E-Paper
Advertisement

Norton Atlas: ఇండియన్ రోడ్లపై నార్టన్ అట్లాస్ టెస్టింగ్, లాంచింగ్ ఎప్పుడంటే?

Norton Atlas: ఇండియన్ రోడ్లపై నార్టన్ అట్లాస్ టెస్టింగ్, లాంచింగ్ ఎప్పుడంటే?
Advertisement

నార్టన్ అట్లాస్ బైక్.. ఈ ఏడాది మార్కెట్ లోకి విడుదల కాబోతోంది. మిడిల్‌ వెయిట్ అడ్వెంచర్ టూరింగ్ మోటార్‌ సైకిల్ గా వినియోగదారుల ముందుకు రానుంది. 585cc ప్యారలల్ ట్విన్ ఇంజిన్‌ తో వచ్చే ఈ బైక్, స్టాండర్డ్, GT వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. TVS మోటార్ కంపెనీ సపోర్టుతో నార్టన్ ఈ బైక్‌ ను భారత్ లో చేసి, మార్కెట్ లో అందుబాటులో ఉంచబోతోంది.

టెస్టింగ్ దశలో నార్టన్ అట్లాస్

ఇక ఈ నార్టన్ అట్లాస్ భారత్ లో మరోసారి టెస్టింగ్ జరపుకుంటుంది. దాని అధికారిక అరంగేట్రం కంటే ముందే ఈ మోటార్ సైకిల్ కు సంబంధించిన వివరాలు కొన్ని బయటకు వచ్చాయి. తాజాగా స్పై ఇమేజ్  వెలుగులోకి వచ్చాయి. ఈ ఫోటోలు బైక్ మోడల్ గురించి కొన్ని వివరాలను వెల్లడిస్తుంది. ఈ ప్రత్యేకమైన టెస్ట్ బైక్ కంప్లీట్ ఇంజిన్ ప్రొటెక్షన్, USD ఫోర్క్ లకు గోల్డెన్ కలర్ ఫినిషింగ్ తో కనిపించింది. మొత్తం స్టైలింగ్ కు ప్రీమియం టచ్ ను అందిస్తుంది. నార్టన్ అట్లాస్ మస్క్యులర్ ఫ్రంట్ ఫెయిరింగ్, ప్రత్యేకమైన LED హెడ్ ల్యాంప్, పొడవైన విండ్ స్క్రీన్ తో క్లీన్, సూపర్ డిజైన్ ను కలిగి ఉంది.

నార్టన్ అట్లాస్ ఎలా కనిపిస్తుందంటే?

Advertisement

ప్రోటోటైప్ ప్రామాణిక వెర్షన్ గా కనిపిస్తుంది. ఇది దాని 19 అంగుళాల ముందు, 17 అంగుళాల వెనుక చక్రాల సెటప్ ను కలిగి ఉంటుంది. EICMA లో ముందుగా ప్రదర్శించబడిన అట్లాస్ ట్యూబ్ లెస్ వైర్ స్పోక్ వీల్స్ ను కలిగి ఉంది. అయితే, ఇండియా స్పెక్ మోడల్ బదులుగా అల్లాయ్ వీల్స్ ను ఉపయోగిస్తుందని భావిస్తున్నారు. తాజా స్పై షాట్స్ వీల్ రకాన్ని స్పష్టంగా చూపించనప్పటికీ, మునుపటి టెస్ట్ మ్యూల్స్ అల్లాయ్ వీల్స్ మాదిరిగానే ఉన్నాయి. ట్యూబ్‌ లెస్ వైర్ స్పోక్ వీల్స్ అల్లాయ్ వీల్స్ కంటే చాలా ఖరీదైనవి. ఈ నేపథ్యంలో TVS ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా, కంపెనీ భారతీయ మార్కెట్ కోసం అట్లాస్ ధరను మరింత తగ్గించే అవకాశం కనిపిస్తుంది.

నార్టన్ అట్లాస్ ఇంజిన్ గురించి..

అట్లాస్‌కు శక్తినిచ్చేది 585cc, లిక్విడ్ కూల్డ్, ప్యారలల్ ట్విన్ ఇంజిన్, 270 డిగ్రీల క్రాంక్, ఆరు స్పీడ్ గేర్‌ బాక్స్‌ తో ఉంటుంది. మోటారు దాదాపు 70bhp పవర్ ఉత్పత్తి చేస్తుందని భావిస్తున్నారు. మోటార్‌ సైకిల్ కనెక్టివిటీ, పలు రైడింగ్ మోడ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, ఇతర ఎలక్ట్రానిక్ రైడర్ ఎయిడ్‌ లతో 8 అంగుళాల TFT డిస్‌ ప్లేను కలిగి ఉంటుంది.

TVS బైకులతో పాటే తయారీ!

Advertisement

నార్టన్ అట్లాస్‌ను TVS హోసూర్ లో TVS అపాచీ RTX 300, BMW F 450 GS వంటి ఇతర మోడళ్లతో పాటు తయారు చేస్తారు. అట్లాస్ మొదట్లో 2026 మిడిల్ ఇయర్ లో విడుదల అవుతుందని భావించినప్పటికీ, RTX 300 డెలివరీలు ప్రభావితం అయ్యే ప్రభావితం అవకాశం ఉన్న నేపథ్యంలో F 450 GS లాంచ్ అట్లాస్ అరంగేట్రాన్ని 2026 చివరి వరకు తీసుకెళ్లవచ్చని భావిస్తున్నారు.

Read Also: ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనాలనుకుంటున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×