E-Paper
Advertisement

ఇండియన్ మార్కెట్‌పై హోండా ఫోకస్.. 2030 నాటికి 10 కొత్త మోడళ్లు ఎంట్రీ!

ఇండియన్ మార్కెట్‌పై హోండా ఫోకస్.. 2030 నాటికి 10 కొత్త మోడళ్లు ఎంట్రీ!
Advertisement

Honda Big India Plan: దేశంలో తన మార్కెట్ వాటాను పెంచుకునేందుకు హోండా కొత్త ప్రణాళికలతో ముందుకెళ్తోంది. రాబోయే రెండేళ్లలో రెండు కొత్త SUVలను భారత మార్కెట్లోకి తీసుకురానున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇందులో ZR-V హైబ్రిడ్ SUVతో పాటు 0 ఆల్ఫా ఎలక్ట్రిక్ SUV కూడా ఉన్నాయి. 2030 నాటికి దేశంలో 10 కొత్త మోడళ్లను ప్రవేశపెట్టాలని భావిస్తోంది.

తొలుత హోండా ZR-V హైబ్రిడ్ SUV విడుదల

మొదటగా హోండా ZR-V హైబ్రిడ్ SUV భారత మార్కెట్లో అడుగుపెట్టనుంది. ఈ మోడల్ 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది. కంపెనీ దీనిని పూర్తిగా తయారైన యూనిట్ (CBU) రూపంలో దిగుమతి చేయనుంది. పరిమిత సంఖ్యలో మాత్రమే ఈ SUV భారతదేశానికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.  ధర పరంగా చూస్తే, ZR-V హైబ్రిడ్ రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా.

Advertisement

పవర్‌ ట్రెయిన్ విషయానికి వస్తే, ZR-Vలో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు డ్యూయల్ మోటార్ స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్ అందించనున్నారు. ఈ సెటప్ 184 bhp పవర్, 315 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ SUV సుమారు 8 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అలాగే లీటర్‌కు 22.79 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది.

ఫీచర్ల పరంగా కూడా ZR-V ఆకట్టుకునే అవకాశం ఉంది. ఇందులో 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ ప్లే, 9 అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్, వైర్‌ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ ప్లే, పవర్డ్ ఫ్రంట్ సీట్లు, 12 స్పీకర్ల బోస్ సౌండ్ సిస్టమ్ లాంటి ఫీచర్లు ఉండనున్నాయి. భద్రత విషయంలో కూడా హోండా రాజీపడటం లేదు. ఈ SUVలో ఎనిమిది ఎయిర్‌ బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, లెవెల్-2 ADAS టెక్నాలజీ లాంటి అత్యాధునిక భద్రతా ఫీచర్లు ఉండనున్నాయి. ఈ SUV మార్కెట్లోకి వచ్చిన తర్వాత స్కోడా కోడియాక్, జీప్ మెరిడియన్, వోక్స్‌ వ్యాగన్ టిగువాన్ ఆర్ లైన్ లాంటి ప్రీమియం SUVలకు గట్టి పోటీ ఇవ్వనుంది.

ఆ తర్వాత హోండా 0 ఆల్ఫా ఎలక్ట్రిక్ SUV లాంచ్!

Advertisement

ఇక 2027లో హోండా 0 ఆల్ఫా ఎలక్ట్రిక్ SUVని కూడా భారత మార్కెట్లోకి తీసుకురానుంది. దేశంలో వేగంగా పెరుగుతున్న EV మార్కెట్‌ ను దృష్టిలో ఉంచుకుని ఈ మోడల్‌ ను తయారు చేస్తోంది.  ప్రాజెక్టు కోసం సుమారు రూ.1,200 కోట్ల పెట్టుబడి పెట్టాలని కంపెనీ భావిస్తోంది. హైబ్రిడ్, ఎలక్ట్రిక్ టెక్నాలజీలపై దృష్టి పెట్టిన హోండా, భారత మార్కెట్లో మరింతగా సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ZR-V హైబ్రిడ్, 0 ఆల్ఫా EV మోడళ్లు కంపెనీ భవిష్యత్ వ్యూహంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

Read Also: భారత్‌ లో MG మాస్టర్ ప్లాన్.. హైబ్రిడ్‌ తో పాటు 3 ఎలక్ట్రిక్ కార్లు విడుదల!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×