E-Paper
Advertisement

లీకైన యాపిల్ సీక్రెట్ ప్లాన్.. తక్కువ ధరలో స్మార్ట్‌వాచ్‌లను మించిన ఫీచర్లతో iRing‌ను దించనుంది!

లీకైన యాపిల్ సీక్రెట్ ప్లాన్.. తక్కువ ధరలో స్మార్ట్‌వాచ్‌లను మించిన ఫీచర్లతో iRing‌ను దించనుంది!
Advertisement

Apple iRing: టెక్నాలజీ ప్రపంచంలో సరికొత్త ఆవిష్కరణలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే యాపిల్ సంస్థ.. ఇప్పుడు స్మార్ట్ రింగ్ విభాగంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. మార్కెట్లో ఇప్పటికే మంచి ఆదరణ పొందుతున్న శాంసంగ్ గెలాక్సీ రింగ్, అవూరా రింగ్ వంటి మోడళ్లకు పోటీగా యాపిల్ తమ సొంత స్మార్ట్ రింగ్‌ను తీసుకురాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లీకైన సమాచారం ప్రకారం.. ఈ గ్యాడ్జెట్‌కు iRing అనే పేరు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

యాపిల్ మార్కెట్ వ్యూహం:

ఏదైనా కొత్త టెక్నాలజీని మార్కెట్లోకి తీసుకురావడంలో యాపిల్ ఎప్పుడూ కాస్త నిదానంగానే వ్యవహరిస్తుంది. మిగిలిన బ్రాండ్లు ముందే రంగంలోకి దిగినా, యాపిల్ మాత్రం మార్కెట్ ట్రెండ్స్, కస్టమర్ల అవసరాలను నిశితంగా గమనించి, పూర్తి నాణ్యతతో కూడిన ప్రొడక్ట్‌ను ఆలస్యంగానైనా అద్భుతంగా లాంచ్ చేస్తుంది. ఇప్పుడు ఎంతో కాలంగా ఊరిస్తున్న ఫోల్డబుల్ ఐఫోన్ విషయంలోనూ కంపెనీ ఇదే వ్యూహాన్ని అనుసరిస్తోంది. స్మార్ట్ రింగ్ విషయంలోనూ ఇదే జరగబోతోంది.

Advertisement

Also Read: కలా? నిజమా? రూ.1699కే టైప్-సి ఛార్జింగ్, 55 రోజుల బ్యాటరీ లైఫ్‌తో క్రేజీ ఫోన్ లాంచ్!

లీకైన వివరాలు ఇవే:

ప్రముఖ టిప్‌స్టర్ కోసుటామి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా షేర్ చేసిన సమాచారం ప్రకారం.. యాపిల్ సంస్థ ‘ఐరింగ్’ అభివృద్ధిపై దృష్టి పెట్టింది. అయితే ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. దీని ఫీచర్లు, లాంచ్ టైమ్‌లైన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా బయటకు రాలేదు. యాపిల్ గతంలో దాఖలు చేసిన కొన్ని పేటెంట్ దరఖాస్తుల ప్రకారం.. ఈ రింగ్‌లో హెల్త్, ఫిట్‌నెస్ ట్రాకింగ్ సెన్సార్లు ఉండే అవకాశం ఉంది. అలాగే ఇది యాపిల్ విజన్ ప్రో హెడ్‌సెట్‌తో కనెక్ట్ అయ్యి, హ్యాండ్ డిటెక్షన్ ఫీచర్‌కు సాయపడుతుందని అంచనా. యాపిల్ వాచ్ కొనలేని వారికి ఇది బెస్ట్, తక్కువ ధర ప్రత్యామ్నాయంగా నిలవనుంది.

Advertisement

పోటీ పెంచనున్న శాంసంగ్:

శాంసంగ్ కంపెనీ ఇప్పటికే 2024లో తమ ‘గెలాక్సీ రింగ్’ను మార్కెట్లోకి తెచ్చింది. రూ.38,999 ధరతో, వివిధ సైజుల్లో లభించే ఈ రింగ్ స్లీప్ స్కోర్, గురక విశ్లేషణ వంటి అద్భుతమైన హెల్త్ ఫీచర్లను అందిస్తోంది. అంతేకాదు.. 2027 ప్రారంభంలో మెరుగైన బ్యాటరీ లైఫ్ (10 రోజుల వరకు వచ్చేలా), పవర్‌ఫుల్ సెన్సార్లతో ‘గెలాక్సీ రింగ్ 2’ను కూడా శాంం‌సంగ్ తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో యాపిల్ ఐరింగ్, శాంం‌సంగ్ మధ్య గట్టి పోటీ ఉండబోతోందని స్పష్టమవుతోంది.

Also Read: శాంసంగ్ ప్రియులకు బిగ్ సర్‌ప్రైజ్.. Samsung Galaxy S24 ధర ఊహించని విధంగా తగ్గింది!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×