E-Paper
Advertisement

Accenture AI: ఏఐ నేర్చుకుంటేనే ప్రమోషన్ లేకుంటే ఉద్యోగ గండం.. ఉద్యోగులకు హెచ్చరించిన ఐటి కంపెనీ

Accenture AI: ఏఐ నేర్చుకుంటేనే ప్రమోషన్ లేకుంటే ఉద్యోగ గండం.. ఉద్యోగులకు హెచ్చరించిన ఐటి కంపెనీ
Advertisement

Accenture AI Employees| ఐటీ రంగంలో ఇప్పుడు అన్ని కంపెనీలు ఏఐ టెక్నాలజీ బాట పట్టాయి. ఏఐ స్కిల్స్ ఉన్న ఉద్యోగులకు వేతనంలో పెంపు, ప్రమోషన్లు ఇస్తున్నాయి. ప్రముఖ ఐటీ కంపెనీ యాక్సెంచర్ కూడా ఇప్పుడు తమ ఉద్యోగులు.. AI టూల్స్ ఎంత ఉపయోగిస్తున్నారో ట్రాక్ చేస్తోంది. ఉద్యోగులకు ప్రమోషన్ ఇచ్చేందుకు విధించిన షరతుల్లో AI ఉపయోగం ముఖ్య అంశంగా మారింది. సీనియర్ మేనేజర్లు, అసోసియేట్ డైరెక్టర్ల పదవుల్లో ఉన్నవారికైతే ఏఐ స్కిల్స్ తప్పనిసరిగా అయింది. లీడర్‌షిప్ పదువుల్లో ప్రమోషన్ కావాలంటే రెగ్యులర్‌గా AI ఉపయోగం చేయాల్సిందే. చూపించాలి. కంపెనీ కార్యకలాపాల్లో AIని పూర్తిగా ఇంటిగ్రేట్ చేసేందుకే కంపెనీ సీనియర్ మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. టాప్ రోల్స్ కోసం పోటీ పడేవారు AIని నిరంతరం ఉపయోగించాలి.

వీక్లీ AI లాగిన్ డేటా రివ్యూ

ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం.. ఉద్యోగులకు కంపెనీ ఇంటర్నల్ ఈమెయిల్ పంపింది. ఈ ఈమెయిల్‌లో కొత్త మానిటరింగ్ నియమాలు వివరించారు. ఈ నెల నుంచి వీక్లీ AI టూల్స్ లాగిన్ డేటాను ట్రాక్ చేస్తోంది. ప్రమోషన్ చర్చల్లో AI ఉపయోగం డేటా చూపిస్తారు. కంపెనీ AI ప్లాట్‌ఫామ్‌లతో ఎంగేజ్‌మెంట్ లీడర్‌షిప్ ఎవాల్యుయేషన్‌లో భాగం. మొదట సీనియర్ ఉద్యోగులకు ఈ నియమం అమలు అవుతోంది. యాక్సెంచర్‌లో 5.5 లక్షల మందికి పైగా జనరేటివ్ AI ట్రైనింగ్ ఇచ్చారు. AI ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌లను మరింత విస్తరిస్తున్నారు.

కీ AI ప్లాట్‌ఫామ్స్ ఉపయోగించాలి

Advertisement

యాక్సెంచర్ రెండు ప్రధాన ఇంటర్నల్ AI టూల్స్‌ను ప్రమోట్ చేస్తోంది. AI Refinery, SynOps అనే ఈ రెండు సీనియర్ ఉద్యోగులు తప్పనిసరిగా ఉపయోగించాలి. AI Refinery.. రా AI టెక్నాలజీని ప్రాక్టికల్ సొల్యూషన్లుగా మారుస్తుంది. ఎంటర్‌ప్రైజ్ లెవల్ AI డెప్లాయ్‌మెంట్‌కు సహాయపడుతుంది. SynOps డేటా, డిజిటల్ సిస్టమ్స్, హ్యూమన్ ఎక్స్‌పర్టైజ్‌ను కలిపి బిజినెస్ ఆపరేషన్స్‌ను ఆటోమేట్ చేస్తుంది. దీన్ని హ్యూమన్-మెషిన్ ఇంజిన్ సిస్టమ్‌గా ఐటీ నిపుణులు పేర్కొన్నారు. సీనియర్ ప్రొఫెషనల్స్ ఈ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించాలని లీడర్‌షిప్ ఆశిస్తోంది. AI నిరంతర కన్సల్టింగ్ కెపాసిటీని పెంచుతుందని మేనేజ్‌మెంట్ అభిప్రాయపడుతున్నారు.

వ్యతిరేకిస్తున్న సీనియర్ స్టాఫ్

రిపోర్టుల ప్రకారం.. ఐటీ ఉద్యోగులు ఈ కొత్త మార్పులను అంత త్వరగా అంగీకరించడం లేదు. జూనియర్ ఉద్యోగులు AI టూల్స్‌ నేర్చుకోవడానికి మక్కువ చూపుతున్నారు. కానీ సీనియర్ మేనేజర్లు, పార్టనర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడు పెద్ద కన్సల్టింగ్ ఫర్మ్‌ల ఎగ్జిక్యూటివ్‌లు ఈ విషయం షేర్ చేశారు. సీనియర్ ప్రొఫెషనల్స్ AI అడాప్షన్‌పై ఇష్టం లేకుండా ఉన్నారని చెప్పారు. కొందరు లీడర్‌షిప్ టీమ్‌లు “క్యారెట్ అండ్ స్టిక్” అప్రోచ్ ఉపయోగిస్తున్నారు. కంపెనీలు ఒకవైపు ఇన్‌సెంటివ్స్ ఇస్తూనే సరైన పనితీరు చూపించని వారిపై ఒత్తిడి కూడా చేస్తున్నారు. ఒక కంపెనీ ఇన్‌సైడర్ మాత్రం కంపెనీ పాలసీపై విమర్శలు చేశాడు. తనపై ఒత్తిడి చేస్తే రాజీనామా చేస్తానని చెప్పాడు. కొందరు ఉద్యోగులైతే కంపెనీ ఇంటర్నల్ AI టూల్స్‌కు అంతగా ప్రాక్టికల్ వాల్యూ లేదని అనుమానిస్తున్నారు.

పాలసీ మినహాయింపులు ఆర్గనైజేషన్ మార్పులు

Advertisement

కంపెనీ ఈ పాలసీని ప్రపంచవ్యాప్తంగా అమలు చేయడం లేదు. 12 యూరోపియన్ దేశాల్లోని ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చింది. US ఫెడరల్ కాంట్రాక్ట్స్ యూనిట్ కూడా మినహాయించబడింది. యాక్సెంచర్‌లో దాదాపు 8 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం కంపెనీ పెద్ద రీఆర్గనైజేషన్ చేస్తోంది. స్ట్రాటజీ, కన్సల్టింగ్, క్రియేటివ్, టెక్నాలజీ, ఆపరేషన్స్ డివిజన్లను కలిపింది. కొత్త డివిజన్ పేరు “Reinvention Services”. ఈ స్ట్రక్చర్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ గోల్స్‌కు సహాయపడుతుందని లీడర్‌షిప్ నమ్ముతోంది.

వార్నింగ్ ఇచ్చిన మేనేజ్‌మెంట్ 

CEO జూలీ స్వీట్ AI అడాప్షన్ పై స్పందించారు. AI యుగానికి అనుగుణంగా ఉద్యోగులు మారాలని హెచ్చరించారు. మార్పులకు స్వీకరించని వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. లండన్ బేస్డ్ AI స్టార్టప్ Facultyని యాక్సెంచర్ అక్వైర్ చేసింది. ఇది AI ఆధారిత బిజినెస్ ట్రాన్స్‌ఫర్మేషన్ సర్వీసెస్‌ను విస్తరిస్తుంది. AI ఫ్యూచర్ కన్సల్టింగ్ వర్క్‌కు సెంట్రల్ అని మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

Also Read: బాగా పనిచేసే ల్యాప్‌టాప్ ఒక్కసారిగా పనిచేయడం లేదా? ఇవే కారణాలు

కన్సల్టింగ్‌లో కల్చరల్ షిఫ్ట్

కన్సల్టింగ్ ఇండస్ట్రీ డిజిటల్ డిస్రప్షన్ ఎదుర్కొంటోంది. AI టూల్స్ వర్క్‌ఫ్లోలు, క్లయింట్ ఎక్స్‌పెక్టేషన్లను మారుస్తున్నాయి. సీనియర్ లీడర్లు టెక్నాలజీ అడాప్షన్‌కు మోడల్ అవ్వాలని కంపెనీలు భావిస్తున్నాయి. యాక్సెంచర్ నిర్ణయం ఇండస్ట్రీ ట్రెండ్‌ను ప్రతిబింబిస్తోంది. సీనియర్ ప్రొఫెషనల్స్ ఇన్నోవేషన్‌కు చాంపియన్ అవ్వాలి. AI లిటరసీ త్వరలో లీడర్‌షిప్ రోల్స్‌కు తప్పనిసరి అవుతుంది. పెర్ఫామెన్స్ ఎవాల్యుయేషన్‌లో టెక్నాలజీ ఎంగేజ్‌మెంట్ భాగమైంది. కెరీర్ గ్రోత్ డిజిటల్ స్కిల్స్ మీద ఆధారపడుతోంది. ఉద్యోగులకు యాక్సెంచర్ స్పష్టమైన మెసేజ్ ఇచ్చింది. కెరీర్ అడ్వాన్స్‌మెంట్ కావాలంటే ఏఐ అడాప్షన్ ఆప్షనల్ కాదు తప్పనిసరి.

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×