E-Paper
Advertisement

ఆపిల్ వాచ్‌లాంటి డిజైన్, తక్కువ ధర! ఇంకెందుకు ఆలస్యం కొనేయండి

ఆపిల్ వాచ్‌లాంటి డిజైన్, తక్కువ ధర! ఇంకెందుకు ఆలస్యం కొనేయండి
Advertisement

Amazfit GTS Smartwatch: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ చేతికి ప్రీమియమ్ లుక్ ఇచ్చే స్టైలిష్ స్మార్ట్‌వాచ్‌ను కోరుకుంటున్నారు. ముఖ్యంగా.. యాపిల్ వాచ్‌లాంటి డిజైన్‌తో, బడ్జెట్ ధరలో అందుబాటులోకి వచ్చి మంచి ఆదరణ పొందిన మోడల్ Amazfit GTS. స్లిమ్ అండ్ లైట్‌వెయిట్ డిజైన్, అద్భుతమైన అల్మోడ్ డిస్ప్లే, బెస్ట్ బ్యాటరీ లైఫ్‌తో వచ్చే ఈ స్మార్ట్‌వాచ్ టెక్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీని పూర్తి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, మార్కెట్‌లో దీని ధరల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం!

Amazfit GTS స్మార్ట్‌వాచ్ పూర్తి వివరాలు:

రాయల్ అండ్ స్లిమ్ డిజైన్:
ఈ స్మార్ట్‌వాచ్ చూడటానికి చాలా స్టైలిష్‌గా, ఎలిగెంట్‌గా కనిపిస్తుంది. దీని ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం అల్లాయ్ బాడీ వాచ్‌కి ప్రీమియమ్ ఫినిషింగ్‌ను ఇస్తుంది. కేవలం 9.4mm మందం, 24.8 గ్రాముల బరువు మాత్రమే ఉండటం వల్ల దీనిని రోజంతా వేసుకున్నా చేతికి చాలా తేలికగా అనిపిస్తుంది.

Advertisement

ప్రకాశవంతమైన అల్మోడ్ డిస్ప్లే:
ఇందులో 1.65 ఇంచీల స్క్వేర్ HD అల్మోడ్ డిస్ప్లే ఇచ్చారు. 341 PPI పిక్సెల్ డెన్సిటీ ఉండటం వల్ల డిస్ప్లేలోని రంగులు, అక్షరాలు చాలా షార్ప్‌గా, స్పష్టంగా కనిపిస్తాయి. ఎండలో.. చూసినా కంటెంట్ స్పష్టంగా కనిపిస్తుంది. పైగా డిస్ప్లే భద్రత కోసం 2.5D కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఇచ్చారు.

హెల్త్ , ఫిట్‌నెస్ ట్రాకింగ్:
ఆరోగ్య స్పృహ ఉన్న వారికి ఇది ఒక మంచి హెల్త్ పార్ట్‌నర్‌గా పని చేస్తుంది. ఇందులో 24 గంటల పల్స్ రేట్ కొలిచే BioTracker PPG ఆప్టికల్ సెన్సార్ ఉంది.

Advertisement

12 స్పోర్ట్స్ మోడ్స్: అవుట్‌డోర్ రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, ట్రెడ్‌మిల్ వంటి 12 రకాల వర్కౌట్ మోడ్‌లు ఉన్నాయి.

5 ATM వాటర్ రెసిస్టెన్స్: 50 మీటర్ల లోతు నీటిలో కూడా పనిచేసే వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ ఉండటం వల్ల స్విమ్మింగ్ చేసేటప్పుడు కూడా నిరభ్యంతరంగా వాడుకోవచ్చు.

Also Read: హార్డ్ వాటర్‌తోనూ.. బట్టలు మెరిసిపోవాలా?

ఇన్-బిల్ట్ GPS,బ్యాటరీ లైఫ్:
ఈ స్మార్ట్‌వాచ్‌లో హై-ప్రిసిషన్ GPSసపోర్ట్ ఉంది, దీని వల్ల మీరు వాకింగ్ లేదా రన్నింగ్ చేసేటప్పుడు ఫోన్‌తో పనిలేకుండా మీ రూట్‌ను ట్రాక్ చేయవచ్చు. ఇక బ్యాటరీ విషయానికొస్తే.. ఇందులో ఉన్న 220mAh బ్యాటరీ సాధారణ వాడకంలో దాదాపు 14 రోజుల పాటు సులభంగా వస్తుంది. కేవలం వాచ్ మోడ్‌లో వాడితే 46 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుండటం దీని ప్లస్ పాయింట్.

ధరల వివరాలు :
మార్కెట్‌లో , ప్రముఖ ఈ-కామర్స్ సైట్లలో ఈ సిరీస్ తాజా ధరల వివరాలు.. ఆన్‌లైన్ సేల్స్, ఆఫర్ల సమయంలో దీని ధర సుమారు రూ.4,499 నుంచి రూ. 5,999 మధ్యలో లభిస్తోంది

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×