలంలో చిరంజీవితో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలను కూడా ఆయన షేర్ చేశారు.

Advertisement

also read:కాబోయే భర్తను పరిచయం చేసిన ‘గద్దల కొండ గణేష్’ మూవీ హీరోయిన్!

మీ ఆప్యాయతకు ఎప్పటికీ కృతజ్ఞుడినే – మెహర్ రమేష్

ఈ సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ పంచుకుంటూ.. “నా జీవితంలో అత్యంత క్లిష్ట సమయంలో నా కుటుంబానికి ధైర్యం చెప్పిన బంధువులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు, అభిమానుల ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను. మా అక్క జ్ఞాపకాలు ఎప్పటికీ మా హృదయాలలో నిలిచిపోతాయి. ఆమె మా పట్ల చూపించిన ప్రేమ, ఆప్యాయత ఎప్పటికీ మాకు జీవితాంతం వెంట ఉంటాయి” అంటూ తన ఆవేదనకు అక్షర రూపం ఇచ్చారు రమేష్ . ప్రస్తుతం మెహర్ రమేష్ షేర్ చేసిన ఈ ఫోటోలు, పంచుకున్న ఎమోషనల్ పోస్ట్ కి అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. త్వరగా ఆ బాధ నుండి రికవరీ అవ్వండి అంటూ కోరుకుంటున్నారు.. మెహర్ రమేష్ సోదరి మెహర్ జ్యోతి సుంకర 14 రోజులపాటు వైరల్ న్యూమోనియాతో పోరాడుతూ తుది శ్వాస విడిచారు.

డైరెక్షన్ కాదు.. నటుడిగా..

Advertisement

మెహర్ రమేష్ సినిమాల విషయానికొస్తే.. కన్నడ ఇండస్ట్రీ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈయన.. ఆ తర్వాత బిల్లా, కంత్రి, శక్తి , షాడో, భోళా శంకర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం సరైన సక్సెస్ లభించకపోవడంతో నటుడిగా మేకప్ వేసుకోబోతున్నట్లు సమాచారం.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×