E-Paper
Advertisement

MacBook Pro M5 Pro: 16 ఇంచ్ డిస్‌ప్లే M5 ప్రో చిప్‌తో ప్రీమియం ల్యాప్‌టాప్.. కొత్త మ్యాక్‌బుక్ ప్రో విడుదల.. 24 గంటల బ్యాటరీ

MacBook Pro M5 Pro: 16 ఇంచ్ డిస్‌ప్లే M5 ప్రో చిప్‌తో ప్రీమియం ల్యాప్‌టాప్.. కొత్త మ్యాక్‌బుక్ ప్రో విడుదల.. 24 గంటల బ్యాటరీ
Advertisement

MacBook Pro M5 Pro Max | టెక్ దిగ్గజం ఆపిల్ తన ప్రీమియం ల్యాప్‌టాప్ రేంజ్‌ని విస్తరించింది. కంపెనీ ఇప్పుడు కొత్త మ్యాక్‌బుక్ ప్రో ఇండియాలో లాంచ్ చేసింది. రెండు సైజుల్లో వస్తుంది – 14 ఇంచ్ మరియు 16 ఇంచ్. లేటెస్ట్ M5 ప్రో, M5 మ్యాక్స్ ప్రాసెసర్ చిప్‌లతో ఉంది. ప్రొఫెషనల్స్, క్రియేటర్లు, హై-పవర్ యూజర్ల కోసం రూపొందించారు. అడ్వాన్స్‌డ్ హార్డ్‌వేర్, ప్రీమియం డిజైన్‌తో వస్తుంది.

భారత్‌లో ధరల వివరాలు

14 ఇంచ్ M5 ప్రో మోడల్ 24GB RAM + 1TB స్టోరేజ్ వేరియంట్ ప్రారంభ ధర రూ.2,49,900.
14 ఇంచ్ M5 మ్యాక్స్ చిప్ మోడల్ ధర రూ.3,99,900.
48GB ర్యామ్ అప్‌గ్రేడ్‌కు రూ.40,000, 2TB స్టోరేజ్‌కు రూ.40,000 అదనంగా చెల్లించాలి.

Advertisement

16 ఇంచ్ M5 ప్రో మోడల్ 24GB RAM + 1TB స్టోరేజ్ వేరియంట్ ప్రారంభ ధర రూ.2,99,900.
16 ఇంచ్ M5 మ్యాక్స్ మోడల్ రూ.4,29,900.
64GB ర్యామ్ అప్‌గ్రేడ్‌కు రూ.60,000. 4TB స్టోరేజ్‌కు రూ.1,00,000 అదనంగా చెల్లించాలి.
మార్చి 4 నుంచి ఆపిల్ ఆన్‌లైన్ స్టోర్‌లో ప్రీ-ఆర్డర్లు మొదలయ్యాయి. సిల్వర్, స్పేస్ బ్లాక్ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉన్నాయి.

డిస్‌ప్లే, విజువల్ ఎక్స్‌పీరియన్స్

16.2 ఇంచ్ వరకు లిక్విడ్ రెటినా XDR డిస్‌ప్లే ఉంది. రిజల్యూషన్ 3456*2234 పిక్సెల్స్. ప్రోమోషన్ (ProMotion) టెక్నాలజీతో 120Hz రిఫ్రెష్ రేట్. గరిష్ట బ్రైట్‌నెస్ 1,600 నిట్స్. ఒక బిలియన్ కలర్ సపోర్ట్ చేస్తుంది. కలర్స్ కచ్చితంగా, షార్ప్‌గా కనిపిస్తాయి. వీడియో ఎడిటింగ్, ప్రొఫెషనల్ క్రియేటివ్ వర్క్‌కు చాలా బాగుంటుంది.

పర్‌ఫామెన్స్, మెమరీ

Advertisement

ఈ ల్యాప్‌టాప్.. M5 ప్రో, M5 మ్యాక్స్ చిప్‌లతో హై-లెవల్ ప్రాసెసింగ్ పవర్ ఇస్తుంది. 128GB వరకు RAM, 8TB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. హెవీ మల్టీటాస్కింగ్, పెద్ద మీడియా ప్రాజెక్ట్‌లకు ఉపయోగపడుతుంది.

కెమెరా, కనెక్టివిటీ

12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. డెస్క్ వ్యూ ఫీచర్‌తో వీడియో కాల్స్‌లో మంచి క్లారిటీ ఇస్తుంది. Wi-Fi, బ్లూటూత్ సపోర్ట్ ఉన్నాయి. SDXC కార్డ్ స్లాట్, HDMI పోర్ట్, రెండు థండర్‌బోల్ట్ పోర్టులు, 3.5mm ఆడియో జాక్ ఉన్నాయి. ప్రొఫెషనల్స్‌కు సులభమైన కనెక్టివిటీ ఇస్తాయి.

బ్యాటరీ, చార్జింగ్

100Wh బ్యాటరీ ఉంది. 140W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి చార్జింగ్‌తో 24 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్, 17 గంటల వరకు వెబ్ బ్రౌజింగ్ చేయవచ్చు. ఎక్కువ సేపు పని చేసేవారికి బాగుంటుంది.

మ్యాజిక్ కీబోర్డ్, సెక్యూరిటీ

బ్యాక్‌లిట్ మ్యాజిక్ కీబోర్డ్ ఉంది. టైపింగ్ సౌకర్యంగా, కచ్చితంగా ఉంటుంది. టచ్ ID సెన్సార్‌తో సురక్షితంగా అన్‌లాక్ చేయవచ్చు. యాప్‌లు, పేమెంట్లకు కూడా ఉపయోగపడుతుంది.

కొత్త మ్యాక్‌బుక్ ప్రోలో మెరుగైన పనితీరు, ప్రొఫెషనల్ ఫీచర్లకు ప్రాధాన్యత ఇచ్చారు. డిస్‌ప్లే బ్రైట్‌నెస్, స్మూత్ రిఫ్రెష్ రేట్ గొప్పగా ఉన్నాయి. M5 చిప్‌లు అడ్వాన్స్‌డ్ పవర్ ఇస్తాయి. హై RAM, స్టోరేజ్ ఆప్షన్లు డిమాండింగ్ వర్క్‌లకు సరిపోతాయి. బ్యాటరీ లైఫ్ బలంగా ఉంది. సీరియస్ క్రియేటర్లు, ప్రొఫెషనల్స్ కోసం ఆపిల్ దీన్ని రూపొందించింది. మీ వర్క్‌లోడ్ ప్రకారం సైజ్, కాన్ఫిగరేషన్ ఎంచుకోవచ్చు.

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×