E-Paper
Advertisement

ప‌వ‌న్ తిక్క చేష్ట‌లు.. ఇడుపు కాయితం వెక్కిరింపులు! ఇవే తెలంగాణ‌ను త‌ట్టిలేపేవి..!

ప‌వ‌న్ తిక్క చేష్ట‌లు.. ఇడుపు కాయితం వెక్కిరింపులు! ఇవే తెలంగాణ‌ను త‌ట్టిలేపేవి..!
Advertisement

తెలంగాణ యాస‌, భాషా.. సంస్కృతి, సంప్ర‌దాయాల మీద దాడి ఎవ‌రు చేసినా.. అది ఏ రీతిన జ‌రిగినా.. తెలంగాణ ప్రాంతాన్ని త‌ట్టి లేపుతాయి. ఇక్క‌డి చైత‌న్యం అలాంటిది. ఈ మ‌ట్టిలోని అణిచివేత నుంచి పెల్లుబుకిన రోషం అలాంటిది. తెలంగాణ రాష్ట్రం వ‌చ్చింది. ఎవ‌రికి వారు అంతా బాగానే ఉన్నారు. ఇక్క‌డ ఒక‌ర్నొక‌రు అవ‌మానించుకున్న‌ది లేదు. అవ‌హేళ‌న చేసుకున్న‌ది లేదు.

ఎవ‌రి భాష వారికి అందం. తెలంగాణ యాస, భాష‌ను వెక్కిరించే దోర‌ణి మొద‌ట్లో ఉండేది. ఎంత‌లా అంటే.. తెలుగు సినిమాల్లో విల‌న్ల‌తో ప‌లికించే భాష ఇదే. న‌వ్వులు పూయించి.. నిర్మాత‌ల‌కు కాసులు కురిపించే భాష కూడా ఇదే. కానీ ఇప్పుడు ప‌రిస్థితి ఎంత‌లా మారిందంటే.. హీరోల నోట తెలంగాణ భాష, యాస‌ను ప‌లికిస్తే అది హిట్ అవుతుంద‌నేంత‌లా.

Advertisement

దానికి కార‌ణం తెలంగాణ ఆత్మ‌గౌర‌వ పోరాట‌మే. అస్తిత్వం కోసం జ‌రిగిన ఉద్య‌మాలే. ఇంత జ‌రిగినా.. చరిత్ర తెలియ‌ని కొంద‌రు చేసే చేష్ట‌ల వ‌ల్ల తెలంగాణ‌లో క‌ద‌లిక వ‌స్తోంది. తెలంగాణ సెంటిమెంట్ లేదు అనుకున్న వారికి అది కేవ‌లం సెంటిమెంట్ కాదు… ఇక్క‌డి ఆత్మ‌గౌర‌వానికి ప్ర‌తీక‌.. అది ఎప్ప‌టికీ చైత‌న్యంగానే ఉంటుంది. అవ‌స‌ర‌మొచ్చిన‌ప్పుడు ఇలా ఒక్క‌తాటిపైకి వ‌స్తుంది. గొంతుల‌న్నీ ఏక‌మై అవ‌హేళ‌న చేసిన మూక‌ల‌పై మూకుమ్మ‌డి దాడికి దిగుతాయి. ఇప్పుడు మ‌నం చెప్పుకుంటున్న స‌బ్జెక్టు అర్థ‌మైంద‌నుకుంటా!

మొన్న‌టికి మొన్న ప‌వ‌న్ వ‌చ్చాడు. తిక్క చేష్ట‌ల‌తో ఇక్క‌డి జ‌నాన్ని జాగృతం చేశాడు. తాజాగా ఇడుపు కాయితం అనే సినిమా పేరును ఎవ‌డో గేలి చేసి.. అవ‌హేళ‌న చేసిన‌ట్టుగా మాట్లాడాడు. దీనిపై తిక్క‌రేగిన తెలంగాణ నెటిజ‌నం తుక్కు తుక్కుగా మాట‌ల దాడికి దిగారు. నిజానికి, ఇది ఎవ‌డో తెలంగాణ చరిత్ర తెలియ‌ని బ‌చ్చా గాడై ఉంటాడు. కానీ ఎవ‌డు అన్న‌ది కాదిక్క‌డ‌.. భాష‌ను అవ‌మాన‌ప‌రిస్తే…ఇలాగే బ‌దులివ్వాల‌నే విధంగా అంతా త‌మ అభిప్రాయాల‌ను షేర్ చేసుకున్నారు. ప‌నిలో ప‌ని కొంద‌రు.. ఆంధ్ర భాష మీదా దాడి చేసిన‌ట్టుగా కామెంట్లు పెట్టారు.

Advertisement

ఇడుపు కాయితం అంటే.. భార్య‌భ‌ర్త‌లు విడిపోయేట‌ప్పుడు రాసుకునే ఒప్పంద ప‌త్ర‌మ‌న్న మాట‌. అంటే విడాకులు అన్న‌ట్టు. ఈ విడాకులు అనే మాట‌ను అవ‌హేళ‌న చేస్తూ తెలంగాణ‌వాళ్లు కామెంట్లు చేశారు. దాదాపుగా తెలంగాణ భాష.. ఆంధ్ర ప్రాంతం వాళ్ల‌కంద‌రికీ అర్ధమ‌వుతుంది. సినిమాను కూడా ఎంజాయ్ చేస్తారు. కానీ కొన్ని ప‌దాలే అర్థం కావు. అవి ప్ర‌త్యేకంగా విడిగా చెప్పుకున్న‌ప్పుడు దాని భావం తెలియ‌దు.

అది తెలంగాణ వాడుకు భాష కాబ‌ట్టి.. ఆంధ్రలో ఆ వాడుక ప‌దాలు అస్స‌లే వాడ‌రు. అందుకే అర్థం కావు. కొంద‌రు అర్థం చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తారు. కొంత మంది పైత్యంగాళ్లు ఇలా బాహాటంగా ఇదేం భాష‌రా నాయ‌నా.. విచిత్రంగా ఉందని వింత‌గా ముఖం పెడ‌తారు. ఇవి చిన్న విష‌యాలే అనిపిస్తాయి. కానీ తెలంగాణ భాష‌ను కించ‌ప‌రిచిన‌ట్టే భావించాల్సి వ‌స్తుంది. అందుకే అంత‌లా రోషం ఉబికి వ‌స్తుంది.

మాట‌కు మాట, భాష‌కు భాష‌గా దాడి కంటిన్యూ అవుతుంది. అంతిమంగా ఇది తెలంగాణ ప్ర‌జ‌ల‌ను జాగృత‌మే చేస్తుంది. వారిలోని చైత‌న్యాన్ని ఇలా త‌ట్టి లేపి స‌మాజానికి చూపుతుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ విష‌యంలో కూడా అత‌డి ప్ర‌వ‌ర్త‌న‌, తీరు, మాట్లాడిన మాట‌లు.. తెలంగాణ‌పై దండ‌యాత్ర‌గానే చూస్తున్నారు జ‌నం.

బ‌ల‌వంతంగా రావాల్సిన అవ‌స‌రం లేదు. క‌య్యానికి కాలు దువ్వుతున్న‌ట్టు చ‌ర్య‌ల వ‌ల్ల లాభం అస‌లే ఉండ‌దు. నాకు ప్ర‌జ‌ల‌కు పేచీ కాదు… రాజ‌కీయ నాయ‌కుల‌తో అన్నాడు ప‌వ‌న్‌. రాజ‌కీయ నాయ‌కులు ప్ర‌జ‌ల‌కు ప్ర‌తినిధులే క‌దా! అంటే ప్ర‌జ‌ల‌తో పేచీ పెట్టుకుంటే ఇక్క‌డ పార్టీకి గోచీ కూడా మిగ‌ల‌దు. ఇదే ఇక్క‌డి చ‌రిత్ర చెప్పే స‌త్యం.

ఇలా ప‌వ‌న్‌లాంటి తిక్క చేష్ట‌ల‌తో, ఇడుపు కాయితం పేరు అర్థంకాని తిక్క వెధ‌వ‌ల‌తో తెలంగాణ‌కు మేలే జ‌రుగుతుంది. వారిలో చైత‌న్యాన్ని త‌ట్టి లేపుతూ ఉంటుంది. ఆ స‌మాజాన్ని అల‌ర్టుగా ఉండేలా సిగ్న‌ల్ ఇస్తూ ఉంటుంది. ఉద్య‌మ స్పూర్తిని అణ‌గార‌కుండా నిప్పురాజేస్తూ ఉంటుంది.

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×