E-Paper
Advertisement

కస్టమర్లకు షాకిచ్చిన ఎయిర్ టెల్.. ప్రీపెయిడ్ ప్లాన్ రేటు పెంపు

కస్టమర్లకు షాకిచ్చిన ఎయిర్ టెల్.. ప్రీపెయిడ్ ప్లాన్ రేటు పెంపు
Advertisement

Airtel Price Hike: టెలికాం కంపెనీలు వరుసగా కస్టమర్లకు షాక్ ఇస్తున్నాయి. రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను క్రమంగా పెంచుతున్నాయి. తాజాగా భారతీ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌టెల్ 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌లో కీలక మార్పులు చేసింది. అలాగే కొన్ని చౌకైన ప్లాన్‌లను నిలిపివేసి, ఉన్న వాటి ధరలను పెంచింది. తాజా నివేదిక ప్రకారం ఎయిర్‌టెల్ రూ.799 ప్లాన్‌ను నిలిపివేసింది. అంతేకాకుండా రూ.859 ప్లాన్ ధరను రూ.899కి పెంచింది.

రూ.40 పెంపు

గతంలో రూ. 859 గా 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ధరను రూ. 899కి పెంచింది. 40 రూపాయల భారం వినియోగదారులపై పడనుంది. గతంలో రూ. 700 నుంచి రూ. 800 సెగ్మెంట్‌లో ఎయిర్‌టెల్ రూ. 799 , రూ. 859 ప్రీపెయిడ్ ప్లాన్లను ఆఫర్ చేసేది. కానీ తాజాగా, 84 రోజుల పాటు 1.5 GB డేటా కావాలనుకునే వారు కచ్చితంగా రూ. 899 ఖర్చు చేయక తప్పదు.

రూ. 899 ప్లాన్ ప్రయోజనాలు

Advertisement

ట్రూలీ అన్‌లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ లో కస్టమర్లకు లభించే సౌకర్యాలు

  • డేటా – ప్రతిరోజూ 1.5 GB హై స్పీడ్ ఇంటర్నెట్ డేటా, డైలీ లిమిట్ తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 64 Kbps కు తగ్గుతుంది.
  • కాలింగ్– లోకల్, STD , నేషనల్ రోమింగ్ నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాల్స్
  • ఎస్ఎంఎస్- రోజుకు 100 ఫ్రీ ఎస్ఎంఎస్ లు
  • బెనిఫిట్స్ – ఎయిర్‌టెల్ రివార్డ్స్ కింద 12 నెలల అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం, ఎయిర్‌టెల్ స్పామ్ అలర్ట్స్ , ఫ్రీ హలో ట్యూన్స్

అయితే తాజాగా ఈ ధరల పెంపు ఒక ప్లాన్‌కు మాత్రమే పరిమితం అని ఎయిర్ టెల్ తెలిపింది. కంపెనీ ప్రస్తుతం పెద్ద ఎత్తున టారిఫ్‌లను పెంచే ఆలోచనలో లేదని, కానీ క్రమంగా టారిఫ్ లు పెంచే ఆలోచనలో ఉందని సమాచారం. కస్టమర్లను 5G సేవలకు మళ్లించి, ఆదాయాన్ని పెంచుకోవడానికే ఎయిర్‌టెల్ 1.5GB ప్లాన్‌లపై డిస్కౌంట్లను తగ్గిస్తోందని ఎక్స్ ఫర్ట్స్ భావిస్తున్నారు.

గతంలో ఒకసారి

Advertisement

ప్రీపెయిడ్ ప్లాన్ ధర పెంపు విధానాన్ని బట్టి, అన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లలో పెద్దగా ధరల పెంపు ఉండదని ఎక్స్ ఫర్ట్స్ అంటున్నారు. టెలికాం కంపెనీలు సాధారణంగా భారీ టారిఫ్ మార్పులను ఒకేసారి ప్రకటిస్తాయి. అందువల్ల, తాజా పెంపు అధిక వినియోగం ఉన్న ప్లాన్‌లను మెరుగ్గా నిర్వహించడానికే అంటున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఎయిర్ టెల్ గ్లోబల్ ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్ ధరను రూ.4,000 నుంచి రూ.4,999కి పెంచింది.

Also Read: ఎయిర్‌టెల్ ధమాకా ప్లాన్స్.. ఫ్రీ హాట్‌స్టార్, నాన్ స్టాప్ 5G డేటా.. ఐపీఎల్ లవర్స్‌కు మాస్ జాతరే!

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×