E-Paper
Advertisement

నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, లైవ్ టీవీ ఫ్రీ.. ఎయిర్‌టెల్ రూ.1199 ప్లాన్‌తో ఇన్ని లాభాలా ?

నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, లైవ్ టీవీ ఫ్రీ.. ఎయిర్‌టెల్ రూ.1199 ప్లాన్‌తో ఇన్ని లాభాలా ?
Advertisement

Airtel 1199 broadband plan: నేటి డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరికీ హై-స్పీడ్ ఇంటర్నెట్‌తో పాటు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు అవసరంగా మారాయి. మన దేశంలో రెండవ అతిపెద్ద టెలికాం సంస్థ అయిన ఎయిర్‌టెల్, తన కస్టమర్ల కోసం ఒక ధమాకా ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. రూ. 1199 ధరతో వచ్చే ఈ 100 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ద్వారా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, వందలాది లైవ్ టీవీ ఛానెళ్లను ఫ్రీగా పొందవచ్చు. ఈ ఆకర్షణీయమైన ప్లాన్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఎయిర్‌టెల్ తన యూజర్ల కోసం రూ. 799, రూ. 899, రూ. 999, రూ. 1199 ధరలలో మొత్తం నాలుగు 100 Mbps వేగం ఇచ్చే ప్లాన్‌లను అందిస్తోంది. అయితే.. వీటన్నింటిలోనూ అత్యంత ప్రీమియం, ఎక్కువ ప్రయోజనాలను ఇచ్చే ప్లాన్ రూ. 1199 ప్లాన్. ఎంటర్ టైన్మెంట్, ఇంటర్నెట్ రెండూ ఒకేచోట కోరుకునే వారి కోసం ఎయిర్‌టెల్ ఈ ప్లాన్‌ను ప్రత్యేకంగా రూపొందించింది.

Advertisement

హై-స్పీడ్ డేటా, రోమింగ్ :
ఈ ప్లాన్ కింద యూజర్లు 100 Mbps అప్‌లోడ్, డౌన్‌లోడ్ వేగాన్ని పొందుతారు. ఒకవేళ మీరు ఎయిర్‌టెల్ ఫైబర్ కనెక్షన్ తీసుకుంటే.. నెలకు 3.3 TB (టెరాబైట్స్) హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అదే ఎయిర్‌టెల్ ఎయిర్‌ఫైబర్ కనెక్షన్ అయితే నెలకు.. 1 TB డేటా లభిస్తుంది. సాధారణ అవసరాలకు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి , ఆన్‌లైన్ గేమింగ్ ప్రియులకు ఈ డేటా ఎంతో ఉపయోగపడుతుంది.

లైవ్ టీవీ, ఓటీటీ బెనిఫిట్స్:
ఈ ప్లాన్ యొక్క ముఖ్యమైన ప్రత్యేకత దీనితో వచ్చే ఎంటర్‌టైన్‌మెంట్ బెనిఫిట్స్. రూ. 1199 ప్లాన్ ఎంచుకున్న యూజర్లకు 350కి పైగా లైవ్ టీవీ ఛానెళ్లు హెచ్ డీ క్వాలిటీలో అందుబాటులోకి వస్తాయి. దీనితో పాటు, మార్కెట్లో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లైన..

Advertisement

నెట్‌ఫ్లిక్స్ (Netflix)

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime)

ఆపిల్ టీవీ ప్లస్ (Apple TV+)

జీ5 (ZEE5)

జియోహాట్‌స్టార్ (JioHotstar)

గూగుల్ వన్ (Google One)

వీటితో పాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా మరో 22కి పైగా ఓటీటీ యాప్‌లను ఉచితంగా చూడొచ్చు. అంతేకాకుండా, 12 నెలల పాటు అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం యాక్సెస్ కూడా లభిస్తుంది.

ఉచిత ఇన్స్టాలేషన్, రూటర్:
వినియోగదారులు ఈ ప్లాన్‌ను కొన్ని నెలల పాటు ముందుగా రీఛార్జ్ చేసుకుంటే.. ఉచితంగా వైఫై రూటర్‌తో పాటు ఫ్రీ ఇన్‌స్టాలేషన్ సౌకర్యాన్ని పొందవచ్చు.

తక్కువ ధరలో మరిన్ని ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు, హై-స్పీడ్ ఇంటర్నెట్ కావాలనుకునే వారికి ఈ ప్లాన్ ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. ఓటీటీల కోసం డబ్బులు ఖర్చు చేయకుండా ఒకే రీఛార్జ్‌తో అన్ని సేవలను పొందవచ్చు.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×