E-Paper
Advertisement

Cooler Tips: కూలర్ మీ ఇంట్లో అక్కడ పెడితే పొరపాటే?.. వాడేటప్పుడు ఈ పనులు అస్సలు చేయకండి..

Cooler Tips: కూలర్ మీ ఇంట్లో అక్కడ పెడితే పొరపాటే?.. వాడేటప్పుడు ఈ పనులు అస్సలు చేయకండి..
Advertisement

Cooler Tips: వేసవి కాలం వచ్చిందంటే చాలు భానుడి భగభగలకు తట్టుకోలేక అందరూ ఏసీలు, కూలర్ల వైపు చూస్తుంటారు. ముఖ్యంగా మధ్యతరగతి ఇళ్లలో ‘ఎయిర్ కూలర్’ ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందడానికి చవకైన్ సాధనం. ఏసీలు కొనలేని వారు ఎక్కువగా కూలర్లు వాడుతూ ఉంటారు. అయితే, కూలర్‌ను వాడేటప్పుడు సరైన అవగాహన లేకపోతే అది చల్లదనాన్ని ఇవ్వకపోగా, అనారోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. కూలర్ వాడేటప్పుడు అసలు ఎక్కడ పెట్టాలి, ఎలా వాడాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ ఆర్టికల్ లో చూద్దాం.

Read also-Air Coolers: కూలర్‌లో ఐస్ గడ్డలు వేస్తున్నారా? జాగ్రత్త సుమా.. ఏదైనా జరగొచ్చు!

గాలి ప్రసరణ ఎలా ఉండాలంటే?

Advertisement

చాలా మంది చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే.. కూలర్ వాడేటప్పుడు గది తలుపులు, కిటికీలు పూర్తిగా మూసివేయడం. ఏసీకి గది మూసి ఉంచాలి కానీ, కూలర్‌కు మాత్రం క్రాస్ వెంటిలేషన్ తప్పనిసరి. కూలర్‌ను కిటికీ వద్ద ఉంచి, బయటి గాలి లోపలికి వచ్చేలా చూడాలి. గదిలోని మరో కిటికీ లేదా తలుపు కొద్దిగా తెరిచి ఉంచాలి. దీనివల్ల గాలిలో తేమ పెరగకుండా ఉంటుంది. లేదంటే గదిలో ఉక్కపోత మొదలవుతుంది. చాలా మంది ఇదే తప్పును చేసి కూలర్ రూమ్ లో పడుకుంటే శరీరం జిగురుగా అయిపోతుంది. అంటూ కామెంట్ చేస్తుంటారు. అందుకే ఎప్పుడూ కూలర్ ను మూసి ఉన్న రూమ్ లో వాడకూడదు.

నీటి నిల్వ..

కూలర్లలో నీరు ఎక్కువ కాలం నిల్వ ఉంటే అది దోమలకు నిలయంగా మారుతుంది. వారానికి కనీసం రెండు సార్లు కూలర్ ట్యాంకును పూర్తిగా శుభ్రం చేయాలి. నీటిలో కొద్దిగా వేప నూనె లేదా బ్లీచింగ్ పౌడర్ వేస్తే బ్యాక్టీరియా, దోమలు చేరకుండా ఉంటాయి. కూలర్ ప్యాడ్లు పాతబడితే వాటిని వెంటనే మార్చాలి. లేదంటే వాటి నుంచి దుర్వాసన రావడమే కాకుండా గాలి నాణ్యత తగ్గిపోతుంది.

జాగ్రత్తలు..

Advertisement

నీటితో సంబంధం ఉన్న పరికరం కాబట్టి విద్యుత్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కూలర్ బాడీకి ఎర్తింగ్ సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. వైర్లు ఎక్కడైనా కట్ అయ్యాయేమో తరచుగా తనిఖీ చేయాలి. కూలర్‌లో నీరు నింపేటప్పుడు స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోవద్దు.

Read also-Air Cooler Buying Tips: బెస్ట్ కూలర్‌ ఎంచుకునే 4 చిట్కాలు.. వీటిని పాటించకపోతే.. మీ డబ్బు వృథానే!

ఆరోగ్య సమస్యలు

కూలర్ నుంచి వచ్చే గాలి నేరుగా ముఖం మీద పడకుండా చూసుకోవాలి. చల్లని గాలి నేరుగా పడటం వల్ల కీళ్ల నొప్పులు, సైనస్ లేదా జలుబు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు ఉన్న ఇంట్లో కూలర్ గాలి గది అంతా ప్రసరించేలా సెట్టింగ్స్ మార్చుకోవాలి. వేసవి తాపాన్ని తట్టుకోవడానికి కూలర్ మంచి సాధనమే, కానీ పైన పేర్కొన్న జాగ్రత్తలు పాటించినప్పుడే అది సురక్షితమైన చల్లదనాన్ని ఇస్తుంది. కేవలం గాలి కోసం కాకుండా, మీ ఆరోగ్యం భద్రత గురించి ఆలోచిస్తూ కూలర్‌ను నిర్వహించడం చాలా అవసరం.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×