E-Paper
Advertisement

వామ్మో.. ఫొటో చూపించి ఫోన్లను అన్‌లాక్ చేయొచ్చా? ఈ ఆండ్రాయిడ్ ఫోన్లలో భారీ భద్రతా లోపం!

వామ్మో.. ఫొటో చూపించి ఫోన్లను అన్‌లాక్ చేయొచ్చా? ఈ ఆండ్రాయిడ్ ఫోన్లలో భారీ భద్రతా లోపం!
Advertisement

Android Security Tips: ఇప్పుడు మనందరం స్మార్ట్‌ఫోన్ లాక్ తీయడానికి వేలిముద్ర కంటే ఎక్కువగా ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌నే వాడుతున్నాం. ఎందుకంటే.. ఇప్పుడంతా అన్ని ఫోన్లలో ఈ ఫీచర్లే ఉన్నాయి. అలాగే చిటికెలో పని అయిపోతుంది. కానీ ఈ సౌకర్యం వెనుక పెద్ద ప్రమాదమే పొంచి ఉందని బ్రిటన్‌కు చెందిన ‘విచ్’ అనే సంస్థ హెచ్చరిస్తోంది. మనం ఎంతో సేఫ్ అనుకుని వాడుతున్న ఫేస్ లాక్‌ను కేవలం మన ఫొటో చూపించి అన్‌లాక్ చేసేయవచ్చని ఈ రీసెర్చ్‌లో బయటపడింది. అది కూడా ఏదో చిన్న కంపెనీలు కాదు.. శాంసంగ్, మోటోరోలా, వన్‌ప్లస్ లాంటి పెద్ద బ్రాండ్ల ఫోన్లలో కూడా ఈ లోపం ఉందని తేలింది.

ఏటా పెరిగిపోతున్న చిక్కులు..

సాధారణంగా టెక్నాలజీ పెరిగేకొద్దీ భద్రత పెరగాలి. కానీ ఇక్కడ సీన్ రివర్స్‌లో ఉంది. గత నాలుగేళ్లలో సుమారు 200లకు పైగా ఫోన్లను చెక్ చేస్తే.. అందులో 64 శాతం ఫోన్లు ఒక సాదాసీదా ఫొటోను చూడగానే ఇట్టే తెరుచుకున్నాయట. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే.. 2023తో పోలిస్తే 2024, 25లో వచ్చిన కొత్త మోడల్స్ కూడా ఈ టెస్టులో దారుణంగా ఫెయిల్ అయ్యాయి. మనం వాడుతున్న ఫోన్ కేవలం మన మొహాన్ని ఒక ఫొటోలా మాత్రమే చూస్తోంది తప్ప.. అది నిజమైన మనిషా లేక ఫొటోనా అని కనిపెట్టలేకపోతోంది.

Advertisement

Also Read: సెల్ఫీ ప్రియులకు పండగే.. 50MP ఫ్రంట్ కెమెరాతో Motorola Edge 70 Pro లాంచ్ కన్ఫర్మ్!

ఎందుకిలా జరుగుతోంది?

మనం వాడుతున్న చాలా ఆండ్రాయిడ్ ఫోన్లలో 2D ఫేస్ రికగ్నిషన్ వాడుతుంటారు. ఇది కేవలం సెల్ఫీ కెమెరాతో మన ముఖాన్ని ఫొటో తీసి సరిచూసుకుంటుంది. అందుకే మనిషి ముఖానికి, ఫ్లాట్‌గా ఉండే ఫొటోకి మధ్య తేడా దీనికి అర్థం కాదు. అదే యాపిల్ ఐఫోన్లు లేదంటే కొన్ని ఖరీదైన ఫోన్లలో అయితే 3D స్కానింగ్ ఉంటుంది. అవి మన ముఖం మీద వేల సంఖ్యలో చుక్కలను వేసి మ్యాపింగ్ చేస్తాయి కాబట్టి.. ఫొటోలతో వాటిని మోసం చేయడం అసాధ్యం. కానీ తక్కువ బడ్జెట్ ఫోన్లలో ఆ టెక్నాలజీ లేకపోవడమే ఈ తలనొప్పికి కారణమట.

కంపెనీల నిర్లక్ష్యం..

Advertisement

కొన్ని కంపెనీలు మా ఫేస్ అన్‌లాక్ అంత సేఫ్ కాదు అని ఫోన్ సెట్టింగ్స్ లోనే జాగ్రత్తలు చెబుతున్నాయి. శాంసంగ్ తమ లేటెస్ట్ S26 మోడల్‌లో ఈ లోపాన్ని సరిదిద్దింది. గూగుల్ కూడా తమ పిక్సెల్ ఫోన్లలో భద్రతను పెంచింది. కానీ మోటోరోలా, వన్‌ప్లస్, నథింగ్ లాంటి బ్రాండ్లు మాత్రం ఇలాంటి ప్రమాదం ఉందని యూజర్లకు కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదు. ఏవైనా కొత్త బ్రాండ్లు వస్తే మన భద్రత బాగుంటుంది అనుకుంటాం కానీ, నథింగ్ లాంటి కొత్త కంపెనీలు కూడా అదే తప్పును రిపీట్ చేస్తుండటం గమనార్హం.

మన ఫోన్ సేఫ్‌గా ఉండాలంటే?

ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను గుడ్డిగా నమ్మకుండా.. ఫింగర్ ప్రింట్ లేదా పిన్ కోడ్ పెట్టుకోవడం వంద రెట్లు మేలు. వీలైతే మీరు వాడుతున్న సిమ్ కార్డుకు కూడా లాక్ వేయండి. అన్నిటికంటే ముఖ్యంగా మీ బ్యాంకింగ్ యాప్స్, పర్సనల్ ఫొటోలు ఉండే యాప్స్‌కు విడిగా యాప్ లాక్ వేసి పెట్టుకోండి. ఫోన్ లాక్ తీయగానే మొత్తం కనిపించేలా ఉంచుకోకుండా.. ఇలాంటి అదనపు జాగ్రత్తలు తీసుకుంటేనే మన డేటా మన దగ్గర పదిలంగా ఉంటుంది.

Also Read: టీవీ అంటే ఇలా ఉండాల్రా బాబూ.. 115 ఇంచుల భారీ స్క్రీన్‌తో Samsung Micro RGB లాంచ్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×