E-Paper
Advertisement

iPhone Air Deal: ఐఫోన్ ఎయిర్‌పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. బ్లాక్ ఫ్రైడే సేల్‌లో ఏకంగా రూ.65వేలు తగ్గింపు!

iPhone Air Deal: ఐఫోన్ ఎయిర్‌పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. బ్లాక్ ఫ్రైడే సేల్‌లో ఏకంగా రూ.65వేలు తగ్గింపు!
Advertisement

iPhone Air Deal: ప్రజల్లో ఐఫోన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ డిమాండ్‌కు తగ్గట్టే యాపిల్ సంస్థ తన కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్‌లను ప్రతిఏటా పరిచయం చేస్తూనే వస్తోంది. ఇదిలా ఉంటే.. యాపిల్ నుంచి ఐఫోన్ 17 సిరీస్ ఈ ఏడాది వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ సిరీస్‌లో ప్రవేశపెట్టిన ఐఫోన్ ఎయిర్‌కు సెఫరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇప్పటివరకు సంస్థ తీసుకొచ్చిన ఐఫోన్‌లలో ఇది అత్యంత సన్నగా కనిపించే ఫోన్. ఇది వినియోగదారుల్లో అత్యంత ఆదరణ పొందినప్పటికీ.. ఇప్పుడీ ఫోన్‌ను క్రోమా బ్లాక్ ఫ్రైడే సేల్‌లో కేవలం రూ.54,900 ధరకే పొందొచ్చు. మరి ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దామా..

రూ.65,000 తగ్గింపు:

తాజాగా క్రోమా తన బ్లాక్ ఫ్రైడే సేల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సేల్ నవంబరు 22న ప్రారంభం కాగా.. నవంబరు 30న ముగియనుంది. ఈ సేల్‌ ద్వారా అనేక ప్రముఖ కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లు అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తున్నప్పటికీ.. ఐఫోన్ 17 ఎయిర్ స్మార్ట్‌ఫోన్‌పై ఇచ్చిన ప్రత్యేక డిస్కౌంట్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఐఫోన్ ఎయిర్ మార్కెట్‌కు వచ్చినప్పటి ప్రారంభ ధర రూ.1,19,900. అయితే, ఇప్పుడీ ఫోన్ క్రోమా బ్లాక్ ఫ్రైడే సేల్లో రూ.54,900 ధరకే లభిస్తోంది. బ్యాంక్ డిస్కౌంట్‌లతో సహా ఈ ఆఫర్‌లను పొందినట్లయితే, ఇంత తక్కువ ధరకే ఐఫోన్ ఎయిర్‌ను కొనవచ్చు.

Advertisement

Read Also: ఇలాంటి ఛాన్స్ మళ్లీ రాదేమో.. అమెజాన్‌లో ఒప్పో రెనో 5Gఫోన్‌పై రూ.15వేలు తగ్గింపు!

ఐఫోన్ 17 ఎయిర్ ఫీచర్లు:

ఐఫోన్ ఎయిర్ స్మార్ట్‌ఫోన్‌లో ఐఫోన్ 17 ప్రో స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగానే A19 ప్రో చిప్‌సెట్ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ చాలా సన్నగా ఉందని చెప్పడానికి కారణం.. ఇది 5.6 మిమీ మందం, 156 గ్రాముల బరువు ఉండటమే. ఐఫోన్ ఎయిర్ 6.5-అంగుళాల OLED డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఇది ఐఫోన్ 17 ప్రో మోడల్ స్మార్ట్‌ఫోన్‌లలో ఇవ్వబడిన ఫీచర్ కూడా. ఐఫోన్ 17 ప్రో మోడల్ స్మార్ట్‌ఫోన్‌లతో సమానంగా వివిధ అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ క్రోమా సేల్‌లో ఇంత తక్కువ లభించడం నిజంగా గమనార్హమనే చెప్పాలి.

Advertisement

Read Also: ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఒకే ఫోన్లో ఒకటి కంటే ఎక్కువ వాట్సప్ అకౌంట్లు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×