E-Paper
Advertisement

ఆఫర్ అంటే ఇది కదా.. Amazon SAleలో బ్రాండెడ్ స్మార్ట్ టీవీలపై 65% డిస్కౌంట్.. ఏ మోడల్ ఎంతంటే?

ఆఫర్ అంటే ఇది కదా.. Amazon SAleలో బ్రాండెడ్ స్మార్ట్ టీవీలపై 65% డిస్కౌంట్.. ఏ మోడల్ ఎంతంటే?
Advertisement

Amazon Prime Day Sale 2026: అమెజాన్ ప్రైమ్ డే సేల్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. జూలై 4 నుంచి 6వ తేదీ వరకు జరగనున్న ఈ సేల్‌లో స్మార్ట్ టీవీలపై కళ్లు చెదిరే ఆఫర్లను అమెజాన్ ప్రకటించింది. ప్రముఖ బ్రాండ్ల టీవీలపై ఏకంగా 65 శాతం వరకు డిస్కౌంట్లు లభించనున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన ఒక టీజర్ పేజీని కూడా అమెజాన్ లైవ్ చేసింది.

ప్రముఖ బ్రాండ్లపై భారీ తగ్గింపులు:

స్మార్ట్ టీవీ కొనాలనుకునే వారికి ఈ సేల్ మంచి అవకాశం కానుంది. సోనీ, ఎల్‌జీ, శాంసంగ్ వంటి దిగ్గజ బ్రాండ్లపై భారీగా ధరలు తగ్గనున్నాయి. సోనీ బ్రావియా 2 సిరీస్‌తో పాటు ఎల్‌జీకి చెందిన 55 ఇంచుల నానో 4కే యూహెచ్‌డీ టీవీపై మంచి ఆఫర్లు ఉండనున్నాయి. ప్రస్తుతం ఈ ఎల్‌జీ టీవీ ధర రూ.85,990 ఉంది. అలాగే శాంసంగ్ ఇటీవలే లాంచ్ చేసిన 55 ఇంచుల మినీ ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీపై కూడా ఊహించని రేంజ్‌లో డిస్కౌంట్ లభించే అవకాశం ఉంది.

Advertisement

Also Read: జులైలో లాంచ్ కానున్న మోస్ట్ అవేటెడ్ మొబైల్స్.. Oppo Reno 16 నుంచి Vivo V80 వరకు అదరగొట్టే లిస్ట్ ఇదే!

టీవీల అంచనా ధరల వివరాలు:

ఈ సేల్‌లో కొన్ని మోడల్స్ ఎంత ధరకు అందుబాటులోకి రానున్నాయో ముందే లీకయ్యాయి. ప్రస్తుతం రూ.63,990 ఉన్న సోనీ బ్రావియా 2 టీవీ సేల్‌లో రూ.55,990కే లభించే అవకాశం ఉంది. అలాగే టీసీఎల్ 75 ఇంచుల క్యూడీ మినీ ఎల్‌ఈడీ టీవీ ధర ఏకంగా రూ.99,990 నుంచి రూ.66,990కు తగ్గనుంది. ఫిలిప్స్ 55 ఇంచుల 4కే క్యూఎల్ఈడీ టీవీ రూ.39,999కు, తోషిబా 50 ఇంచుల క్యూఎల్ఈడీ టీవీ రూ.28,499కు దక్కే ఛాన్స్ ఉంది. ఇక తక్కువ బడ్జెట్‌లో హైసెన్స్ 43 ఇంచుల టీవీ రూ.24,999కు, వ్యూ 55 ఇంచుల వైబ్ సిరీస్ టీవీ రూ.31,990కు, ఏసర్ 50 ఇంచుల 4కే టీవీ రూ.22,999 ప్రారంభ ధరతో అందుబాటులోకి రానున్నాయి.

బ్యాంక్ ఆఫర్లు కూడా అదనం:

Advertisement

పైన పేర్కొన్న ధరలు కేవలం కంపెనీలు ఇచ్చే ప్రాథమిక తగ్గింపులు మాత్రమే. సేల్ ప్రారంభమయ్యాక వివిధ బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించడం ద్వారా అదనపు డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లను కూడా పొందవచ్చు. కాబట్టి.. ఫైనల్ ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉంది.

సోనీ నుంచి సరికొత్త టీవీ:

ఈ ఆఫర్లతో పాటు సోనీ ప్రియుల కోసం మరో అప్‌డేట్ ఉంది. సోనీ కంపెనీ తన సరికొత్త ‘బ్రావియా 3 II’ స్మార్ట్ టీవీని భారత మార్కెట్లో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. అయితే దీనికి సంబంధించిన ఫీచర్లు, ధర, సేల్ వివరాలను కంపెనీ ఇంకా పూర్తిగా వెల్లడించలేదు. సేల్ ప్రారంభమయ్యే సమయానికి దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Also Read: ఆ తేదీ నుంచే Flipkart GOAT Sale మొదలు.. iPhone 17, iPhone Air ధరలు భారీగా తగ్గుతాయ్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×