E-Paper
Advertisement

ఏంటీ.. రూ.350 లోపే అపరిమిత 5G డేటానా? ఈ Airtel ప్లాన్స్‌తో రచ్చ రచ్చే!

ఏంటీ.. రూ.350 లోపే అపరిమిత 5G డేటానా? ఈ Airtel ప్లాన్స్‌తో రచ్చ రచ్చే!
Advertisement

Airtel 5G Plans: టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్ టెల్.. తన కస్టమర్లకు నాణ్యమైన 5G సేవలను వారిని ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా అతి తక్కువగా వేగవంతమైన డేటాను ఇస్తూ.. మరింత మంది కస్టమర్లను రాబట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే రూ.350 లోపున్న ప్లాన్స్ లో అపరిమిత 5G డేటాను ఎయిర్ టెల్ ఆఫర్ చేస్తోంది. అంతేకాకుండా ఫ్రీ కాల్స్, ఎస్ఎంఎస్ లను సైతం అందిస్తోంది. ఇంతకీ ఆ ప్లాన్స్ ఏవి? వాటి వల్ల యూజర్లకు కలిగే బెనిఫిట్స్ ఏంటి? అపరిమిత 5G సేవలు పొందాలంటే ఎయిర్ టెల్ యూజర్లు ఏం చేయాలి? వంటి వివరాలు ఈ కథనంలో చూద్దాం.

రూ. 299 ప్రీపెయిడ్ ప్లాన్

ఎయిర్ టెల్ ఈ ప్లాన్ ను 28 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కింద యూజర్లకు ప్రతీ రోజూ 1GB డేటా లభించనుంది. అంటే ప్లాన్ గడువు ముగిసే సమయానికి మెుత్తం 28 GB డేటాను యూజర్లు వాడుకోవచ్చు. మరోవైపు అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు సైతం చేసుకోవచ్చు. అయితే ఇదే ప్లాన్ కింద అర్హత కలిగిన యూజర్లకు 5G అపరిమిత డేటాను సైతం ఎయిర్ టెల్ ఆఫర్ చేస్తోంది. అదనపు బెనిఫిట్స్ కింద హలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ సబ్ స్క్రిప్షన్ సైతం అందిస్తోంది.

రూ. 349 రీఛార్జ్ ప్లాన్

Advertisement

ఈ ప్లాన్ ను సైతం 28 రోజుల వ్యాలిడిటీతోనే ఎయిర్ టెల్ తీసుకొచ్చింది. అయితే దీని కింద యూజర్లకు ప్రతీ రోజూ 2GB హై స్పీడ్ డేటా లభించనుంది. ఫ్రీ కాల్స్, ఎస్ఎంఎస్ లు, అదనపు బెనిఫిట్స్ యథావిధిగా పై ప్లాన్ తరహాలోనే ఇందులోనూ యూజర్లకు లభిస్తాయి. అయితే ఈ ప్లాన్ కూడా అర్హులైన ఎయిర్ టెల్ కస్టమర్లకు 5G అపరిమిత డేటాను అందించనుంది. వారు రోజువారీ డేటా లిమిట్ (2GB) తో సంబంధించి 28 రోజుల పాటు ఎంత 5G డేటా అయినా వాడుకోవచ్చు.

అన్‌లిమిటెడ్ 5G పొందటం ఎలా?

ఈ రెండు ప్లాన్లలో ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ అన్‌లిమిటెడ్ 5G డేటా అని అందరికీ తెలిసిందే. అయితే దీన్ని వినియోగించుకోవాలంటే కస్టమర్లు మాన్యువల్‌గా క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా స్మార్ట్‌ఫోన్‌లో ‘ఎయిర్ టెల్ థ్యాంక్స్’ యాప్‌ను ఓపెన్ చేసి.. హోమ్ పేజీలో కనిపించే ‘క్లెయిమ్ అన్ లిమిటెడ్ 5G’పై క్లిక్ చేయాలి. అనంతరం అక్కడ కనిపించే ‘Claim Now’ బటన్‌పై నొక్కితే మీ నంబర్‌పై అన్‌లిమిటెడ్ 5G సేవలు యాక్టివేట్ అవుతాయి.

Advertisement

Also Read: నోకియా కొత్త ఫీచర్ ఫోన్ లాంచ్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 19 రోజులు నాన్ స్టాప్!

ఈ షరతులు వర్తిస్తాయ్..!

అయితే ఎయిర్ టెల్ అందించే ఈ అపరిమిత 5G సేవలు పొందాలంటే కొన్ని షరతులు ఉన్నాయి. మీరు ఉంటున్న ప్రాంతంలో ఎయిర్‌టెల్ 5G నెట్‌వర్క్ తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి. అదే సమయంలో మీ స్మార్ట్ ఫోన్ 5G నెట్ వర్క్ కు సపోర్ట్ చేసేదై ఉండాలి. అప్పుడు మాత్రమే నాన్ స్టాప్ 5G డేటాను పొందేందుకు అర్హులు అవుతారు. అందులో ఏ ఒక్కటి లేకపోయినా.. ప్లాన్ లో వచ్చే పరిమిత డేటాతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది.

Also Read: ఓరి దేవుడా.. భారీగా తగ్గిన గెలాక్సీ Z Fold 7 ధర.. కొనుగోలుకు ఇదే బెస్ట్ టైమ్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×