E-Paper
Advertisement

ఎయిర్‌టెల్ ఫన్ ప్లాన్.. నెట్ ఫ్లిక్స్, యాపిల్ టీవీ, హాట్‌స్టార్ ఫ్రీ.. 3.3TB డేటాతో మీ ఇష్టం!

ఎయిర్‌టెల్ ఫన్ ప్లాన్.. నెట్ ఫ్లిక్స్, యాపిల్ టీవీ, హాట్‌స్టార్ ఫ్రీ.. 3.3TB డేటాతో మీ ఇష్టం!
Advertisement

Airtel Xstream Fiber: ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ (Airtel) తన ఎక్స్‌ట్రీమ్ ఫైబర్ (Xstream Fiber) వినియోగదారుల కోసం ఒక అదిరిపోయే ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా ఓటీటీ ప్రియులు నెట్‌ఫ్లిక్స్, యాపిల్ టీవీ వంటి ప్రీమియం యాప్స్ కోసం విడివిడిగా వందల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. కానీ, ఎయిర్‌టెల్ తన రూ. 999 హోమ్ బ్రాడ్‌బాండ్ ప్లాన్‌తో ఈ రెండు దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ సబ్‌స్క్రిప్షన్లను ఉచితంగా అందిస్తూ యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ ప్లాన్ కు సంబంధించి పూర్తి వివరాలేంటో ఈ కథనంలో చూద్దాం.

నెట్‌ఫ్లిక్స్, యాపిల్ టీవీ+ కాంబో

సాధారణంగా బ్రాడ్‌బాండ్ ప్లాన్లలో ఏదో ఒక ప్రీమియం ఓటీటీ మాత్రమే లభిస్తుంది. కానీ ఎయిర్‌టెల్ రూ. 999 ప్లాన్ (Airtel Entertainment Plan) ద్వారా నెట్‌ఫ్లిక్స్ (Netflix) బేసిక్ ప్లాన్‌తో పాటు యాపిల్ టీవీ+ (Apple TV+) సబ్‌స్క్రిప్షన్‌ను కూడా ఉచితంగా సొంతం చేసుకోవచ్చు. హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇష్టపడే వారికి యాపిల్ టీవీ+ అద్భుతమైన కంటెంట్‌ను అందించనుండటం విశేషం. అలాగే జియో హాట్ స్టార్, జీ5, ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్ ప్లేకు సైతం ఫ్రీ యాక్సెస్ లభించనుంది.

100 Mbps వేగంతో నెట్

Advertisement

ఈ ప్లాన్ కేవలం ఓటీటీలకే పరిమితం కాలేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి గేమర్లకు సరిపోయేలా ఇందులో 100 Mbps వేగంతో ఇంటర్నెట్ డేటాను ఎయిర్ టెల్ ఆఫర్ చేస్తోంది. దీనివల్ల బఫరింగ్ లేకుండా హై-క్వాలిటీ వీడియోలను స్ట్రీమింగ్ చేసుకోవచ్చని ఎయిర్ టెల్ వర్గాలు పేర్కొన్నాయి. యూజర్లు నెల పూర్తయ్యే సరికి 3.3 TB డేటాను ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేశాయి.

Also Read: జియో సూపర్ హిట్ ప్లాన్.. అపరిమిత 5G, ఉచిత ఓటీటీ, ఫ్రీ కాల్స్.. ఇంకా ఎన్నో బెనిఫిట్స్!

ఎలా పొందాలి?

Advertisement

మెుబైల్లో ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ ఉంటే నిమిషాల్లోనే ఈ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ ను సొంతం చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా యాప్ ఓపెన్ చేసి.. హోమ్ స్క్రీన్ పైన ఉన్న Buy New Service’ లేదా ‘Fiber/Broadband’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. అక్కడ అందుబాటులో ఉన్న ప్లాన్ల జాబితా నుండి రూ. 999 ను ఎంచుకోండి. పేరు, మొబైల్ నంబర్, ఇన్‌స్టాలేషన్ చేయాల్సిన ఇంటి అడ్రస్ ఇస్తే.. ఎయిర్ టెల్ ప్రతినిధులు సంప్రదించి కనెక్షన్ ఇస్తారు. ఎయిర్ టెల్ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లైన ఇదే ప్రాసెస్ ను పూర్తి చేసి.. బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ పొందొచ్చు.

Also Read: జియో బంపరాఫర్.. రూ.448 ప్లాన్‌తో 84 రోజుల వ్యాలిడిటీ.. మరెన్నో బెనిఫిట్స్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×