E-Paper
Advertisement

మంగళవారం సీక్వెల్ పై డైరెక్టర్ బిగ్ అప్డేట్.. ఈసారి అంతకుమించి అంటూ!

మంగళవారం సీక్వెల్ పై డైరెక్టర్ బిగ్ అప్డేట్.. ఈసారి అంతకుమించి అంటూ!
Advertisement

Ajay bhupathi: ఆర్ఎక్స్ 100 సినిమాతో దర్శకుడిగా సంచలన విజయం అందుకున్న అజయ్ భూపతి.. విభిన్న జానర్లలో సినిమాలు చేస్తూ మంచి సక్సెస్ అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన దర్శకత్వం వహించిన మరో చిత్రం శ్రీనివాస మంగాపురం. జూలై 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ద్వారా సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరుడు, దివంగత నటుడు రమేష్ బాబు కొడుకు జయకృష్ణ ఘట్టమనేని ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. అటు ఈ చిత్రం ద్వారానే రవీనా టాండన్ కూతురు రషా తడానీ కూడా తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. పైగా ఇద్దరికీ ఇదే తొలి సినిమా కావడం గమనార్హం. జూలై 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో అటు వరుస ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టింది చిత్ర బృందం.

మంగళవారం 2 పై దర్శకుడు అప్డేట్..

ఇకపోతే డైరెక్టర్ గా ప్రమోషన్స్ మొదలుపెట్టిన అజయ్ భూపతి.. మంగళవారం సీక్వెల్ పై బిగ్ అప్డేట్ ఇచ్చారు. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఆర్ఎక్స్ 100 సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న అజయ్ భూపతి.. మహాసముద్రం సినిమాతో కాస్త నిరాశ పడినా.. మళ్లీ మంగళవారం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ మిస్టరీ థ్రిల్లర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇందులో పాయల్ రాజ్ పుత్ తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది. అలా మళ్లీ ఆర్ఎక్స్ 100 తర్వాత గట్టిగా కం బ్యాక్ ఇచ్చిన అజయ్ భూపతి.. ఇప్పుడు శ్రీనివాస మంగాపురం సినిమాతో వస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన తదుపరి ప్రాజెక్టులపై అప్డేట్ ఇస్తూ అంచనాలు పెంచేశారు.

Advertisement

also read:ప్రమోషన్స్ గట్టిగా మొదలుపెట్టిన అనిల్ రావిపూడి.. వీడియో వైరల్!

సూపర్ నేచురల్ అంశాలకు పెద్ద పీట..

ప్రమోషన్స్ లో భాగంగా అజయ్ భూపతి మాట్లాడుతూ..” మంగళవారం 2 సినిమా తప్పకుండా తెరకెక్కుతుంది. ఈసారి ప్రేక్షకులు ఊహించని స్థాయిలో కథను తయారు చేస్తున్నాను. ముఖ్యంగా మొదటి భాగానికి పూర్తి భిన్నంగా.. ఎవరూ ఊహించని థ్రిల్లింగ్ అనుభవాన్ని అందించేలా.. ఈ సినిమా ఉంటుంది. సూపర్ నేచురల్ అంశాలకు ఇందులో పెద్దపీట వేస్తున్నా.. ప్రతి పాత్ర, ప్రతి సంఘటన ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠకు గురి చేసేలా.. కథను రూపొందిస్తున్నాను. ప్రస్తుతం శ్రీనివాస మంగాపురం సినిమా పనులలో బిజీగా ఉన్నాము. ఆ సినిమా విడుదలైన తరువాత మంగళవారం 2 స్క్రిప్ట్ పై పూర్తి దృష్టి పెడతాం.” అంటూ ఆయన తెలిపారు. మొత్తానికి అయితే మంగళవారం సీక్వెల్ పై అంచనాలు పెంచేసి.. సినిమాపై ఊహించని బజ్ క్రియేట్ చేశారు.

రంగంలోకి కొరటాల శివ..

Advertisement

ఇకపోతే అజయ్ భూపతి.. ఈ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివకు వినిపించగా.. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తన నిర్మాణ సంస్థ యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మంగళవారం 2 సినిమాలో ఎవరు నటిస్తున్నారు? సాంకేతిక విభాగం ఇలా పలు విషయాలపై పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×