// // Skoda June 2026 Offers: స్కోడా కార్లపై భారీ ఆఫర్లు.. స్లావియాపై ఏకంగా రూ.1.25 లక్షల తగ్గింపు! -->
E-Paper
Advertisement

స్కోడా కార్లపై భారీ ఆఫర్లు.. స్లావియాపై ఏకంగా రూ.1.25 లక్షల తగ్గింపు!

స్కోడా కార్లపై భారీ ఆఫర్లు.. స్లావియాపై ఏకంగా రూ.1.25 లక్షల తగ్గింపు!
Advertisement

June 2026 Skoda Discounts: జూన్ 2026లో కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్న వారికి స్కోడా ఇండియా సూపర్  ఆఫర్లను ప్రకటించింది. తన పాపులర్ మోడల్స్ అయిన స్లావియా, కుషాక్, కైలాక్‌ పై ప్రత్యేక డిస్కౌంట్లు, ఇతర ప్రయోజనాలను అందిస్తోంది. వేరియంట్‌ ను బట్టి క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్, లాయల్టీ బెనిఫిట్స్ గా ఈ ఆఫర్లు లభిస్తున్నాయి.

స్లావియాపై రూ.1.25 లక్షల తగ్గింపు

Advertisement

స్కోడా స్లావియా కొనుగోలుదారులకు ఈ నెలలో ఎక్కువ బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రీమియం సెడాన్‌ పై మొత్తం రూ.1.25 లక్షల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఇందులో రూ.25,000 వరకు నగదు తగ్గింపు, రూ.50,000 వరకు కార్పొరేట్, లాయల్టీ బోనస్, అలాగే రూ.50,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. అయితే, బేస్ క్లాసిక్ వేరియంట్‌ పై ఈ ఆఫర్లు వర్తించవు. స్లావియా 1.0 లీటర్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌ బాక్స్ ఎంపికలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం దీని ధర రూ.10 లక్షల నుంచి రూ.16.69 లక్షల మధ్య ఉంది. హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా, వోక్స్‌ వ్యాగన్ విర్టస్ లాంటి కార్లకు ఇది ప్రత్యర్థిగా కొనసాగుతోంది.

కుషాక్‌ పై రూ.50 వేల తగ్గింపు

మిడ్ రేంజ్ SUV కొనాలనుకునేవారికి స్కోడా కుషాక్‌ పై కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి. ఈ SUVపై రూ.50,000 వరకు బెనిఫిట్స్ పొందే అవకాశం కల్పిస్తోంది. ఇందులో రూ.20,000 వరకు కార్పొరేట్, లాయల్టీ బోనస్, రూ.30,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. అయితే, బేస్ క్లాసిక్ ప్లస్ వేరియంట్‌ కు ఈ ఆఫర్లు వర్తించవు. కుషాక్‌ లో కూడా స్లావియాలో ఉన్న 1.0 లీటర్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్లు లభిస్తాయి. దీని ధరలు రూ.10.69 లక్షల నుంచి రూ.18.99 లక్షల వరకు ఉన్నాయి. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, వోక్స్‌ వ్యాగన్ టైగన్, మారుతి గ్రాండ్ విటారా లాంటి SUVలతో ఇది పోటీపడుతోంది.

కైలాక్ SUVపై రూ.50 వేల తగ్గింపు

Advertisement

ఇక స్కోడా అత్యధికంగా అమ్ముడవుతున్న కైలాక్ SUVపై కూడా ప్రత్యేక ఆఫర్లు అందిస్తోంది. ఈ మోడల్‌ పై మొత్తం రూ.50,000 వరకు బెనిఫిట్స్ లభిస్తాయి. ఇందులో రూ.10,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.10,000 కార్పొరేట్, లాయల్టీ బోనస్, రూ.30,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. అయితే, క్లాసిక్, క్లాసిక్ ప్లస్ వేరియంట్లకు ఈ బెనిఫిట్స్ అందుబాటులో లేవు. కైలాక్‌లో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ మాత్రమే అందుబాటులో ఉంది. దీనికి మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌ బాక్స్ ఆప్షన్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ SUV ధర రూ.7.59 లక్షల నుంచి రూ.12.99 లక్షల మధ్య ఉంది. టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా XUV 3XO వంటి మోడళ్లకు ఇది పోటీగా నిలుస్తోంది.

Read Also: కియా కేరెన్స్, క్లావిస్‌ కు బంపర్ రెస్పాన్స్.. 3 లక్షల సేల్స్ మార్క్ క్రాస్!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×