E-Paper
Advertisement

ఐఫోన్ ఫోల్డ్ వచ్చేస్తోంది.. హింజ్ విషయంలో యాపిల్ మాస్టర్ ప్లాన్ అదిరిందిగా!

ఐఫోన్ ఫోల్డ్ వచ్చేస్తోంది.. హింజ్ విషయంలో యాపిల్ మాస్టర్ ప్లాన్ అదిరిందిగా!
Advertisement

iPhone Fold: చాలా కాలంగా ఐఫోన్ లవర్స్ ఎదురుచూస్తున్న ఫోల్డబుల్ ఐఫోన్ (iPhone Fold) త్వరలోనే అందుబాటులోకి రానుంది. దీనికి iPhone Ultra అనే పేరు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నిజానికి ఈ ఏడాది వచ్చే iPhone 18 Pro మోడల్స్‌తో పాటే ఇది కూడా మార్కెట్లోకి వచ్చేస్తుందని టెక్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే కంపెనీ దీనిపై ఇంకా నోరు విప్పకపోయినా.. చైనా నుంచి అందుతున్న లీకులు చూస్తుంటే ఈసారి యాపిల్ గట్టిగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

ఇక ఆ మడత కనిపించదు..

ఫోల్డబుల్ ఫోన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది.. ఆ స్క్రీన్ మధ్యలో కనిపించే గీత (మడత). అయితే యాపిల్ దీన్ని వదిలించుకోవడానికి ఓ సూపర్ ఐడియా వేసింది. హింజ్ (మడత పెట్టే భాగం) తయారీలో 3D ప్రింటింగ్ టెక్నాలజీని వాడుతున్నారట. దీనివల్ల ఫోన్ మడత పెట్టినప్పుడు ఆ గీత కనిపించకుండా చాలా నీట్‌గా ఉంటుందని సమాచారం. ఇప్పటికే యాపిల్ తమ వాచ్‌లు, టైప్-సి పోర్టుల తయారీలో ఈ టెక్నాలజీని వాడుతోంది కాబట్టి.. ఫోల్డబుల్ ఫోన్ విషయంలో కూడా ఇది బాగా వర్కౌట్ అవుతుందని నమ్ముతున్నారు.

Advertisement

Also Read: హానర్ నుంచి మరో క్రేజీ ఫోన్.. సింగిల్ ఛార్జ్‌తో 65 గంటల బ్యాటరీ లైఫ్.. రేటు కూడా తక్కువే!

స్క్రీన్ పాడవకుండా కొత్త టెక్నిక్..

డిస్‌ప్లే ఎక్కువ కాలం మన్నేలా యాపిల్ ఒక కొత్త డిజైన్ పట్టుకొచ్చింది. రెండు పల్చని గ్లాస్ షీట్ల మధ్య స్క్రీన్‌ను పెడుతున్నారట. దీనివల్ల లాభం ఏంటంటే.. మనం ఫోన్‌ను మడతపెట్టినప్పుడు స్క్రీన్ నేరుగా లోపల ఉన్న హింజ్‌కు తగలదు. దీనివల్ల డిస్‌ప్లే మీద ప్రెజర్ పడకుండా ఉంటుంది. ఒప్పో లాంటి కంపెనీలు ఇలాంటివి ట్రై చేసినా.. యాపిల్ మాత్రం అందరి కంటే పర్ఫెక్ట్‌గా తీసుకురావాలని చూస్తోంది.

అప్పుడే లక్షల్లో ఆర్డర్లు..

Advertisement

ఐఫోన్ ఫోల్డ్ క్రేజ్ ఎలా ఉంటుందో ముందే ఊహించిన యాపిల్.. ఏకంగా 2 కోట్ల ఫోల్డబుల్ ప్యానెల్స్ కావాలని శాంసంగ్‌కు ఆర్డర్ ఇచ్చిందట. దీన్ని బట్టి చూస్తే కంపెనీ ఎంత కాన్ఫిడెంట్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతానికి లీకైన సమాచారం ప్రకారం ఈ ఏడాది చివరి నాటికి ఈ ఫోన్ మన చేతుల్లోకి వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఐఫోన్ లవర్స్ కల త్వరలోనే నిజం కాబోతోంది.

Also Read: ఎండలు 50 డిగ్రీలు దాటినా డోంట్ కేర్.. ఈ Desert Rose AC ఉంటే ఇల్లు స్విట్జర్లాండే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×