E-Paper
Advertisement

ఆండ్రాయిడ్ ఫోన్లను.. ఘోరంగా అవమానించిన యాపిల్.. నెట్టింట రచ్చ రచ్చ!

ఆండ్రాయిడ్ ఫోన్లను.. ఘోరంగా అవమానించిన యాపిల్.. నెట్టింట రచ్చ రచ్చ!
Advertisement

Apple Advertisement: యాపిల్ సంస్థ తన ఐఫోన్ ప్రమోషన్ కోసం విడుదల చేసిన కొత్త ప్రకటన ఇప్పుడు టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. ఆండ్రాయిడ్ ఫోన్లను చాలా పాతకాలం నాటివిగా, పనికిరానివిగా చూపించేందుకు యాపిల్ ఈ యాడ్‌లో గట్టిగానే ప్రయత్నించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సాధారణంగా ఏ కంపెనీ అయిన తమ ఫోన్ల గొప్పతనాన్ని చెప్పుకుంటాయి. కానీ యాపిల్ మాత్రం ఈసారి కాస్త భిన్నంగా ఆండ్రాయిడ్‌ను టార్గెట్ చేస్తూ వ్యంగ్యంగా ఈ ప్రకటనను రూపొందించండం నెట్టింట తీవ్ర దుమారానికి కారణమైంది.

యాడ్‌లో ఏముందంటే?

యాపిల్ తన యాడ్‌లో చూపించిన విజువల్స్ నెట్టింట చర్చకు తావిస్తున్నాయి. యాడ్ ను పరిశీలిస్తే.. ఐఫోన్లు వ్యక్తిగత గోప్యతకు పెద్ద పీట వేస్తాయని.. ఇతర ఫోన్లలో అలాంటిదేమి ఉండదని చెప్పే ప్రయత్నం జరిగింది. యాడ్ లో కొందరు సాధారణ ఫోన్లను వినియోగిస్తుండగా.. వారిని నిరంతరం ఎవరో ఒకరు వాచ్ చేస్తూనే ఉన్నట్లుగా చూపించారు. వారు ఎక్కడెళ్లినా వారిపై నిఘా కొనసాగుతున్నట్లు చూపించే ప్రయత్నం చేశారు.

ప్రైవసీ, సెక్యూరిటీయే టార్గెట్

Advertisement

ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉండే ప్రైవసీ (వ్యక్తిగత సమాచార భద్రత) లోపాలను ఈ ప్రకటనలో యాపిల్ హైలెట్ చేసింది. ఐఫోన్లలో ఉండే సెక్యూరిటీ ఫీచర్లు ఎంత పటిష్టంగా ఉంటాయో చెప్తూనే.. ఆండ్రాయిడ్ యూజర్లు తమ డేటా విషయంలో ఎంత రిస్క్ తీసుకుంటున్నారో వ్యంగ్యంగా చూపించే ప్రయత్నం చేసింది. ‘మీ పాత ఫోన్లను వదిలించుకుని, ఐఫోన్‌కు మారండి’ అనే సందేశాన్ని యూజర్ల మైండ్‌లోకి బలంగా పంపించడమే ఈ ప్రకటన వెనుక యాపిల్ వ్యూహంగా తెలుస్తోంది.

Also Read: బజాజ్ ‘యాపిల్ డేస్’ ధమాకా.. రూ.9 వేల క్యాష్‌బ్యాక్, రూ.10 వేల ఎక్స్ఛేంజ్ బోనస్.. చౌకగా ఐఫోన్లు, ఐప్యాడ్స్!

సోషల్ మీడియాలో ట్రోలింగ్

Advertisement

ఈ యాడ్ చూసిన ఐఫోన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతుంటే ఆండ్రాయిడ్ ప్రియులు మాత్రం యాపిల్‌పై మండిపడుతున్నారు. ‘ఫీచర్ల పరంగా ఆండ్రాయిడ్ ఎప్పుడూ యాపిల్ కంటే ముందే ఉంటుంది. కేవలం ప్రకటనలతో మభ్యపెట్టలేరు’ అంటూ పలువురు కౌంటర్లు ఇస్తున్నారు. వేలకు వేలు ఖర్చు పెట్టి యాపిల్ కొనే బదులు.. తక్కువ బడ్జెట్ లో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో వస్తోన్న ఆండ్రాయిడ్ ఫోన్లే తమ బెస్ట్ అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఐ ఫోన్ సేల్స్ పెంచుకోవడానికి.. ఆండ్రాయిడ్ ఫోన్ల ఇమేజ్ ను తక్కువ చేసి చూపించడం సరికాదని యాపిల్ కు సూచిస్తున్నారు. మెుత్తం మీద యాపిల్ విడుదల చేసిన లేటెస్ట్ యాడ్.. నెట్టింట పెద్ద రచ్చకు దారి తీసిందని చెప్పవచ్చు.

Also Read: ఫ్రిడ్జ్‌లో రూ.1 నాణెం.. తర్వాత జరిగే బెనిఫిట్స్ చూస్తే.. దిమ్మతిరిగి బొమ్మ కనపడాల్సిందే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×