E-Paper
Advertisement

Apple Watch band: యాపిల్ నుంచి మరో బిగ్ సర్‌ప్రైజ్.. స్పెషల్ ఎడిషన్ బ్లాక్ యూనిటీ బ్యాండ్ వచ్చేసింది!

Apple Watch band: యాపిల్ నుంచి మరో బిగ్ సర్‌ప్రైజ్.. స్పెషల్ ఎడిషన్ బ్లాక్ యూనిటీ బ్యాండ్ వచ్చేసింది!
Advertisement

Apple Watch band: అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ ప్రతి ఏటా నిర్వహించే Black History Month వేడుకల్లో భాగంగా ఈసారి ఓ ప్రత్యేకమైన వాచ్ బ్యాండ్‌ను పరిచయం చేసింది. దీనికి Unity Connection Braided Solo Loop అని పేరు పెట్టారు. లోకంలో మనిషికి మనిషే తోడు, ఒకరి బలం మరొకరు అని చాటిచెప్పేలా ఈ బ్యాండ్‌ను చాలా అర్థవంతంగా రూపొందించారు. సామాజిక బాధ్యతను, కొత్త రకమైన డిజైన్‌ను కలిపి తయారు చేసిన ఈ బ్యాండ్ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది.

దీని ప్రత్యేకత ఏమిటంటే?

ఈ బ్యాండ్‌ను యాపిల్ సంస్థలోని బ్లాక్ క్రియేటివ్స్ ఎంతో ఇష్టపడి తీర్చిదిద్దారు. దీనిలో ఆఫ్రికన్ జెండా రంగులైన ఎరుపు, ఆకుపచ్చ, నలుపు రంగులను వాడారు. పాత పాలిస్టర్ దారాలను రీసైకిల్ చేసి, వాటిని సిలికాన్ ముక్కలతో కలిపి చాలా జాగ్రత్తగా అల్లారు. ఇది చూడటానికి స్టైలిష్‌గా ఉండటమే కాకుండా, చేతికి పెట్టుకున్నప్పుడు చాలా మెత్తగా, సౌకర్యంగా ఉంటుంది. ముఖ్యంగా చెమట పట్టినా, నీళ్లు పడినా పాడవకుండా దీనిని తయారు చేయడం విశేషం.

Advertisement

Also Read: వివో నుంచి మరో సంచలనం.. 6,200mAh బ్యాటరీ, 50MP ట్రిపుల్ కెమెరాతో కొత్త ఫోన్ లాంచ్!

సామాజిక బాధ్యతలో భాగం..

యాపిల్ కేవలం ఈ వాచ్ బ్యాండ్‌ను అమ్మడమే కాకుండా.. ఆ వచ్చే ఆదాయంతో ఒక మంచి పనికి శ్రీకారం చుట్టింది. ప్రపంచవ్యాప్తంగా వెనుకబడిన వర్గాల్లో ఉన్న టాలెంట్‌ను బయటకు తీసేందుకు భారీగా నిధులు కేటాయించింది. లండన్, న్యూయార్క్, మెక్సికో సిటీ వంటి చోట్ల ఉన్న స్వచ్ఛంద సంస్థలకు ఆర్థిక సాయం చేస్తూ.. అక్కడి పిల్లల చదువుకు, వారి ఎదుగుదలకు తోడ్పడుతోంది.

ధర ఎంత ఉండొచ్చు?

Advertisement

మన దేశంలో ఈ యూనిటీ కనెక్షన్ బ్యాండ్ ధరను రూ.9,500 గా నిర్ణయించారు. ఇది 42mm, 46mm సైజుల్లో లభిస్తుంది. మీ దగ్గర యాపిల్ వాచ్ సిరీస్ 4 నుండి లేటెస్ట్ మోడల్స్ లేదా యాపిల్ వాచ్ అల్ట్రా ఉన్నా సరే.. ఈ బ్యాండ్ వాటన్నింటికీ చక్కగా సెట్ అవుతుంది. మీకు కావాలంటే యాపిల్ వెబ్‌సైట్ లేదా వారి యాప్ ద్వారా నేరుగా కొనుగోలు చేయవచ్చు.

Also Read: లక్ష రూపాయల ఒప్పో ఫోన్‌పై కనీవినీ ఎరుగని ఆఫర్.. సగం ధరకే మీ సొంతం చేసుకునే ఛాన్స్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×