E-Paper
Advertisement

వాటర్ ప్రూఫ్, అడ్వాన్స్‌డ్ జీపీఎస్‌తో Amazfit కొత్త స్మార్ట్‌వాచ్‌లు లాంచ్.. ధర ఎంతంటే?

వాటర్ ప్రూఫ్, అడ్వాన్స్‌డ్ జీపీఎస్‌తో Amazfit కొత్త స్మార్ట్‌వాచ్‌లు లాంచ్.. ధర ఎంతంటే?
Advertisement

Amazfit Balance 3: ప్రముఖ అమేజ్‌ఫిట్ బ్రాండ్ అమెరికా మార్కెట్లో తమ సరికొత్త స్మార్ట్‌వాచ్‌లు Amazfit Balance 3, Balance Ultra మోడళ్లను లాంచ్ చేసింది. హైబ్రిడ్ ట్రైనింగ్ సిస్టమ్‌తో రూపొందిన ఈ వాచ్‌లు ఫిట్‌నెస్ ప్రియులకు, క్రీడాకారులకు అద్భుతమైన ఎంపికగా నిలవనున్నాయి. జెప్ యాప్ ద్వారా ఇవి యూజర్ల వ్యాయామం, కోలుకునే సమయం (రికవరీ) వంటి డేటాను విశ్లేషిస్తాయి.

ప్రీమియం లుక్..

ఈ రెండు స్మార్ట్‌వాచ్‌లు 1.5 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తాయి. స్క్రీన్ రక్షణ కోసం వీటికి సఫైర్ గ్లాస్ వాడారు. అల్ట్రా మోడల్ పూర్తిగా గ్రేడ్ 5 టైటానియం బాడీతో ప్రీమియం లుక్‌లో ఉంటుంది. బ్యాలెన్స్ 3 మోడల్ మాత్రం స్టెయిన్‌లెస్ స్టీల్, టైటానియం అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. అలాగే వీటిలో 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉండటం వల్ల పాటలు, ఎంత డేటా అయినా దాచుకోవచ్చు.

Advertisement

Also Read: యూట్యూబ్ షార్ట్స్ vs ఇన్‌స్టాగ్రామ్ రీల్స్.. ఎక్కువ డబ్బులు దేంట్లో వస్తాయంటే?

180కి పైగా స్పోర్ట్స్ మోడ్స్..

క్రీడాకారుల కోసం ఇందులో 180కి పైగా స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. ముఖ్యంగా అధికారిక హైరాక్స్ (Hyrox) రేస్ టూల్స్, రన్నింగ్ పవర్, హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్, స్లీప్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాదు.. వీటికి 10 ఏటీఎం వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ ఉంది. దీనివల్ల స్కూబా డైవింగ్, స్విమ్మింగ్ చేసేటప్పుడు కూడా వీటిని ధరించవచ్చు.

పవర్‌ఫుల్ బ్యాటరీ లైఫ్:

Advertisement

ఈ వాచ్‌ల ప్రధాన ఆకర్షణ వీటి బ్యాటరీ బ్యాకప్. బ్యాలెన్స్ అల్ట్రా మోడల్ సాధారణ వినియోగంతో ఏకంగా 30 రోజుల పాటు ఛార్జింగ్ వస్తుంది. ఇక బ్యాలెన్స్ 3 మోడల్ ఒకసారి ఛార్జ్ చేస్తే 21 రోజుల పాటు పని చేస్తుంది. జీపీఎస్ ఆన్‌లో ఉంచినా కూడా ఇవి చాలా గంటల పాటు బ్యాటరీ సపోర్ట్ అందిస్తాయి. ఆఫ్‌లైన్ మ్యాప్స్ సదుపాయం కూడా ఇందులో ఉంది.

ధరల వివరాలు:

ఇక ధరల విషయానికి వస్తే.. అమేజ్‌ఫిట్ బ్యాలెన్స్ 3 స్టెయిన్‌లెస్ స్టీల్ ధర సుమారు రూ.35,400 కాగా, టైటానియం ధర రూ.43,100గా ఉంది. ఇక హై-ఎండ్ మోడల్ అయిన బ్యాలెన్స్ అల్ట్రా ధర సుమారు రూ.57,400గా నిర్ణయించారు. ఇవి ప్రస్తుతం అమేజ్‌ఫిట్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా అందుబాటులో ఉన్నాయి.

Read Also: జియో బ్రాడ్‌బ్యాండ్ ధమాకా ఆఫర్.. ఒకసారి రీఛార్జ్ చేస్తే 13 నెలల పాటు నెట్, ఓటీటీలు ఫ్రీ!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×