E-Paper
Advertisement

పేదింటి ఆడబిడ్డలకు గుడ్ న్యూస్.. మీ పేరు మీదే సొంత ఇల్లు, మంత్రి పొంగులేటి సంచలన ప్రకటన!

పేదింటి ఆడబిడ్డలకు గుడ్ న్యూస్.. మీ పేరు మీదే సొంత ఇల్లు, మంత్రి పొంగులేటి సంచలన ప్రకటన!
Advertisement

Ponguleti: స్వేచ్ఛ బ్యూరో: పేదల జీవనోపాధికి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా నియోజక వర్గాన్ని యూనిట్ గా తీసుకొని క్యూర్ పరిధిలో పేదలు నివాసముంటున్న ప్రాంతాలకు సమీపంలోనే అల్పదాయ , మధ్యతరగతి వర్గాలు కు లక్ష ఇండ్లు నిర్మించ బోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. కోట్ల రూపాయల విలువచేసే ప్రభుత్వ స్థలాలల్లో లక్ష ఇండ్లను నిర్మించి ఆ స్థలములో వారి వాటాకు యజమానిని చేస్తూ పెదింటి ఆడబిడ్డలకు ఇవ్వబోతున్నామని ప్రకటించారు.

క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లు

Advertisement

క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై శుక్రవారం సచివాలయంలోని తన కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి క్యూర్ పరిధిలో లక్ష ఇండ్లకు ఇతర ప్రాంతాలల్లో 2.50 లక్షలు మొత్తం 3.50 లక్షల ఇండ్లకు ఇప్పటికే ప్రరిపాలన పరమైన అనుమతులు ఇవ్వడం జరిగిందని, దీనిని దృష్టిలోపెట్టుకొని అవసరమైన కార్యాచరణను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

గత ప్రభుత్వంపై విమర్శలు

Advertisement

గత ప్రభుత్వం పేదల జీవన పరిస్థితులను, వారి ఉపాధి అవసరాలను ఏ మాత్రం పట్టించుకోకుండా హైదరాబాద్ నగరానికి 30-40 కిలోమీటర్ల దూరంలో అరకొరగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించిందని విమర్శించారు. ఇల్లు అనేది పేద కుటుంబానికి ఎంత అవసరమో, వారి జీవనోపాధి కూడా అంతే ముఖ్యమనే విషయాన్ని గత పాలకులు విస్మరించారని అన్నారు. రోజువారీ కూలి పనులు, చిన్న వ్యాపారాలు, ఉపాధి అవకాశాలపై ఆధారపడే పేద కుటుంబాలు నగర శివార్లలో నిర్మించిన ఇళ్లకు వెళ్లలేకపోయాయని, ఉపాధి దూరమవడంతో పాటు పిల్లల విద్య, వైద్య సదుపాయాలు, రవాణా వంటి సమస్యలు ఎదురవడంతో అనేక కుటుంబాలు ఆ ఇళ్లలో నివసించడానికి ఆసక్తి చూపలేదన్నారు.

Also read: ప్రాజెక్టుని బొందపెట్టినోడే బాధపడ్డట్టు ఉంది.. బీఆర్ఎస్ నేతలపై సామా ఘాటు వ్యాఖ్యలు!

ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇండ్లు

ఫలితంగా ఆ గృహాలు ఖాళీగా, నిరుపయోగంగా మిగిలిపోయాయని పేర్కొన్నారు.ఇలాంటి తప్పిదాలను పునరావృతం చేయకుండా పేదలు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాల్లోనే గౌరవప్రదమైన జీవితం గడిపేలా ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టబోతున్నామని, ఈ దిశగా విలువైన ప్రభుత్వ భూములను పేదల సంక్షేమం కోసం వినియోగిస్తూ లక్ష ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుడుతోన్నామని మంత్రి వెల్లడించారు. ముఖ్యంగా పేద కుటుంబాల మహిళలకు సొంతింటిపై హక్కు కల్పించడం ద్వారా వారి ఆర్థిక, సామాజిక భద్రతను మరింత బలోపేతం చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

ఇండ్ల డిజైన్

సొంత ఇల్లు మహిళ సాధికారతకు, కుటుంబ స్థిరత్వానికి, భవిష్యత్ తరాల అభివృద్ధికి బలమైన పునాది అవుతుందన్నారు.పేదల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వారికి సౌకర్యవంతంగా ఉండేలా ఇండ్ల డిజైన్ లను రూపొందించాలని, ఇంటి నిర్మాణం కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండేలా ప్లాన్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో హౌసింగ్ సెక్రెటరీ వి.పి. గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. 2,140 వాహనాలు సీజ్!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×